Cinematography ministers
ఎంటర్‌టైన్మెంట్

Tollywood: తెలుగు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మినిస్టర్స్‌తో భేటీలు.. టాలీవుడ్‌లో అసలేం జరుగుతుంది?

Tollywood: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం చోటు చేసుకున్న పరిణామాలు ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఫిల్మ్ ఫెడరేషన్ 30 శాతం జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ, షూటింగ్స్ బంద్ చేశారు. 30 శాతం వేతనం పెంచి ఇచ్చే వారి సినిమాలకు మాత్రమే వారు షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో చిత్ర నిర్మాతలతో ఫెడరేషన్ సభ్యులు వరుస భేటీలను నిర్వహిస్తున్నారు. కానీ సమస్య మాత్రం ఓ కొలిక్కి రావడం లేదు. నిర్మాతలేమో.. ఇప్పటికే వేతనం ఎక్కువగా ఇస్తున్నామని, సినిమాలు సరిగా ఆడటం లేదని, నిర్మాతలు నష్టపోతున్నారని ఫిల్మ్ చాంబర్ తరపు నుంచి లేఖలు విడుదల చేస్తుంటే, ఫెడరేషన్ సభ్యులు మాత్రం చాలా కాలంగా జీతాలు పెంచలేదని, ఇప్పుడు పెంచాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో విషయం చిరంజీవి, బాలకృష్ణల వరకు వెళ్లినా, ఎవరూ డైరెక్ట్‌గా ఇన్వాల్స్ అవలేదు. నిర్మాతలు చిరంజీవితో భేటీ అయిన అనంతరం ఫెడరేషన్ సభ్యులతో కూడా మాట్లాడి ఓ నిర్ణయం తీసుకుందామని, ఈ లోపు నిర్మాతల మండలితోనే సమస్య తొలగిపోయేలా ప్రయత్నాలు చేయాలని సూచించారు. ఈ క్రమంలో ఆయనపై కొన్ని లేనిపోని వార్తలు రావడం వాటిని ఆయన ఖండించడం వంటి పరిణామాలన్నీ తెలిసినవే.

Also Read- Rahul Gandhi: దిల్లీలో హై టెన్షన్.. రాహుల్, ప్రియాంక అరెస్ట్.. రాజధానిలో ఏం జరుగుతోంది?

ఈ క్రమంలో ఫెడరేషన్ సభ్యులు తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy)ని సోమవారం కలిసి, విషయం తెలియజేశారు. ఈ క్రమంలో వారి మధ్య చర్చలు నడుస్తున్నాయి. ఈ సమావేశం అనంతరం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాల్సి ఉంది. ఆయన మాత్రం మొన్న దిల్లీ నుంచి మాట్లాడుతూ.. కార్మికులకు వేతనాలు పెంచాల్సిందేనని, అందుకు సంబంధించిన విషయాలు చూసుకునేందుకు ప్రభుత్వం తరపున దిల్ రాజుకు బాధ్యతలు అప్పగించినట్లుగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో ఈ విధంగా సినిమా ఇండస్ట్రీ పరిస్థితి నడుస్తుంటే.. మరోవైపు సినీ నిర్మాతలలో కొందరు ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్‌ని కలవడం చర్చనీయాంశమైంది.

Also Read- Jr NTR: సీఎం రేవంత్‌కు థ్యాంక్స్ చెప్పడం మరిచిపోయిన ఎన్టీఆర్.. ఏం చేశాడంటే?

సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌ (Kandula Durgesh)తో తెలుగు సినిమా నిర్మాతలు భేటీ అయ్యారు. గత కొన్ని రోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో జరుగుతున్న ఈ భేటీ చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై మంత్రితో చర్చించనున్నట్లుగా తెలుస్తుంది. వీటితో పాటు మరికొన్ని అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ భేటీకి చిత్ర పరిశ్రమ నుంచి బివిఎస్ఎన్ ప్రసాద్, డివివి దానయ్య, కెఎల్ నారాయణ, భరత్, నాగవంశీ, యెర్నేని రవిశంకర్, విశ్వప్రసాద్, బన్నీ వాసు, వంశీ (యూవీ క్రియేషన్స్), చెర్రీ (మైత్రీ మూవీ మేకర్స్), వివేక్ కూచిభొట్ల, సాహు గారపాటి వంటి నిర్మాతలంతా హాజరయ్యారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!