BRS leaders join Congress: కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు నాయకులకు బీఆర్ఎస్ పార్టీ(BRS Party) నియంతృత్వం నుంచి స్వేచ్ఛ లభించిందని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్(BRS) తెలకపల్లి మండల సీనియర్ నేత, సింగిల్ విండో ఛైర్మన్ భాస్కర్ రెడ్డి, నడిగడ్డ మాజీ సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి తమ అనుచరులతో కలిసి ఎంఎల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Also Read: Khammam Rains: ఆ జిల్లాలో భారీ వర్షాలు జలమయమైన రోడ్లు.. అత్యవసరమైతే తప్పా ప్రయాణాలు చేయవద్దు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…నియోజకవర్గ అభివృద్ధికి నాయకులు తనతో పాటు కలిసి రావాలని పిలుపునిచ్చారు. రాజకీయాలకతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధుల మంజూరుకు సీఎం రేవంత్ రెడ్డి ఎంతో సానుకూలంగా స్పందిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందన్నారు.
కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిది
బీఆర్ఎస్ పార్టీ(BRS Party) లో కుటుంబ కలహాలు పెరిగాయని, తెలంగాణలో బీఆర్ఎస్(BRS) కాలం చెల్లిన పార్టీ అన్నారు. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో నాగర్‌కర్నూల్(Nagarkurnool) నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తుందన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు, అభివృద్ధి చేసేందుకు డాక్టర్ గా ఉంటూ నాన్న ఎంఎల్సీ దామోదర్ రెడ్డి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చా అన్నారు. కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిదని, అందరికీ స్వేచ్ఛ ఉంటుంది అన్నారు. తనను కఠినంగా మారేలా ఎవరూ వ్యవహరించరాదని కోరారు. పార్టీ, ప్రభుత్వం, పథకాల గురించి చులకనగా పార్టీ నేతలు ఎవరూ మాట్లాడొద్దన్నారు. సొంత పార్టీ నేతలు కూడా బయట తప్పుడు మాటలు మాట్లాడితే సహించనని హెచ్చరించారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో మండలంలో బలమైన నాయకులు కావడంతో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది.
Also Read: Tummala Nageswara RaoL: ప్రభుత్వ ఉద్యోగులపై మంత్రి తుమ్మల గరం గరం.. చర్యలు తప్పవని హెచ్చరిక..?