Ganesh immersion
తెలంగాణ, హైదరాబాద్

Ganesh immersion: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనానికి ఏర్పాట్లు.. అధికారుల ప్లానింగ్ ఇదే

Ganesh immersion: గణేశ్ నిమజ్జనానికి ఏర్పాట్లు

వేడుకల్లో స్వచ్ఛతకు పెద్ద పీట
మూడు షిఫ్ట్‌లలో 14,486 మంది సిబ్బంది విధి నిర్వహణ
74 కృత్రిమ చెరువుల ఏర్పాటు
తొలి రోజు సాగర్ చుట్టూ 19 క్రేన్లు
ఫైనల్ నిమజ్జనానికి గ్రేటర్‌లో 404 క్రేన్లు ఏర్పాటు
6వ తేదీ వరకు హుస్సేన్ సాగర్ చుట్టూ ఆంక్షలు అమలు

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: భక్తుల పూజలు ఘనంగా అందుకుంటున్న గణనాథుడి నిమజ్జన ప్రక్రియ హైదరాబాద్ మహానగరంలో మొదలైంది. ఈ నెల 27న సిటీలోని గల్లీ గల్లీలో ఏర్పాటు చేసిన మండపాల్లో కొలువుదీరిన గణనాధుల్లో కొన్ని విగ్రహాలు మూడు రోజుల వేడుకలను పూర్తి చేసుకుని శుక్రవారం నిమజ్జనం కోసం హుస్సేన్ సాగర్ వైపు కదిలాయి. నిమజ్జనానికి గ్రేటర్ హైదరాబాద్ అంతటా జీహెచ్ఎంసీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. నిమజ్జనం తొలి రోజైన శుక్రవారం ఒక్క రోజే సాగర్ చుట్టూ 19 క్రేన్లను ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ, వచ్చే నెల 6న జరగనున్న ఫైనల్ నిమజ్జనానికి గ్రేటర్ పరిధిలోని వివిధ చెరువులు, బేబీ పాండ్ల వద్ద మొత్తం 404 క్రేన్లను ఏర్పాటు చేయనుంది. నిమజ్జనం తొలి రోజైన శుక్రవారం నుంచి వచ్చే నెల 6 వరకు జీహెచ్ఎంసీ, పోలీసు శాఖ హుస్సేన్ సాగర్ చుట్టూ ఆంక్షలను అమలు చేస్తోంది. మధ్యాహ్నాం 3 గంటల నుంచి వివిధ రూట్లలో ట్రాఫిక్‌ను దారి మళ్లించేలా ప్లాన్ చేశాయి. ముఖ్యంగా గణేశ్ నిమజ్జనాన్ని సజావుగా, సురక్షితంగా నిర్వహించేందుకు వీలుగా జీహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.

Read Also- Sikh man Shot Dead: నడిరోడ్డుపై సిక్కు వ్యక్తిని కాల్చిచంపిన అమెరికా పోలీసులు.. వీడియో ఇదిగో

పోలీస్ శాఖ, హైడ్రా, ట్రాఫిక్, రెవెన్యూ, ఇరిగేషన్ , వాటర్ బోర్డు, వైద్య ఆరోగ్య శాఖ, ఆర్‌అండ్‌బీ, పర్యాటక శాఖ, విద్యుత్, ఇతర ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేస్తూ, నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరకుండా నిర్వహించేలా ప్లాన్ సిద్దం చేసింది. బాలాపూర్ వినాయకుడి శోభయాత్ర జరిగే 21 కిలోమీటర్ల రూట్‌తో పాటు ఖైరతాబాద్ బడా గణపయ్య నిమజ్జనం, ఫైనల్ నిమజ్జనంపై ఇప్పటి నుంచే జీహెచ్ఎంసీ ఫోకస్ చేసింది. మొత్తం వివిధ రూట్లలో కలిపి సుమారు 839.42 కిలోమీటర్ల పొడువున శోభయాత్రలు జరగనున్నట్లు, ఆయా రూట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా, నిమజ్జనానికి వస్తున్న విగ్రహాలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ముందు జాగ్రత్తగా రోడ్లపై గుంతలను కూడా జీహెచ్ఎంసీ పూడ్చింది.

