Viral Video: స్నేహం కొన్నిసార్లు మనుషుల్ని ఊహించని పనులు చేయిస్తుందనే మాట నిజమే. తాజాగా మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో జరిగిన ఈ ఘటన దానిని రుజువు చేస్తోంది. ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్నేహితుడ్ని ఇద్దరు మిత్రులు బైక్ పై రైడ్ కు తీసుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ‘ఇదేం ఫ్రెండ్ షిప్ రా అయ్యా’ అంటూ పెదవి విరుస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ 16 సెకన్ల వీడియో.. ఝాన్సీ రోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాకా చంద్రవద్నీ ప్రాంతంలో జరిగింది. వీడియోలో ముగ్గురు యువకులు ఒక మోటార్ సైకిల్‌పై ప్రయాణిస్తుండగా మధ్యలో అనారోగ్యంతో ఉన్న రోగి కూర్చొని ఉన్నాడు. అతడి చేతికి సెలైన్ కూడా తగిలించి ఉంది. తీసుకెళ్తున్న స్నేహితుల్లో ఒకరు బైక్ నడుపుతుండగా మరొకరు సెలైన్ స్టాండ్‌ను పట్టుకుని రోగి వెనక కూర్చొని ఉన్నాడు. అయితే కొద్దిసేపు చక్కర్లు కొట్టిన తర్వాత వారు తిరిగి ఆస్పత్రికి వచ్చారని వైద్యులు తెలిపారు.
నెటిజన్ల భిన్నాభిప్రాయాలు
సెలైన్ ఉన్న స్నేహితుడ్ని బైక్ తీసుకెళ్లిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు వీడియో చూసి ఫన్నీగా కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు రోగిని ఇంత నిర్లక్ష్యంగా బయటకు పంపిన ఆస్పత్రి సిబ్బందిపై కూడా మండిపడుతున్నారు. ఆస్పత్రుల్లో ఉన్న భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
Also Read: Soundarya: ఆ రహస్యం బట్టబయలు.. సౌందర్య మరణించిన తర్వాత.. హిమాలయాలకు వెళ్లి పూజలు చేసిన స్టార్ హీరో?
‘వారి స్నేహం ముచ్చటేస్తోంది’
వైరల్ వీడియోపై ఒక నెటిజన్ స్పందిస్తూ ‘ముందుగా నిజం ఏమిటో తెలుసుకోండి. ఆసుపత్రిలో ఉన్నవాడు తన స్నేహితుడిని పిలిచి కొద్దిసేపు బయటికి తీసుకెళ్ళమని చెప్పి ఉండొచ్చు. ఆసుపత్రిలో బోర్ కొట్టడంతో కాస్త బయటికి వెళ్లి మానసిక ఉల్లాసం పొందాలని అనుకుని ఉండవచ్చు’ అని అన్నారు. ఇంకొకరు వ్యాఖ్యానిస్తూ ‘మధ్యప్రదేశ్ పోలీస్ గారికి వందనాలు. నేరాలు పెరుగుతున్న ఈ రోజుల్లో ఇలాంటి వీడియోలు స్నేహబంధాన్ని చూసి మనసుకు సంతోషాన్ని ఇస్తాయి. దయచేసి చర్యలు తీసుకోకుండా వదిలేయండి’ అని రాశారు.
A young man, who is still on a saline drip, is seen being taken by his friends on a bike ride in Gwalior.#Gwalior #friends #salinedrip #bikeride #nenewstv pic.twitter.com/OtUKU5GTha
— NENewsTV (@NENEWS24x7) August 28, 2025
Also Read: PM Modi Japan Visit: మోదీ నా మజాకా.. జపాన్ ప్రధానితో కలిసి.. బుల్లెట్ ట్రైన్‌లో రయ్ రయ్!
రంగంలోకి దిగిన పోలీసులు
అయితే ఈ ఆసక్తికర వీడియో వెనక ఉన్న అసలైన కారణం ఇంకా బయటకు రాలేదు. వారు రోగిని సరదా కోసం బయటకు తీసుకు వచ్చారా? లేక వేరే అవసరమా? అనేది తెలియరాలేదు. అయితే వైరల్ వీడియోపై అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గ్లాలియర్ పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారని స్థానిక మీడియా పేర్కొంది.
