Bride jump (Image Source: AI)
Viral

Rajasthan: బాల్కనీ నుంచి దూకేసిన నవ వధువు.. వెలుగులోకి కళ్లు బయర్లుకమ్మే నిజాలు!

Rajasthan: రాజస్థాన్ కు చెందిన ఓ యువకుడు ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్నాడు. తన భార్యతో కలిసి ఎంతో సంతోషంగా కలకాలం జీవించాలని కలలు కన్నాడు. కానీ, పెళ్లైన రెండో రోజే వధువు బాల్కనీ నుంచి దూకి పారిపోయే ప్రయత్నం చేయడం వరుడ్ని (Groome) షాక్ కు గురిచేసింది. పెళ్లి ముసుగులో యువకులను మోసం చేసే అంతర్రాష్ట్ర ముఠాతో ఆమెకు సంబంధాలు ఉన్నాయని తెలిసి ఖంగు తిన్నాడు.

వివరాల్లోకి వెళ్తే..
రాజస్థాన్ (Rajasthan) లోని జోధ్‌పూర్‌ జిల్లా (Jodhpur district) బనాద్‌ పోలీస్‌స్టేషన్‌ (Banad police station) పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వరుడు భరత్‌కి పెళ్లి కుదరడం కష్టంగా మారడంతో అతని తండ్రికి తెలిసిన నందకిశోర్‌ (Nandkishore Soni) అనే వ్యక్తి పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు. బీహార్‌కి చెందిన సుమన్‌ పాండే (23)ని సరైన జోడీగా పరిచయం చేశాడు. జీవిత భాగస్వామి దొరికిందని భావించిన భరత్.. రూ.3 లక్షల కట్నానికి ఒప్పందం చేసుకొని పాండేను పెళ్లి చేసుకునేందుకు అంగీకరించాడు. వీరి పెళ్లి ఆర్య సమాజ్ (Arya Samaj temple)లో హిందూ సంప్రదాయ పద్ధతుల్లో జరిగింది.

భర్తకు తెలియడంతో..
అయితే పెళ్లి జరిగిన రెండో రోజు నూతన వధూవరులకు ఫస్ట్ నైట్ జరిపించాలని పెద్దలు నిర్ణయించారు. ఆ రోజు రాత్రే అసలు విషయం బయటపడింది. వధువు పాండేకు అప్పటికే పెళ్లైన విషయం భరత్ తెలుసుకున్నాడు. పెళ్లి సమయంలో తాను అవివాహిత అని చెప్పి అబద్దపు పత్రాలను పాండే సమర్పించినట్లు గుర్తించారు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తన గుట్టు రట్టు అవుతుందన్న భయంతో ఇంటి నుంచి పారిపోవాలని పాండే నిర్ణయించింది. తన ముఠా సభ్యులకు సమాచారం చేరవేసింది. చీరను తాడుగా కట్టి బాల్కనీ నుంచి కిందికి దిగేందుకు యత్నించింది. అప్పటికే అక్కడకు చేరుకున్న సహచరులు సందీప్, రవి కింద ఆమె కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ క్రమంలో పాండే కిందికి దిగుతున్న క్రమంలో చీర ఒక్కసారిగా తెగి ఆమె అమాంతం కిందపడిపోయింది. దీంతో పాండే రెండు కాళ్లు విరిగిపోయాయి.

Also Read: Rahul Gandhi: దిల్లీలో హై టెన్షన్.. రాహుల్, ప్రియాంక అరెస్ట్.. రాజధానిలో ఏం జరుగుతోంది?

వధువు గ్యాంగ్ కోసం గాలింపు
పాండే కేకలు విన్న భరత్‌ కుటుంబసభ్యులు అక్కడికి చేరుకుని పాండేను పట్టుకున్నారు. ఆమె గ్యాంగ్ సభ్యులను పట్టుకునేందుకు ప్రయత్నించగా వారు అక్కడ నుంచి పారిపోయారు. గాయపడిన సుమన్ పాండే (Suman Pandey)ను ఆసుపత్రికి తరలించగా తన పూర్తి వివరాలను భర్తకు తెలియజేసింది. భరత్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా.. తన ముఠాకు సంబంధించిన పూర్తి వివరాలను పాండే బయటపెట్టింది. పెళ్లి పేరుతో యువకులను మోసం చేస్తున్న గ్యాంగులో తనతో పాటు యూపీకి చెందిన సందీప్ శర్మ, బిహార్ కు చెందిన రవి, రూబీ దేవి.. జోద్ పూర్ కి చెందిన నంద కిషోర్, జితేంద్ర సోనీ ఉన్నారని పోలీసులకు వివరించింది. ఈ ముఠా ఒంటరి యువకులను లక్ష్యంగా చేసుకొని పెళ్లి వల విరుసుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పెళ్లి అనంతరం అత్తింటిలోని నగదు, నగలను వధువు దోపిడి చేసి పారిపోతున్నట్లు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ గ్యాంగ్.. గతంలో ఇలాంటి మోసాలకు పలుమార్లు తెగబడి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

Also Read This: Viral Video: మగాడికే కాదు.. సింహానికి అదే పరిస్థితి.. ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు!

Just In

01

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!