CM Revanth Reddy: చిత్ర పరిశ్రమలో వివిధ అంశాల్లో నైపుణ్యాల పెంపు కోసం ఒక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సూచించారు. సినీ నిర్మాతలు,దర్శకులతో సీఎం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..స్కిల్ యూనివర్సిటీ లో సినిమా పరిశ్రమ కోసం కావాల్సిన ఏర్పాట్లు చేస్తామన్నారు. తెలుగు సినిమా పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి వెళ్లిందన్నారు. సినిమా పరిశ్రమలో పని వాతావరణం బాగా ఉండాలన్నారు. సినిమా కార్మికులను కూడా పిలిచి మాట్లాడుతానని సీఎం హామీ ఇచ్చారు.
ప్రభుత్వం నుంచి సినిమా పరిశ్రమ కు పూర్తి సహకారం ఉంటుందన్నారు. అయతే పరిశ్రమలోకి కొత్త గా వచ్చే వారికి నైపుణ్యాలు పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణలో ముఖ్యమైన పరిశ్రమ సినిమా అంటూ గుర్త చేశారు. పరిశ్రమలో వివాదం వద్దనే కార్మికుల సమ్మె విరమణకు చొరవ చూపించానని సీఎం చెప్పారు. పరిశ్రమలో నిర్మాతలు, కార్మికుల అంశంలో సంస్కరణలు అవసరం అని గుర్తు చేశారు. కార్మికుల విషయం లో నిర్మాతలు మానవత్వంతో వ్యవహరించాల్సిన అవసరం ఉన్నదన్నారు.
Also Read: Viral Video: తిందామని చూసిన యువతిని.. గుక్కపెట్టి ఏడ్చేలా చేసిన రొయ్య.. వీడియో వైరల్
అందరూ చట్ట పరిధిలో పని చేయాల్సిందే
నిర్మాతలు, కార్మికులు, ప్రభుత్వం కలిసి ఒక పాలసీ తీసుకువస్తే బాగుంటుందన్నారు. సినీ కార్మికులను, నిర్మాతలను కూడా తమ ప్రభుత్వం కాపాడుకుంటుందన్నారు. సినిమా పరిశ్రమకు మానిటరింగ్ అవసరమన్నారు. పరిశ్రమకు ఏం కావాలో ఒక కొత్త పుస్తకాన్ని రాసుకుందామన్నారు. పరిశ్రమలో వ్యవస్థలను నియంత్రిస్తామంటే ప్రభుత్వం సహించదన్నారు. అందరూ చట్ట పరిధి లో పని చేయాల్సిందే అని నొక్కి చెప్పారు. పరిశ్రమ విషయంలో తాను న్యూట్రల్ గా ఉంటానన్నారు. హైదరాబాద్(Hyderabad)లో అంతర్జాతీయ సినిమాల చిత్రీకరణ కూడా జరుగుతోందన్నారు.
తెలుగు సినిమా ల చిత్రీకరణ ఎక్కువ గా రాష్ట్రంలోనే జరిగేలా చూడాలన్నారు. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా(Telugu Movie) పరిశ్రమ ను ఉంచడమే తన ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి(Vem Narender Reddy), తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(Telangana Film Development Corporation) చైర్మన్ దిల్ రాజు, నిర్మాతలు అల్లు అరవింద్, డి.సురేష్ బాబు, జెమిని కిరణ్, స్రవంతి రవికిశోర్, నవీన్ ఎర్నేని, వంశీ, బాపినీడు, డివివి దానయ్య, వంశీ, గోపి, చెరుకూరి సుధాకర్, సాహు, అభిషేక్ అగర్వాల్, విశ్వ ప్రసాద్, అనిల్ సుంకర, శరత్ మరార్, ఎన్వీ ప్రసాద్, ఎస్కేన్, రాధామోహన్, దాము, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీనివాస్, కొరటాల శివ, సందీప్ రెడ్డి వంగా, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, వెంకీ కుడుముల తదితరులు ఉన్నారు.
Also Read: Mahesh Kumar Goud: జూబ్లీహిల్స్ కీలకం.. స్ట్రాటజీ ప్లే చేయాల్సిందే: మహేష్ కుమార్ గౌడ్
