Crime News (Image Source: Twitter)
Viral

Crime News: ఉమ్మి వేయెుద్దని చెప్పినందుకు.. కత్తులతో పొడిచి దారుణంగా చంపారు!

Crime News: దేశంలో మానవత్వం నానాటికి నశించిపోతుంది. మంచి చెప్పినప్పటికీ కొందకు తీసుకోలేకపోతున్నారు. నాకే నీతులు చెప్తావా? అన్న రీతిలో మృగాళ్లలాగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ లో ఓ వ్యక్తిని అతి దారుణంగా ముగ్గురు వ్యక్తులు హత్య చేశారు. ఉమ్మి వేయడానికి అభ్యంతరం చెప్పాడన్న కారణంతో అతడ్ని పొట్టన పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

వివరాల్లోకి వెళ్తే..
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో ఈ దారుణం చోటుచేసుకుంది. రోడ్డుపై గుట్కా ఉమ్మేయడాన్ని అభ్యంతరం చెప్పినందుకు ఓ హోటల్ యజమానిని కత్తితో పొడిచి చంపిన ఘటనలో ముగ్గురిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు లేఖ్‌రాజ్‌ (25) నగరంలో ఓ దాబా నడుపుతున్నాడు. ఆదివారం రాత్రి విజయ్‌నగర్ ప్రాంతంలో అతనిపై దాడి జరిగి చనిపోయాడు. అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోయారని అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అమరేంద్ర సింగ్ తెలిపారు.

Also Read: Viral Video: ఏనుగుతో చెలగాటం.. చావు అంచుల వరకూ వెళ్లిన వ్యక్తి.. ఎలాగో మీరే చూడండి!

గపోలీసు అధికారి ఏం చెప్పారంటే?
అమరేంద్ర సింగ్ మాట్లాడుతూ.. దర్యాప్తులో లభించిన సమాచారంతో రాజ్ అహిర్వార్‌ (19), పవన్ రాజక్‌ (20), జగదీష్ సిసోడియా (33)లను అరెస్టు చేశామని తెలిపారు. ‘నిందితుల్లో ఒకరు మోటార్‌సైకిల్‌పై ప్రయాణిస్తుండగా రోడ్డుపై గుట్కా ఉమ్మేశాడు. అదే సమయంలో తన దాబా మూసివేసి ఇద్దరు స్నేహితులతో వెళ్తున్న లేఖ్‌రాజ్‌ ఆ చర్యకు అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీనితో వాగ్వాదం జరిగింది’ అని సింగ్ చెప్పారు. దాంతో నిందితులు.. లేఖ్‌రాజ్‌పై కత్తితో దాడి చేయగా.. తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మరణించాడని వివరించారు. నేరంలో ఉపయోగించిన మోటార్‌సైకిల్‌, కత్తిని స్వాధీనం చేసుకున్నామని, ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని పోలీసు అధికారి చెప్పారు.

Also Read This: Rajasthan: బాల్కనీ నుంచి దూకేసిన నవ వధువు.. వెలుగులోకి కళ్లు బయర్లుకమ్మే నిజాలు! 

Also Read This: Tollywood: తెలుగు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మినిస్టర్స్‌తో భేటీలు.. టాలీవుడ్‌లో అసలేం జరుగుతుంది?

Just In

01

Bigg Boss Telugu Season 9: అలాంటి ట్రాక్స్ లేకుండా బిగ్ బాస్ నడపలేరా? ఏకిపారేస్తున్న నెటిజన్స్

BRS Party: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్..?

Nursing Schools Scam: రాష్ట్రంలో నర్సింగ్ స్కూల్స్ దందాలు.. పట్టించుకోని అధికారులు

PDSU Demands: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని పీడీఎస్ యూ ధర్నా.. ఎక్కడంటే..?

Communist Parties: పునాది పై కామ్రేడ్ల కసరత్తు.. మెజార్టీ స్థానాలే లక్ష్యంగా ప్రణాళికలు