ప్రధాన చెరువులతో పాటు 74 కృత్రిమ కుంటలలో నిమజ్జనం ప్రక్రియ మొదలైంది. ఈసారి నిమజ్జనం హుస్సేన్ సాగర్, సరూర్ నగర్ చెరువు, ఐడీఎల్ చెరువు, సఫిల్‌గూడ చెరువు, సున్నం చెరువు సహా 20 ప్రధాన చెరువుల్లో ఏర్పాట్లు చేశారు. అదనంగా 74 కృత్రిమ నిమజ్జన కేంద్రాలు (బేబీ పాండ్లు, మట్టికుంటలు, తవ్వకం కుంటలు, పోర్టబుల్ ట్యాంకులు, మొబైల్ కుంటలు) జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. దీంతో ప్రధాన చెరువులపై నిమజ్జన ఒత్తిడి తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా జరిగే నిమజ్జన ప్రక్రియను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

Read Also- Nagarkurnool: యూరియా రేటు పెంచి అమ్మితే చర్యలు.. నాగర్‌కర్నూలు ఎమ్మెల్యే, కలెక్టర్ హెచ్చరిక

నిమజ్జనం వేగంగా, సురక్షితంగా, సాఫీగా జరిగేలా 134 స్టాటిక్ క్రేన్లు, 269 మొబైల్ క్రేన్లు సిద్ధం చేశారు. పర్యాటక శాఖ, హైడ్రా సమన్వయంతో హుస్సేన్ సాగర్ వద్ద ప్రత్యేకంగా 9 పడవలు, 16 డీఆర్‌ఎఫ్‌ బృందాలు, 200 ఈతగాళ్లను జీహెచ్ఎంసీ అందుబాటులో ఉంచనుంది. 839.42 కి.మీ. ఊరేగింపు మార్గాల్లో అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలు, వేలాడే వైర్ల తొలగింపు పనులు పూర్తయినట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. 14 వేల 486 సిబ్బందితో స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 160 గణేశ్ యాక్షన్ టీమ్‌లు మూడు షిఫ్ట్ లలో నిరంతరాయంగా విధులు నిర్వహించేలా జీహెచ్ఎంసీ కార్యచరణను సిద్దం చేసింది. గణేష్ మండపాల వద్ద వ్యర్థాల సేకరణకు 5 లక్షల ట్రాష్ బ్యాగులు పంపిణీ చేయగా, అదనంగా 2,000 స్వీపర్లు, 102 మినీ టిప్పర్లు, 125 జేసీబీలు, 30 స్వీపింగ్ మెషిన్లు నిమజ్జన చెత్త తొలగింపు విధులు నిర్వర్తించనున్నాయి. నిమజ్జనం లో పాల్గొనే భక్తులు, నిమజ్జనాన్ని తిలకించేందుకు వచ్చే ప్రజా సౌకర్యాలకు కూడా జీహెచ్ఎంసీ తగిన ప్రాధాన్యతనిస్తుంది. ప్రజల కోసం 309 మొబైల్ టాయిలెట్స్, 56 వేల 187 లైటింగ్ పాయింట్లు ఏర్పాటు చేసింది. ఆరోగ్య భద్రత కోసం 7 మెడికల్ క్యాంపులు, అంబులెన్స్ లతో మూడు షిఫ్ట్ లలో విధులు నిర్వర్తించేలా ఏర్పాట్లు చేశారు. జీహెచ్ఎంసీ కొద్ది రోజుల నుంచి నిర్వహిస్తున్న రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 10 వేల 269 పైగా గుంతలను ఆయా నిమజ్జన రూట్లలో పూడ్చివేసినట్లు అధికారులు తెలిపారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!