Viral Video (Image Source: Twitter)
Viral

Viral Video: తిందామని చూసిన యువతిని.. గుక్కపెట్టి ఏడ్చేలా చేసిన రొయ్య.. వీడియో వైరల్

Viral Video: చైనాలో ఒక హాట్‌పాట్ రెస్టారెంట్‌ (Hotpot restaurant)లో యువతికి చేదు అనుభవం ఎదురైంది. బతికున్న మాంటిస్ రొయ్యను (mantis shrimp) తినాలని చూసిన యువతికి ఊహించని షాక్ ఎదురైంది. రొయ్య ఒక్కసారిగా దాడి చేయడంతో.. నొప్పికి విల విల లాడిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

వీడియోలో ఏముందంటే?
వైరల్ అవుతున్న వీడియోను గమనిస్తే తను తినబోయే ఆహారాన్ని యువతి రికార్డ్ చేస్తూ ఉంది. ఈ క్రమంలో బతికున్న మాంటిస్ రొయ్యను తన ముందు వేడి వేడిగా మరుగుతున్న కుకింగ్ బౌల్ (Coocking Bowl) లో వేయాలని ఆమె ప్రయత్నించింది. బౌల్ లో వేస్తున్న క్రమంలో రొయ్య తప్పించుకుంది. అనంతరం ఆమె చేతిపైకి ఎక్కి.. ఒక్కసారిగా గట్టిగా కొరికింది. దీంతో నొప్పి భరించలేక యువతి గట్టిగా కేకలు వేయడం ప్రారంభించింది. దీంతో రెస్టారెంట్ లోని వారు ఆమె వద్దకు పరిగెత్తుకు వచ్చి జాగ్రత్తగా రొయ్యను విడిపించారు.

Also Read: Sack Jailed Ministers Bill: పీఎం, సీఎంలను తొలగించే బిల్లుపై.. మోదీ ఫస్ట్ రియాక్షన్.. విపక్షాలపై తీవ్రంగా ఫైర్!

‘రొయ్య ప్రతీకారం బాగుంది’
ఈ వీడియోను టిక్ టాక్ లో పోస్ట్ చేయగా అది క్షణాల్లోనే వైరల్ గా మారింది. అయితే గాయపడ్డ యువతిని వదిలేసి రొయ్య వేగం, చురుకుదనాన్ని నెటిజన్లు ప్రశంసించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అలాగే లైవ్ సీ ఫుడ్ వండడం సురక్షితమా? నైతికమా? అన్న ప్రశ్నలను నెటిజన్లు లేవనెత్తుతున్నారు. ‘ఇది ఆ బీద జంతువు ప్రతీకారం’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. బతికున్న జంతువులను కస్టమర్ టేబుల్ దగ్గరే సర్వ్ చేయడం ప్రమాదకరమని మరికొందరు కామెంట్ చేశారు. కొన్ని ప్రాంతాల్లో లైవ్ లేదా రా సీఫుడ్ తినడం సంప్రదాయం అయినా.. వాటి వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Also Read: Ganesh Chaturthi Trains: వినాయక చవితికి ఊరెళ్తున్నారా? ఈ 380 రైళ్లు మీకోసమే.. ఓ లుక్కేయండి!

చాలా పవర్ ఫుల్!
మాంటిస్ రొయ్య (Mantis Shrimp)ను శాస్త్రీయంగా స్టొమాటోపోడా (Stomatopoda) అని కూడా పిలుస్తారు. ఇవి సముద్రాల్లో జీవిస్తుంటాయి. ఇవి చూడటానికి రొయ్యల రూపంలో ఉన్నప్పటికీ సాధారణ రొయ్యలతో పోలిస్తే ఇవి చాలా భిన్నంగా ఉంటాయి. వీటి ముందు కాళ్లు (Legs) పదునైన ఈటె లాగా ఉంటాయి. దానితో ఎరను పొడిచి పట్టుకుంటాయి. ఇవి బుల్లెట్ వేగంతో దాడి చేయగలవని నిపుణులు చెబుతున్నారు. 10 సెం.మీ నుంచి 40 సెం.మీ వరకు గంటకు 80 కి.మీ వేగంతో దాడి చేస్తాయని పేర్కొంటున్నారు. మాంటిస్ రొయ్యలు సాధారణంగా మనుషులపై దాడి చేయవు గానీ.. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం వాటి కాటుకు గురికాక తప్పదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Also Read: Rajiv Gandhi Civils Abhaya Hastham: యువతకు గుడ్ న్యూస్.. ఒక్కొక్కరు రూ.లక్ష పొందే.. అద్భుతమైన స్కీమ్!

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?