Damodar Rajanarasimha (imagecredit:twitter)
తెలంగాణ

Damodar Rajanarasimha: ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ పై మంత్రి ఫైర్.. ఎమన్నారంటే..?

Damodar Rajanarasimha: ఆపరేషన్ల తర్వాత మధ్యలోనే చికిత్స వదిలేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా అధికారులకు ఆదేశాలిచ్చారు.ఆపరేషన్ల తర్వాత, చికిత్స మధ్యలో పేషెంట్లను డిశ్చార్జ్ చేస్తున్న ప్రైవేట్,కార్పొరేట్ హాస్పిటల్స్‌పై దృష్టి పెట్టాలని, అలాంటి హాస్పిటల్స్ ను ఎట్టి పరిస్థితుల్లో ఊపేక్షించవద్దన్నారు. కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్‌ ఆపరేషన్లు చేసి, పేషెంట్లు పూర్తిగా కోలుకోకముందే వారిని డిశ్చార్జ్ చేసి, నిమ్స్‌, ఉస్మానియా, గాంధీ హాస్పిటల్స్‌కు పంపుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని మంత్రి వెల్లడించారు. ఆయా కేసులను పరీక్షించి, నిర్లక్ష్​యం తేలితే చర్యలు తీసుకోవాలన్నారు. ఇక నిమ్స్ ఎమర్జెన్సీలో వేగంగా అడ్మిషన్లు జరగాలని మంత్రి సూచించారు. ఆయన హైదరాబాద్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్(Arogyasri Trust) కార్యాలయంలో ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు.

డిపార్ట్‌మెంట్ల నడుమ సమన్వయం

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ…పేషెంట్లకు సత్వరమే చికిత్స ను అందించాలన్నారు. ఎమర్జన్సీకి వచ్చే పేషెంట్లలో నేరుగా నిమ్స్‌కు వచ్చే వారికి, ప్రభుత్వ హాస్పిటల్స్ నుంచి రిఫరల్‌పై వచ్చే వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. ప్రైవేట్(Private), కార్పొరేట్(Carporate) హాస్పిటల్స్ నుంచి వచ్చే పేషెంట్ల విషయంలోనూ సానుభూతితో వ్యవహరించి చికిత్స అందించాలన్నారు. గాంధీ(Gandhi), ఉస్మానియా(OU), నిమ్స్(Nims), ఇతర ప్రభుత్వ హాస్పిటళ్ల ఎమర్జన్సీ డిపార్ట్‌మెంట్ల నడుమ సమన్వయం ఉండాలని, ఒక హాస్పిటల్‌ ఎమర్జెన్సీ వార్డులో బెడ్లు నిండుకున్నప్పుడు పేషెంట్‌ను మరో హాస్పిటల్‌కు రిఫర్ చేసి అక్కడ అడ్మిట్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. పేషెంట్‌ను రిఫర్ చేయడానికి ముందే అవసరమైన ప్రాథమిక చికిత్స అందించి, స్టేబుల్ చేయాలన్నారు.

Also Read: BRS leaders join Congress: కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ సీనియర్ నేతల ఎంట్రీ

పేషెంట్ల విషయంలో అప్రమత్తం

ఒక హాస్పిటల్ నుంచి మరో హాస్పిటల్‌కు పంపించేటప్పుడు ఆ పేషెంట్‌తో పాటు అవసరమైతే అంబులెన్స్‌లో ఒక డాక్టర్‌ను పంపించాలని మంత్రి సూచించారు.పేషెంట్ల అడ్మిషన్, రిఫరల్ విషయంలో డ్యూటీ డాక్టర్లు, ఆర్‌ఎంవోలు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.అత్యవసర పరిస్థితుల్లో నిమ్స్‌కు వస్తున్న పేషెంట్ల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, మెడికల్ ఎడ్యుకేషన్ అడిషనల్ డైరెక్టర్ వాణి, ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రాజారావు డాక్టర్ వాణి తదితరులు పాల్గొన్నారు.

Also Read: Nagarkurnool: యూరియా రేటు పెంచి అమ్మితే చర్యలు.. నాగర్‌కర్నూలు ఎమ్మెల్యే, కలెక్టర్ హెచ్చరిక

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?