peddi(image :X)
ఎంటర్‌టైన్మెంట్

Peddi Movie: రామ్ చరణ్ ‘పెద్ది’ గురించి అలా చెప్పేశావేంటి భయ్యా..

Peddi Movie: ‘లిటిల్ హార్ట్స్’ సినిమాలో హీరోగా నటించిన మౌళి సినిమా ప్రమోషన్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంలో ఓ యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘పెద్ది’ సినిమా గురించి ఒక విషయం చెప్పేశాడు. తన సినిమా కెమెరామెన్ పెద్దికి అసోసియేట్ గా చేస్తున్నారని, ఓ సందర్భంలో అక్కడకు వెళ్లాల్సి వస్తే అక్కడ సెట్లు చూసి ఆశ్చర్యపోయానన్నారు. క్రికెట్ సెట్ అయితే అప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా సెట్లు వేశారన్నారు. దానిని చూస్తుంటే ఒక్కసారిగా పాత కాలంలోకి వెళ్లిపోయానని, అంత అద్భుతంగా సెట్ వేశారని చెప్పుకొచ్చారు. దీనిని చూసిన రామ్ చరణ్ ఫ్యాన్స్ మౌళిపై మండిపడుతున్నారు. ఎంత చూస్తే మాత్రం ఇలా చెప్పడం ఏంటని ఫైర్ అవుతున్నారు. మరికొందరు అయితే ఇలా చెప్పడం ఒక విధంగా మంచిదే అని, దీనివల్ల సినిమాకు హైప్ పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా మౌళీ అలాచెప్పడం కరెక్ట్ కాదని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

Read also-Sathyaraj: రజినీకాంత్, సత్యరాజ్‌ల మధ్య వివాదమేంటి? 38 ఏళ్లు రజినీ సినిమాల్లో సత్యరాజ్ ఎందుకు చేయలేదు?

రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ (Peddi Movie) సినిమా టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తికరమైన పాన్-ఇండియా చిత్రాల్లో ఒకటిగా రూపొందుతోంది. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా స్పోర్ట్స్ మరియు గ్రామీణ నేపథ్యంలో రఫ్ అండ్ టఫ్ కథాంశంతో రూపొందుతోంది. రామ్ చరణ్ మాస్ రగ్గడ్ లుక్‌లో కనిపించనున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా, విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం, జానీ మాస్టర్ కొరియోగ్రఫీతో 1000 మంది డాన్సర్లతో చిత్రీకరించిన భారీ సాంగ్ ఈ సినిమా హైలైట్‌గా నిలుస్తుంది. 2026 మార్చి 27న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను సృష్టించే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి.

Read also-Ganesh immersion: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనానికి ఏర్పాట్లు.. అధికారుల ప్లానింగ్ ఇదే

ఇటీవల వినాయక చవితి సందర్భంగా విడుదలైన షూటింగ్ అప్‌డేట్‌లో రామ్ చరణ్ క్రేజీ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఆడియో రైట్స్ రికార్డ్ స్థాయిలో అమ్ముడుపోయాయని, రామ్ చరణ్ క్రేజ్‌ను మరోసారి నిరూపించాయని అభిమానులు చర్చించుకుంటున్నారు. ‘గేమ్ చేంజర్’ నిరాశపరిచిన తర్వాత, ‘పెద్ది’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్, పోస్టర్స్, గ్లింప్స్‌లు హైప్‌ను పెంచగా, ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి.

 

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!