Cardiac Surgeon dies: తమిళనాడులోని ఓ ఆస్పత్రిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. 39 ఏళ్ల హృదయ శస్త్ర చికిత్స నిపుణుడు.. ఆస్పత్రిలో రౌండ్లు చేస్తున్న సమయంలో గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో ఆస్పత్రిలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.
వివరాల్లోకి వెళ్తే…
చెన్నైలోని సేవిత మెడికల్ కాలేజీ (Saveetha Medical College)లో కన్సల్టెంట్ కార్డియాక్ సర్జన్ (Consultant cardiac surgeon)గా పనిచేస్తున్న డాక్టర్ గ్రాడ్లిన్ రాయ్ (Dr Gradlin Roy) బుధవారం ఆసుపత్రిలోనే కుప్పకూలారు. ఈ విషయాన్ని హైదరాబాద్‌కు చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ (Dr. Sudhir Kumar) స్పష్టం చేశారు. డాక్టర్ రాయ్ సహచరులు ఆయనను కాపాడేందుకు ఎంతగా ప్రయత్నించినప్పటికీ.. ఫలితం లేకుండా పోయిందని డా. సుధీర్ తెలిపారు.
When the Healer Falls: A Wake-Up Call for Doctors’ Heart Health
💔Yesterday morning brought heartbreaking news.
Dr. Gradlin Roy, a 39-year-old cardiac surgeon, collapsed during ward rounds. Colleagues fought valiantly-CPR, urgent angioplasty with stenting, intra-aortic balloon… pic.twitter.com/cS8ViaYeYv— Dr Sudhir Kumar MD DM (@hyderabaddoctor) August 28, 2025
అన్ని చికిత్సలు చేసినా..
‘డా. రాయ్ సహచరులు ధైర్యంగా పోరాడారు. సీపీఆర్, అత్యవసర యాంజియోప్లాస్టీతో స్టెంటింగ్, ఇన్‌ట్రా ఔర్టిక్ బెలూన్ పంప్, ECMO కూడా చేశారు. కానీ ఎడమ మెయిన్ ఆర్టరీ 100% బ్లాకేజ్ వల్ల వచ్చి భారీ గుండెపోటు అతడ్ని కోలుకోనివ్వలేదు’ అని డా. సుధీర్ ఎక్స్ వేదికగా చెప్పుకొచ్చారు.
Also Read: Peddi Movie: రామ్ చరణ్ ‘పెద్ది’ గురించి అలా చెప్పేశావేంటి భయ్యా..
ఈ ఘటన ఓ మేల్కొలుపు
గుండెపోటుతో హార్ట్ స్పెషలిస్ట్ చనిపోవడం ఇదే తొలిసారి కాదని డా. సుధీర్ తెలిపారు. డాక్టర్ రాయ్ తరహాలో 30-40 వయసులో ఉన్న యువ వైద్యులు అకస్మాత్తుగా గుండె సంబంధిత సమస్యలకు గురవుతున్నారని గుర్తుచేశారు. వైద్యుల్లో పెరిగిపోతున్న ఈ తరహా ఘటనలు ఆందోళన కలిగిస్తున్నట్లు డా. సుధీర్ పేర్కొనారు. విశ్రాంతి లేకుండా దీర్ఘకాలం పనిచేయడమే దీనికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. వైద్యులు సాధారణంగా రోజుకు 12-18 గంటలు, కొన్నిసార్లు ఒకే షిఫ్టులో 24 గంటలకు మించి కూడా పనిచేయాల్సి వస్తుందని గుర్తుచేశారు.
Also Read: Viral Video: మీ ఫ్రెండ్ షిప్ తగలెయ్య.. సెలైన్‌తో ఉన్న స్నేహితుడితో.. బైక్ రైడ్ ఏంట్రా!
మానసిక ఒత్తిడి..
వైద్య వృత్తిలో నిత్యం ఎదురయ్యే మానసిక ఒత్తిడి కూడా వైద్యుల్లో గుండెపోటు సహా ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. రోగుల ప్రాణాలను కాపాడేందుకు తీసుకోవాల్సిన తక్షణ నిర్ణయాలు.. న్యాయపరమైన భయాలు కలిపి వైద్యులపై మరింత భారాన్ని పెంచుతున్నట్లు చెబుతున్నారు. వీటికి తోడు అనారోగ్యకరమైన జీవనశైలి, సమయానికి భోజనం చేయకపోవడం, వ్యాయామ లోపం, ఆరోగ్య పరీక్షలను నిర్లక్ష్యం చేయడం, డిప్రెషన్ ను లెక్కచేయకపోవడం కూడా వైద్యుల మరణాలకు కారణమవుతున్నాయి.