Soundarya: బయటపడ్డ రహస్యం.. అక్కడికి వెళ్లిన స్టార్ హీరో?
Hero ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్

Soundarya: ఆ రహస్యం బట్టబయలు.. సౌందర్య మరణించిన తర్వాత.. హిమాలయాలకు వెళ్లి పూజలు చేసిన స్టార్ హీరో?

Soundarya: సౌందర్య మరణం సినీ ఇండస్ట్రీని ఒక్కసారిగా కుదిపేసింది. ఆమె ఇంటికి వెళ్లి సినీ జనాలు పరామర్శించారు. అయితే, ఈ ఘటన తర్వాత ఓ స్టార్ హీరో ఏకంగా హిమాలయాలకు పరుగులు తీశాడట. ఇంతకీ ఆ హీరో ఎవరు? ఎందుకు అలా పరుగులు తీశాడు? అసలు సౌందర్య చావుకి దీనికి లింక్ ఏంటి? అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..

ఆ హీరో మరెవరో కాదు, సూపర్‌స్టార్ రజినీకాంత్. “రజినీకి సౌందర్య మరణానికి సంబంధం ఏంటి?” ఏంటి అని సందేహిస్తున్నారా? మరి, ఆ కథ ఏంటో ఇక్కడ చూద్దాం..

Also Read: Viral News: ఆన్లైన్ పేమెంట్ తో భర్త గుట్టు మొత్తం బయటకు.. ఉన్న పెళ్లాం పోయే, ఉంచుకున్న సెటప్ పోయే?

సౌందర్య కన్నడలో విష్ణువర్ధన్‌తో కలిసి ఆప్తమిత్ర అనే చిత్రం చేసింది. ఈ సినిమా తెలుగు, తమిళంలో చంద్రముఖి పేరుతో రిలీజైంది. ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్, ఆప్తమిత్ర రిలీజ్ కాకముందే సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయింది. అప్పట్లో కన్నడ మీడియాలో రకరకాల రూమర్స్ హల్‌చల్ చేసాయి.

Also Read:  Sathyaraj: రజినీకాంత్, సత్యరాజ్‌ల మధ్య వివాదమేంటి? 38 ఏళ్లు రజినీ సినిమాల్లో సత్యరాజ్ ఎందుకు చేయలేదు?

ఆప్త రక్షక్ సమయంలో విష్ణువర్ధన్ మరణం? 

సౌందర్య మరణానికి చంద్రముఖి సినిమానే కారణమని గుసగుసలు వచ్చాయి. ఇంకా ఆసక్తికర విషయం ఏంటంటే, కొన్నేళ్ల తర్వాత ఆప్త రక్షక్ అనే సీక్వెల్ సినిమా కూడా వచ్చింది. ఇందులోనూ విష్ణువర్ధన్ హీరో. తెలుగులో నాగవల్లి పేరుతో వెంకటేష్‌తో రిలీజైంది. కానీ ఈ సినిమా షూటింగ్ పూర్తై, రిలీజ్‌కి కొద్ది రోజుల ముందు విష్ణువర్ధన్ కూడా మరణించాడు. ఆప్తమిత్ర సమయంలో సౌందర్య, ఆప్త రక్షక్ సమయంలో విష్ణువర్ధన్… ఈ రెండు మరణాలు సినీ ఇండస్ట్రీలో భయానకంగా మారాయి.

Also Read: Nagarkurnool: యూరియా రేటు పెంచి అమ్మితే చర్యలు.. నాగర్‌కర్నూలు ఎమ్మెల్యే, కలెక్టర్ హెచ్చరిక

సౌందర్య మరణించిన తర్వాత.. హిమాలయాలకు వెళ్లి పూజలు చేసిన స్టార్ హీరో?

ఆయన ఈ విషయం గురించి బాగా ఆలోచిస్తూ  గట్టి షాక్ తిన్నాడని తెలిసిన సమాచారం. పండితులను కలిసి సలహాలు తీసుకున్నాడని టాక్. అంతటితో ఆగకుండా, ఇంట్లో యజ్ఞాలు, హోమాలు  కూడా  చేయించాడు.  అంతే కాదు, ఇంకో  స్టెప్ ముందుకేసి, హిమాలయాలకు వెళ్ళి అక్కడ పూజలు, ధ్యానం చేసి, కొన్ని రోజులు శాంతిగా గడిపాడని వార్తలు. ఇదంతా చంద్రముఖి చుట్టూ తిరిగిన మిస్టరీ, భయానక  వైబ్స్ వల్లే అని జనం చర్చించుకున్నారు.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?