Pushpitha Laya: వరంగల్ ముంపుకు కారణం కబ్జా దారులు, వాటిని అరికట్టలేని ప్రజా ప్రతినిధులే కారణం అని ఆరోపించిన ట్రాన్స్ జెండర్ పుష్పితలయ(Pushpithalaya) పని చేతకాని ప్రజాప్రతినిధులకు చీరే సారే పంపిస్తామన్నారు. మంగళవారం ఆమె వరంగల్ వరదలకు సంబంధించి మీడియా సమావేశంలో మాట్లాడారు.
వరద ముంపుతో ఇబ్బందులు..
ట్రాన్స్ జెండర్స్(Transgenders) ఆశీర్వదిస్తే మంచి జరుగుతుందని శపిస్తే చెడు జరుగుతుందనే ఆలోచనలున్నా ఈ సందర్భాలలో నేను ఒక ట్రాన్స్ జెండర్ గా ఉండి వరంగల్(Warangal) నగరంలో వరద ముంపుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి అండగా నిలుస్తున్నానని ట్రాన్స్ జెండర్ పుష్పిత లయ అన్నారు. వరంగల్ నగర పరిధిలోనీ విలీన గ్రామాలతో కలుపుకుని గెలిచిన నలుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక ఎంపీలకు పరిపాలించడం రావడంలేదని హేద్దేవా చేశారు. ఒక ట్రాన్స్ జెండర్ గా నేను ఆవేదన వ్యక్తం చేస్తూ పరిపాలన సక్రమంగా చేసేందుకు మీకు చీర, పసుపు, కుంకుమ, గాజులు పంపించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆమె వ్యాఖ్యలు చేశారు.
Also Read: AICC: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై ఏఐసీసీ ఆరా? ఇన్‌ఛార్జ్ మంత్రుల నుంచి రిపోర్ట్ సేకరణ!
133 మీటర్లు ఉన్న బొంది వాగు..
వరదలు వచ్చేందుకు మీరు తీసుకున్న కమిషన్లే వాటికి నిదర్శనమని మండిపడ్డారు. 133 మీటర్లు ఉన్న బొంది వాగు 33 మీటర్లు కూడా లేకుండా పోయింది. నయీం నగర్(Nayeem nagar) నాల ఆక్రమణకు గురి అయిన అడిగే వారు లేక పోవడం, ప్రజా ప్రతినిధుల చేతకాని తనం నేటి ముంపుకు కారణం అని ఆమె ఆరోపించారు. వరంగల్(Warangal) నగరానికి హైడ్రా(Hydraa) రాకుండా ఈ ఎమ్మెల్యేలు(MLA) ఎంపీ(MP)లు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పటికైన ఆక్రమణలు తొలగించి ప్రజలకు ముంపు భయం లేకుండా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకంటే ఆందోళన బాట పడతామని హెచ్చరించారు.
Also Read: Child Marriages: బాల్య వివాహాలు.. బాలల భవిష్యత్తుకు యమ పాశాలు
