Tummala Nageswara Rao: రాష్ట్రంలో విధులకు ఆలస్యంగా హాజరైన ఉద్యోగులపై మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. తన పరిధిలోని శాఖలు మరియు కార్పోరేషన్ల ఉద్యోగుల హాజరుపై మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సమీక్ష నిర్వహిచారు. తన సంభందిత శాఖలో ఉదయం 10:40 గంటల వరకు కూడా విధులకు హాజరుకాకపోవడంపై మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఉద్యోగులంతా ఉదయం 10:30 లోపే రిపోర్ట్ చేయాలని మంత్రి ఆదేశించారు. సకాలంలో హాజరుకాని ఉద్యోగుల నుంచి వివరణ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. రేపటి నుంచి విధులకు ఆలస్యంగా హాజరయ్యే ఉద్యోగులపై శాఖ పరమైన కటిన చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగుశ్వర్ రావు ఆదేశాలు జారీ చేశారు.
Also Read: CM Revanth Reddy: కార్మికుల నైపుణ్యాల కోసం కార్పస్ ఫండ్: సీఎం రేవంత్ రెడ్డి
మంత్రి తుమ్మల ఆగ్రహం..?
ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ఆఫీసులో మంత్రి తుమ్మల వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. అయితే ఈ సమావేశం ఉదయం 10:00 గంటలకు ప్రారంభించబడింది. ఉద్యోగులంతా 10:40 గంటలు అయినా, అక్కడి ఉద్యోగులు, కార్పోరేషన్ ఉద్యోగులు హజరు కాక పోవడంతో మంత్రి తుమ్మల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన శాఖ పరిదిలోని చేనేత, సహకార, మార్కేటింగ్ శాఖలు మరియు, కార్పోరేషన్ ఉద్యోగుల హజరుపై సమీక్షనిర్వహించారు. దీంతో అసహనానికి గురైన మంత్రి తుమ్మల, అధికారుల అలసట క్రమశిక్షణలోపంగా ఉన్నట్టు మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది మంచిదికాదని ప్రభుత్వ పనుల్లో ఆలస్యానికి దారితీస్తుందని, మంత్రి తెలిపారు. ఉద్యోగులంతా క్రమం తప్పకుండా ఉదయం 10:30 గంటలలోపె రిపోర్టు చేయాలని మంత్రి సీరియస్ అయ్యారు. ఇక నుంచి ఎవరైనా ఆలస్యం చేస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఈ సమావేశం పొగాకు కొనుగోలు, మాన్సూన్ సందర్భంగా రాష్ట్రంలో వ్యవసాయ ప్రణాళికలు, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి చట్టం అమలు వంటి పలు కీలక అంశాలపై సమీక్ష నిర్వహించారు.
Also Read: Suryapet: నకిలీ మద్యం లేబుళ్ల తయారీ.. లక్షల విలువ చేసే యంత్ర సామాగ్రి సీజ్