Cyber Crime: మీ మొబైల్ ఫోన్‌కు న్యూ ఇయర్​ పాస్​ వచ్చిందా?
Cyber Crime( image credit: Ai)
హైదరాబాద్

Cyber Crime: మీ మొబైల్ ఫోన్‌కు న్యూ ఇయర్​ ఈవెంట్ పాస్​ వచ్చిందా? సైబర్ కేటుగాళ్ల కొత్త స్కెచ్ జాగ్రత్త!

Cyber Crime: మీ మొబైల్ ఫోన్‌కు న్యూ ఇయర్​ ఈవెంట్ పాస్​ వచ్చిందా? అయితే, ఒక్క క్షణం ఆలోచించండి. అది సైబర్ క్రిమినల్స్​ మిమ్మల్ని ఉచ్చులోకి లాగడానికి పంపించింది అయి ఉండొచ్చు. క్రిస్మస్​ వేడుకలు సమీపిస్తుండడం, ఆ వెంటనే నూతన సంవత్సర వేడుకలు జరుగనుండడంతో కేటుగాళ్లు వాటి పేర సరికొత్త మోసాలకు తెర లేపుతున్నారు. ఈ క్రమంలో జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్​ సైబర్ క్రైం డీసీపీ అరవింద్ బాబు సూచించారు. ఏమాత్రం ఏమరుపాటుగా వ్యవహరించినా అకౌంట్ ఖాళీ అవుతుందని హెచ్చరించారు.

రకరకాల మోసాలు

ఇన్వెస్ట్​ మెంట్, ట్రేడ్ అంటూ రకరకాలుగా మోసాలు చేస్తున్న సైబర్ క్రిమినల్స్ ఏటా వందల కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఓ కంప్యూటర్‌ను ముందు పెట్టుకుని జనాన్ని ఉచ్చులో బిగిస్తూ నేరాలకు పాల్పడుతున్న ఈ కేటుగాళ్లు ఏ సందర్భాన్ని కూడా వదలడం లేదు. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సం సమయంలో వీఐపీ దర్శనాల పాస్‌ల పేర వేలాది మందికి టోకరా ఇచ్చి లక్షల్లో డబ్బు కొట్టేశారు. తాజాగా క్రిస్మస్ సమీపిస్తుండడం ఆ వెంటనే న్యూ ఇయర్ వేడుకలు రానుండడాన్ని అవకాశంగా చేసుకుంటూ ఇదే తరహాలో మోసాలకు శ్రీకారం చుట్టారు. జరగని ఈవెంట్, పార్టీల పాస్‌లు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, పబ్బులు, రిసార్టుల పేర ఫేక్​ వెబ్ సైట్ల ద్వారా తక్కువ ధరకే అంటూ టికెట్లు అమ్మకానికి పెట్టి డబ్బు గుంజే ప్రయత్నాలు చేస్తున్నారు.

Also Read: Cyber Crime: మంచి ఫలితాన్ని ఇస్తున్న గోల్డెన్​ హవర్.. మీ డబ్బులు పోయాయా? వెంటనే ఇలా చేయండి

​ టూర్ల ప్యాకేజీల పేర ఆఫర్లు

అదే సమయంలో హాలీడే ప్యాకేజీలు, విదేశీ పర్యటనలు, క్రూయిజ్​ టూర్ల ప్యాకేజీల పేర ఆఫర్లు ప్రకటిస్తూ అడ్వాన్స్ రూపంలో నగదు వసూళ్లకు పాల్పడుతున్నారు. గిఫ్ట్ వచ్చిందని, లక్కీ డ్రాలో అదృష్టం మిమ్మల్నే వరించిందని, క్రిస్మస్ బహుమతి దక్కించుకున్నారని వాట్సాప్, ఎస్​ఎంఎస్‌ల ద్వారా లింకులు పంపిస్తూ ప్రాసెసింగ్ ఫీజు పేర మోసాలు కేటుగాళ్లు చేస్తున్నారు. రిసార్టుల బుకింగ్ పేర కొన్ని నేరాలకు పాల్పడుతుండగా ఈవెంట్​ మేనేజ్‌మెంట్, డెలివరీ పనుల పేర పార్ట్​ టైం జాబ్ ఆఫర్లు ఇస్తూ రిజిస్ట్రేషన్ పేర కుచ్చుటోపీ పెడుతున్నారు. ఈ విషయం దృష్టికి రావడంతో జాగ్రత్త అంటూ సైబర్ క్రైం డీసీపీ అరవింద్ బాబు సూచిస్తున్నారు.

డీసీపీ సూచనలు

అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే లింకులు, ఏపీకే ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్‌లోడ్​ చేయవద్దని డీసీపీ చెప్పారు. బ్యాంక్​ ఖాతాల వివరాలు, ఓటీపీ, పీఐఎన్, సీవీవీ నెంబర్లను ఎవరితోనూ షేర్ చేసుకోవద్దన్నారు. ఆఫర్లు, పార్టీల పాస్‌లు, బుకింగుల గురించి అధికారిక వెబ్ సైట్ల ద్వారా మాత్రమే సంప్రదించాలన్నారు. అపరిచిత వ్యక్తులు పంపించే క్యూఆర్​ కోడ్​‌లను స్కాన్​ చేయవద్దని చెప్పారు. యూపీఐ రిక్వెస్టులను అంగీకరించవద్దని తెలిపారు. బ్యాంక్​ ఖాతాలకు టూ ఫ్యాక్టర్ అథెంటిఫికేషన్‌ను ఎనేబుల్​ చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, యువత సైబర్​ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. అయినా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నెంబర్​ కు సమాచారం అందించాలన్నారు. దాంతోపాటు
www.cybercrime.gov.in పోర్టల్‌ కు ఫిర్యాదు చేయాలన్నారు.

Also Read: Cyber Crime: మంచి ఫలితాన్ని ఇస్తున్న గోల్డెన్​ హవర్.. మీ డబ్బులు పోయాయా? వెంటనే ఇలా చేయండి

Just In

01

Mobile Recharge: మొబైల్ యూజర్లకు షాక్.. మళ్లీ పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు

YS Jagan Mass Warning: అధికారంలోకి రాగానే.. వాళ్లని జైల్లో పెడతాం.. జగన్ మాస్ వార్నింగ్

Google Pixel 10: Pixel 10 యూజర్లకు గుడ్ న్యూస్.. GPU అప్డేట్ వచ్చేసింది!

Avatar Fire and Ash: జేమ్స్ కామెరూన్ ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ సినిమాపై పాన్ ఇండియా దర్శకుడు ప్రశంసలు..

Google Meet Update: మీటింగ్‌లో వాయిస్ కట్ సమస్యకు చెక్.. గూగుల్ మీట్ కొత్త అప్‌డేట్