Sridevi post on her Father
ఎంటర్‌టైన్మెంట్

Sridevi Vijaykumar: మీరేంటో చెప్పడానికి మాటలు చాలవు నాన్న.. శ్రీదేవి విజయ్ కుమార్ పోస్ట్ వైరల్

Sridevi Vijaykumar: రెబల్ స్టార్ ప్రభాస్ మొదటి సినిమా ‘ఈశ్వర్’లో హీరోయిన్‌గా నటించిన శ్రీదేవి విజయ్ కుమార్ (Sridevi Vijaykumar).. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శనమిచ్చింది. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే ఆమె సినీ ఇండస్ట్రీకి దూరమైంది. తాజాగా ఆమె టాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తూ.. హీరో నారా రోహిత్ (Nara Rohith) మైల్ స్టోన్ 20వ మూవీ ‘సుందరకాండ’ (Sundarakanda)లో హీరోయిన్‌గా నటించింది. తాజాగా ఈ సినిమా విడుదలై మంచి స్పందనను రాబట్టుకుంటోంది. ఆమె రీ ఎంట్రీలో మంచి పాత్ర లభించినందుకు ఇటీవల ఇంటర్వ్యూలో సంతోషం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే..

Also Read- Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లాంఛింగ్ డేట్ ఖరారు.. చద‌రంగం కాదు, ర‌ణ‌రంగ‌మే!

నా సర్వస్వం మీరే నాన్న
తన తండ్రి, నటుడు విజయ్ కుమార్ పుట్టినరోజును పురస్కరించుకుని శ్రీదేవి విజయ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ఎంతో ఎమోషనల్‌గా ఉంటూ హార్ట్‌ని టచ్ చేస్తోంది. ‘‘నాకు విశ్రాంతి దొరికే అత్యంత సురక్షితమైన ప్రదేశం మీ భుజాలే. ఈ రోజు మీ పుట్టినరోజున, నా జీవితంలో మీరు నా కోసం చేసిన ప్రతీ దానికీ, మీరు నాకు ఇచ్చిన ప్రతి చిరునవ్వుకు, మీరు తుడిచిన ప్రతి ఒక్క కన్నీటికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. మీరు నాకు ఎంత ఇష్టమో, మీరు నాకు ఏంటో చెప్పడానికి మాటలు చాలవు నాన్న. నా సర్వస్వం, నా ప్రపంచం మీరే. పుట్టినరోజు శుభాకాంక్షలు అప్పా! మీరంటే నాకు ఎంతో ఎంతో ఇష్టం.. ఐ లవ్ యూ నాన్న’’ అని శ్రీదేవి విజయ్ కుమార్ తన పోస్ట్‌లో పేర్కొంది.

నెటిజన్ల ప్రశంసలు
శ్రీదేవి విజయ్ కుమార్ తన తండ్రికి చెప్పిన పుట్టినరోజు శుభాకాంక్షలు నెటిజన్లను ఎమోషన్‌కు గురి చేస్తున్నాయి. మీ పోస్ట్‌తో మాకు మా నాన్న గుర్తొచ్చారు అంటూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. నెటిజన్ల ప్రశంసలతో శ్రీదేవి విజయ్ కుమార్ చేసిన ఈ పోస్ట్ బాగా వైరల్ అవుతోంది. తండ్రి అంటే ప్రతి కుమార్తెకు ఇలాంటి ఎమోషనే ఉంటుందని, మీ ప్రేమను ఎంతో చక్కగా వ్యక్తం చేశారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read- Nagarjuna: ఇంకా సైమన్ లుక్‌లోనే నాగార్జున.. బర్త్ డే స్పెషల్‌గా ఫ్యాన్స్‌ని మీటైన కింగ్!

మంచి పాత్రలు వస్తే చేయడానికి రెడీ!
నారా రోహిత్ సరసన ‘సుందరకాండ’లో నటించిన శ్రీదేవి విజయ్ కుమార్.. రీ ఎంట్రీలో కూడా హీరోయిన్ పాత్రే లభించడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేసింది. అంతేకాదు, తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉండేలా, ఎటువంటి వల్గారిటీ లేకుండా ఉండే పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని కూడా తెలిపింది. ‘సుందరకాండ’ విషయానికి వస్తే.. సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి ఈ చిత్రాన్ని నిర్మించారు. వెంకటేష్ నిమ్మలపూడి (Venkatesh Nimmalapudi) దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమాలో శ్రీదేవి విజయ్ కుమార్‌తో పాటు వృతి వాఘానికి కూడా హీరోయిన్‌గా నటించింది.

">

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం