PM Modi Japan Visit: భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం జపాన్ (Japan Tour) లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా (Shigeru Ishiba)తో కలిసి మోదీ బుల్లెట్ ట్రైన్ లో పర్యటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇరు దేశాధినేతలు ఎక్స్ వేధికగా పంచుకున్నారు. టోక్యో నగరం నుంచి సెండాయ్ కు బుల్లెట్ వారు ప్రయాణించడం విశేషం. ఇందుకు సంబంధించిన ఫొటోలు అంతర్జాతీయంగా వైరల్ అవుతున్నాయి.
ఇరు ప్రధానులు ఏమన్నారంటే?
మోదీతో బుల్లెట్ ట్రైన్ ప్రయాణ ఫొటోలను పంచుకుంటూ జపాన్ ప్రధాని ఎక్స్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ప్రధాని మోదీతో కలిసి సెండాయ్ కు వస్తున్నాను. నిన్న రాత్రి నుంచి నా ప్రయాణాన్ని ఆయనతో కొనసాగిస్తున్నాను’ అని అన్నారు. మోదీ కూడా ఈ ఫొటోలను పంచుకుంటూ తాము సెండాయ్ కు చేరుకున్నామని తెలిపారు. సెండాయ్ చేరుకున్న అనంతరం ఇరువురు నేతలు ఈస్ట్ జపాన్ రైల్వే కంపెనీలో శిక్షణ పొందుతున్న భారతీయ లోకో పైలట్లను కలిశారు. అలాగే కొత్త ‘ALFA-X’ రైలును పరిశీలించి ఆ బుల్లెట్ రైలు గురించి ఆ సంస్థ ఛైర్మన్ నుంచి వివరణ అందుకున్నారు. ఈ సంస్థను ‘జేఆర్ ఈస్ట్’ (JR East) అని కూడా పిలుస్తారు.
モディ首相と仙台へ。昨夜に引き続き、車内からご一緒します。 pic.twitter.com/ggE6DonklN
— 石破茂 (@shigeruishiba) August 30, 2025
Reached Sendai. Travelled with PM Ishiba to this city on the Shinkansen.@shigeruishiba pic.twitter.com/qBc4bU1Pdt
— Narendra Modi (@narendramodi) August 30, 2025
Also Read: Soundarya: ఆ రహస్యం బట్టబయలు.. సౌందర్య మరణించిన తర్వాత.. హిమాలయాలకు వెళ్లి పూజలు చేసిన స్టార్ హీరో?
బుల్లెట్ రైల్ కోచ్ సందర్శన
ప్రధాని మోదీ.. 15వ భారత – జపాన్ వార్షిక సదస్సు కోసం ఆ దేశంలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ప్రస్తుతం సెండాయ్ లోని కీలకమైన పరిశ్రమలను ఆయన సందరిస్తున్నారు. ఇందులో బుల్లెట్ రైలు కోచ్ తయారీ యూనిట్ తో పాటు.. సెమికండక్టర్ ప్లాంట్ కూడా ఉంది. ఈ వాఫర్ తయారీ ప్లాంట్ ను సెండాయ్ సమీపంలోని మియాగి ప్రిఫెక్చర్ లో కొత్తగా నిర్మిస్తున్నారు. తైవాన్ చెందిన పవర్ చిప్ సెమీకండక్టర్ మ్యాన్యుఫాక్చరింగ్ కార్పొరేషన్ (PSMC) ఆధ్వర్యంలో SBI హోల్డింగ్స్ సంస్థ నిర్మిస్తోంది. జపాన్ భాగస్వాములతో కలసి ‘జపాన్ సెమికండక్టర్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ’ (JSMC) పేరిట రూపొందిస్తోంది. ఇది జపాన్ చిప్ పరిశ్రమను తిరిగి ప్రోత్సహించేందుకు అతిపెద్ద ప్రాజెక్టులలో ఒకటిగా భావించబడుతోంది.
Also Read: Allu Arvind Mother Dies: బ్రేకింగ్.. అల్లు అర్జున్ ఇంట విషాదం.. ఆమె ఇక లేరు!
జపాన్ పర్యటనలో మోదీ
ప్రధాని మోదీ రెండ్రోజల పర్యటనలో భాగంగా శుక్రవారమే జపాన్ చేరుకున్నారు. ఈ పర్యటన ద్వారా ఢిల్లీ – టోక్యో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న వార్షిక సదస్సు ‘భారత్ – జపాన్ తదుపరి దశాబ్ద దిశా నిర్దేశం: ప్రత్యేక వ్యూహాత్మక, గ్లోబల్ భాగస్వామ్యానికి ఎనిమిది మార్గదర్శకాలు’ అనే శీర్షికతో రూపొందించబడింది. ఈ పర్యటనలో జపాన్ తో భద్రతా సహకారంపై సంయుక్త ప్రకటనతో పాటు మరిన్ని ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. రెండు దేశాలు కలసి ‘చంద్రయాన్-5 మిషన్’ అమలు ఒప్పందంపై కూడా సంతకం చేశాయి. ఈ మిషన్‌లో చంద్రుడి ధృవ ప్రాంతాన్ని సంయుక్తంగా పరిశీలించనున్నారు.