Manda Krishna Madiga (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Manda Krishna Madiga: సీఎం రేవంత్ రెడ్డిపై మందకృష్ణ ఘాటు వ్యాఖ్యలు?

Manda Krishna Madiga: ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచినా పెన్షన్ పెంచడం లేదని రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సర్కార్ను ఎంఆర్పీఎస్(MRPS) నాయకుడు మందకృష్ణ(Mandakrishna) విమర్శించారు. ప్రతిపక్ష నేత కెసిఆర్(KCR) అడుగడు..అధికార పార్టీ అమలు చేయదని ఏద్దేవా చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరు, పరిగి నియోజకవర్గల్లో శనివారం సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పింఛన్‌దారులను సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) మోసగిస్తున్నారని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మండిపడ్డారు.

ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని

అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగుల పింఛన్‌ రూ.6 వేలు, ఆసరా పింఛన్‌ రూ.4 వేలు ఇస్తామని హామీనిచ్చారని..19 నెలలు దాటినా అమలు చేయట్లేదని విమర్శించారు. పింఛన్‌దారులకు అందాల్సిన సొమ్ము.. నెలకు రూ.వెయ్యి కోట్ల చొప్పున ఇప్పటివరకు రూ.20 వేల కోట్లు పక్కదారి పట్టించారని ఆరోపించారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచినా పేద ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర వైకల్యం కలిగిన కండరాల క్షీణత ఉన్న వ్యాధిగ్రస్తులకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.15 వేల పెన్షన్‌ ఇవ్వాలని మందకృష్ణ మాదిగ డిమాండ్‌ చేశారు.అధికార పక్షం అన్యాయం చేస్తుంటే ప్రతిపక్షం నోరు విప్పడం లేదని మందకృష్ణ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు.తెలంగాణలో చేయూత ద్వారా పెన్షన్ తీసుకుంటున్న లబ్దిదారులను ప్రభుత్వం మోసం చేసిందని ఆయన ఆరోపించారు.

Also Read: UP Crime: రాఖీ కట్టిన మైనర్ బాలికపై హత్యాచారం.. వీడు అసలు మనిషేనా?

బకాయిలు చెల్లించాలని డిమాండ్

ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా లబ్దిదారులకు నాలుగు వేల రూపాయలు చెల్లిస్తామని .. ఆ తర్వాత విస్మరించిందన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Chndrababu Naidu)కు ఉన్న చిత్తశుద్ది రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి లేదన్నారు.నవంబర్ మొదటివారంలో పెన్షన్ తో పాటుపది నెలల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పెంచిన పెన్షన్లు ఇవ్వకపోతే వికలాంగుల సమాజాన్ని చేయుత దారులను అందర్నీ మరో ఉద్యమానికి మానసికంగా సిద్ధం చేయడానికి ఎమ్మార్పీఎస్ బాధ్యత తీసుకుంటుందని అన్నారు. నవంబర్ 26న పెన్షన్ దారుల పోరాట దినంగా ప్రకటించి.. వికలాంగులు, చేయూత పెన్షన్ దారులతో చలో హైదరాబాద్(Hydrabad)కు పిలుపునిస్తామన్నారు. ఇందిరా పార్క్ దగ్గర వికలాంగుల మహా గర్జన వేలాది మందితో నిర్వహిస్తామని మందకృష్ణ స్పష్టం చేశారు.

Also Read: Actress: పెళ్ళై పిల్లలున్న డైరెక్టర్ పై మోజు పడుతున్న కుర్ర హీరోయిన్?

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?