Smart Parking System(N IMAGE credit: swetcha reporter)
హైదరాబాద్

Smart Parking System: స్మార్ట్ పార్కింగ్ ప్రతిపాదన తిరస్కరణ.. అద్దె వేలానికి లైన్ క్లియర్!

Smart Parking System: జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ  మరోసారి భేటీ అయింది. ఎజెండాలో మొత్తం 33 ప్రతిపాదనలుండగా, వీటిలో స్మార్ట్ పార్కింగ్ ప్రతిపాదనను స్టాండింగ్ కమిటీ తిరస్కరించగా, మిగిలిన 32 అంశాలకు ఆమోద ముద్ర వేసింది. అప్పటికప్పుడే స్వీకరించిన ఏడు టేబుల్ ఐటమ్స్‌కు కూడా కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అభివృద్ది ప్రతిపాదనలకు ఆమోదం 96 మంది సీనియర్ అసిస్టెంట్ల పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు ఎస్టేట్ ఆస్తుల లీజు పెంపు, అద్దె వేలానికి లైన్ క్లియర్ చేస్తూ కమిటీ నిర్ణయం తీసుకుంది.

 Also Read: Hyderabad: సహస్ర హత్య కేసు దర్యాప్తు ముమ్మరం.. గేటు వద్ద తొంగి చూస్తూ నిలబడ్డ వ్యక్తి..?

దీంతో పాటు సిటీలో దోమల నివారణను మరింత వేగవంతం చేసేందుకు గాను 33 మంది అసిస్టెంట్ ఎంటమాలజిస్టుల నియామకానికి కమిటీ అంగీకారం తెలిపింది. హైడ్రా నుంచి 57 మంది డ్రైవర్లు జీహెచ్ఎంసీకి తెచ్చుకోవాలన్న ప్రతిపాదనకు సైతం ఆమోద ముద్ర వేసింది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి(Gadwal Vijayalakshmi) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి కర్ణన్, స్టాండింగ్ కమిటీ సభ్యులు బొంతు శ్రీదేవి, బానోతు సుజాత, సమీనా బేగం, అబ్దుల్ వాహెబ్, పర్వీన్ సుల్తానా, డా.ఆయేషా హుమేరా, మహమ్మద్ సలీం, బాత జబీన్, మహాలక్ష్మి రామన్ గౌడ్, సీ.ఎన్.రెడ్డి, మహమ్మద్ బాబా ఫసియుద్దీన్, వి.జగదీశ్వర్ గౌడ్, బూరుగడ్డ పుష్పతో పాటు జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ లు రఘు ప్రసాద్, సత్యనారాయణ, వేణుగోపాల్, సుభద్ర, పంకజ, గీతా రాధిక, మంగతాయారు, జోనల్ కమిషనర్లు హేమంత్ కేశవ్ పాటిల్, హేమంత్ సహదేవ్ రావు, అపూర్వ్ చౌహాన్, రవి కిరణ్, శ్రీనివాస్ రెడ్డి, సీసీపీ శ్రీనివాస్, చీఫ్ ఇంజనీర్లు భాస్కరరెడ్డి, సహదేవ్ రత్నాకర్, భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాము నాయక్ పాల్గొన్నారు.

అసిస్టెంట్ ఎంటమాలజిస్టుల నియామకానికి ఆమోదం
కొత్త ప్రాజెక్టులు, నిర్వహణపరమైన పనులతో పాటు కొత్త నిర్మాణాలకు నిధుల మంజూరీ కోరుతూ వచ్చే ప్రతిపాదనలతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో దోమల నివారణను మరింత ముమ్మరం చేసేందుకు గాను 33 మంది అసిస్టెంట్ ఎంటమాలజిస్టులను నియమించే ప్రతిపాదన‌కు కూడా కమిటీ ఆమోదం తెలిపింది. ఔట్ సోర్స్ ద్వారా నియమించుకునేందుకు రూ. 91.48 లక్షల నిధులకు కూడా మంజూరు చేసింది. దీంతో పాటు గచ్చిబౌలిలోని మల్కం చెరువులో బోటింగ్, వాటర్ గేమ్స్ కోసం హైదరాబాద్ బోటింగ్ క్లబ్‌కు రూ.6 లక్షలు నెల లైసెన్స్ ఫీజుతో మూడు సంవత్సరాల అనుమతి ఇచ్చేందుకు కమిటీ అంగీకారం తెలిపింది.

 రూ.2.5 కోట్లు మంజూరు

హైడ్రా నుండి 223 సెక్యూరిటీ గార్డులను జీహెచ్ఎంసీ పార్కుల కోసం ఉపయోగించేందుకు అవరసరమైన టెండర్ల ప్రక్రియకు అనుమతి ఇచ్చింది. నల్గొండ ఎక్స్ రోడ్‌లోని నేషనల్ సెన్సర్ పార్క్ నిర్వహణ కోసం అయేషా ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఒప్పందాన్ని ఒక సంవత్సరం పొడిగించడానికి కమిటీ అనుమతి ఇచ్చింది. హెచ్ సిటీ ద్వారా పాటిగడ్డ ఆర్‌ఓబీ 31 మీటర్లు వెడల్పుతో రైల్వే ట్రాక్ నుండి పైగా గార్డెన్ వరకు చేపట్టిన ఆర్ఓబీ నెక్లెస్ రోడ్డు నుండి 17 మీటర్ల వెడల్పు తూర్పు వైపు గల 20 ఆస్తుల నుంచి స్థల సేకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆరాంఘర్ నుండి జూ పార్కు ఫ్లై ఓవర్ పాత ఊర చెరువు  పై బాక్స్ డ్రెయిన్,  పాత రోడ్డు క్రాస్ కన్వర్టింగ్  రూ.2.5 కోట్లు మంజూరు చేసింది. వీటితో పాటు మరి కొన్ని అభివృద్ది ప్రతిపాదనలతో పాటు ఇంకొన్నింటిని టేబుల్ ఐటమ్స్‌గా తీసుకుని కమిటీ ఆమోదం తెలిపింది.

 Also Read: Andhra King Taluka: రామ్ పోతినేని చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ విడుదల ఎప్పుడంటే?

Just In

01

Bigg Boss Telugu Nominations: నామినేషన్స్‌లో ఊహించని ట్విస్ట్.. మాజీ కంటెస్టెంట్స్ రీఎంట్రీ.. గూస్ బంప్స్ ప్రోమో భయ్యా!

Highest Paid Actors: రెమ్యునరేషన్లలో వెనక్కి తగ్గేదే లే అంటున్న సౌత్‌ యాక్టర్లు..

Wine Shop Lottery: నేడే మద్యం షాపులకు లక్కీ డ్రా.. ఆశావహుల్లో ఉత్కంఠ

Gold Price Today: గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు?

DSP Bribery Case: ఏసీబీలో కలకలం రేపుతున్న డీఎస్పీ వసూళ్ల వ్యవహారం