G-Kishan-Reddy
తెలంగాణ

Kishan Reddy: జన్‌ధన్ యోజనకు 11 ఏండ్లు పూర్తి.. దేశవ్యాప్తంగా 56 కోట్ల ఖాతాలు

Kishan Reddy: సమ్మిళిత ఆర్థికాభివృద్ధిని పెంపొందించేందుకు ప్రధాని మోడీ తీసుకొచ్చిన ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన విజయవంతంగా 11 ఏండ్లు పూర్తి చేసుకుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2014కు ముందు దేశవ్యాప్తంగా మొత్తం 3.35 కోట్ల బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లు (జీరోబ్యాలెన్స్ అకౌంట్లు) మాత్రమే ఉండగా.. వాటిలో ఖాతాదారులు జమ చేసుకున్న మొత్తం డబ్బు రూ.960 కోట్లుగా ఉందన్నారు. మోడీ ప్రధాని అయ్యాక బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లను జన్‌ ధన్ ఖాతాలుగా మార్చిందన్నారు. ఈ సంస్కరణల ఫలితంగా 2014 నుంచి ఇప్పటివరకు.. 11 ఏండ్లలో జన్‌ ధన్ బ్యాంకు అకౌంట్ల సంఖ్య 56 కోట్లకు పెరగగా.. అందులో ఖాతాదారులు జమచేసుకున్న మొత్తం రూ.2.68 లక్షల కోట్ల నగదు ఉందని తెలిపారు. దీని ప్రకారం సామాన్యుల బ్యాంకు ఖాతాల్లో 1,572 శాతం(16 రెట్లు) వృద్ధి జరిగిందన్నారు. ఆ ఖాతాదారులు జమ చేసుకున్న మొత్తంలో 27,816 శాతం (278 రెట్లు) పెరుగుదల నమోదైందన్నారు.

సామాజిక విప్లవం
ఇదిలా ఉండగా తెలంగాణలో జన్‌ధన్ యోజన పథకంలో భాగంగా 1.3 కోట్ల అకౌంట్లు తెరవగా.. అందులో ఖాతాదారులు రూ.5,055.35 కోట్లు జమ చేసుకున్నారని తెలిపారు. ఈ జన్‌ధన్ ఖాతాల్లో 56 శాతం కన్నా ఎక్కువ ఖాతాలు మహిళల పేరుతోనే ఉన్నాయని, దీన్నిబట్టి జన్‌ధన్ యోజన కేవలం ఆర్థిక విప్లవం మాత్రమే కాదు.. సామాజిక విప్లవమని అర్థమవుతోందన్నారు. ఒకప్పుడు బ్యాంకు ఖాతా తెరవడమే ఒక కలగా ఉన్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనే దాదాపు 67 శాతం ఖాతాలు ఉన్నట్లుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. జన్‌ధన్ యోజన ద్వారా కేవలం 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.6.9 లక్షల కోట్ల నగదును లబ్ధిదారుల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం జమ చేసినట్లు తెలిపారు.

Also Read- Sridevi Vijaykumar: మీరేంటో చెప్పడానికి మాటలు చాలవు నాన్న.. శ్రీదేవి విజయ్ కుమార్ పోస్ట్ వైరల్

బలమైన సప్లయ్ చైన్‌
భారత్-జపాన్ మధ్య మైత్రి మరింత బలోపేతం చేసే దిశగా జపాన్ లో భారత ప్రధాని మోడీ పర్యటన కొనసాగుతోందని కిషన్ రెడ్డి తెలిపారు. భారత్-జపాన్ 15వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు టోక్యో చేరుకున్న ప్రధాని మోడీ.., జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారన్నారు. ఇందులో భాగంగా.. ఆర్థిక, ఆరోగ్య, మొబిలిటీలో భాగస్వామ్యం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటుగా క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ రంగాల్లో పరస్పర సహకారంపై ఇరుదేశాల ప్రతినిధులు కీలకమైన చర్చలు జరిపారన్నారు. అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం కొనసాగుతున్న ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్‌ను మరింతగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా.. భారత గనుల శాఖ, జపాన్ ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ మధ్య పరస్పర సహకార ఒప్పందం కుదిరిందన్నారు. ఇందులో భాగంగా క్రిటికల్ మినరల్స్‌కు సంబంధించి.. ఓ బలమైన సప్లయ్ చైన్‌ను ఏర్పాటు చేసేందుకు భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మరింత సహకారం అందనుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Also Read- AI-powered Smartphone Tool: అంధత్వానికి చెక్.. గ్లాకోమాను గుర్తించే.. అద్భుతమైన ఏఐ సాధనం రెడీ!

ఒప్పందంలో ఉన్న విషయాలివే..
ఈ సప్లయ్ చైన్ ద్వారా.. భారత ఇంధన భద్రత (ఎనర్జీ సెక్యూరిటీ), జాతీయ భద్రత (నేషనల్ సెక్యూరిటీ), ఆహార భద్రత (ఫుడ్ సెక్యూరిటీ) లక్ష్యాలను చేరుకోవడంతోపాటు 2070 నాటికి నెట్ జీరో లక్ష్యాలను చేరుకునేందుకు చేస్తున్న కృషికి సహకారం అందుతుందన్నారు. ఇదిలా ఉండగా ఇరు దేశాల మధ్య సన్నిహితమైన సహకారం కోసం మినరల్ రీసోర్సెస్‌కు సంబంధించిన సమాచార మార్పిడితో పాటుగా విధానాలు, నిబంధనలు, క్రిటికల్ మినరల్స్ ప్రాజెక్టులకు సంబంధించి సంయుక్తంగా చేపట్టాల్సిన కార్యాచరణ, మైనింగ్ వేలం, సుస్థిరమైన పద్ధతిలో డీప్ సీ మైనింగ్, మినరల్స్ వెలికితీతకు సంబంధించిన సమాచారం, మినరల్ ప్రాసెసింగ్, క్రిటికల్ మినరల్స్ స్టాక్‌ను నిల్వచేసుకోవడం తదితర అంశాలకు సంబంధించిన సహకారంపై చర్చ జరగనుందని కిషన్ రెడ్డి వివరించారు. క్రిటికల్ మినరల్స్‌కు సంబంధించి.. భారతదేశంలో ఇరుదేశాలు సంయుక్తంగా ఎక్స్‌ప్లొరేషన్, మైనింగ్, ప్రాసెసింగ్ కార్యక్రమాలను చేపట్టడం, సహకారం అందించడం, దీంతోపాటుగా, ఇతర సహకారం విషయంలోనూ పరస్పరం అంగీకారంతో పనిచేయడం తదితర అంశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయని కిషన్ రెడ్డి వివరించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు