UP Crime: ఉత్తర్ ప్రదేశ్‌లో ఓ మానవ మృగం రెచ్చిపోయింది. రాఖీ కట్టిన కొన్ని గంటలకే ఓ మైనర్ బాలికపై 33 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడి చేశారు. అనంతరం ఆమె ప్రాణాలను బలిగొన్నాడు. నిందితుడికి ఆ బాలిక వరుసకు మేనకోడలు కావడం గమనార్హం. రాఖీ రోజు (ఆగస్టు 9) ఈ విషాదం చోటుచేసుకోగా.. పరారీలో ఉన్న నిందితుడ్ని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఫుల్లుగా మద్యం తాగి..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు సుర్జీత్ రాఖీ సందర్భంగా గత శనివారం (ఆగస్టు 9) ఉదయం తన మామ ఇంటికి వెళ్లాడు. ఈ సందర్భంగా బాలిక అతడికి రాఖీ కట్టింది. అయితే రాత్ ఫుల్లుగా మద్యం సేవించిన నిందితుడు.. నిద్రిస్తున్న బాలికపై లైంగిక దాడి చేశాడు. విషయం బయటపడుతుందన్న భయంతో ఆమెను హత్య చేశాడు. అనంతరం దీనిని ఆత్మహత్యలా చిత్రీకరించేందుకు బాలిక ఉరి వేసుకున్నట్లు సీన్ సెట్ చేశాడు.
Also Read: Jangaon Strange Incident: రాష్ట్రంలో అద్భుతం.. వింతగా ప్రవర్తించిన చెట్టు.. ఇది దేవుడి మహిమేనా?
తప్పుదోవ పట్టించే యత్నం
అయితే బాలిక తండ్రి మరో గదిలో ఉండటంతో ఏం జరిగిందో అతడికి తెలియలేదు. మరుసటి రోజు ఉదయం కూతురి గదిలోకి వెళ్లి చూడగా బాలిక శవం వేలాడుతూ కనిపించింది. దీంతో వెంటనే తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులకు ఇంట్లో రక్తపు మరకలు కనిపించడంతో బాలికది ఆత్మహత్య కాదని నిర్ధారించారు. ఇంట్లోని కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిగా ప్రశ్నించడం ప్రారంభించారు. ఈ క్రమంలో సుర్జీత్ అక్కడే ఉంటూ తన సమాధానాలతో కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు.
Also Read: Dating With AI: 5 నెలలుగా ఏఐతో డేటింగ్.. నిశ్చితార్థం కూడా జరిగింది.. యువతి షాకింగ్ ప్రకటన!
చివరకూ నేరాన్ని అంగీకరించి..
కుటుంబ సభ్యులు సమాధానం ఇస్తున్న సమయంలోనూ సుర్జీత్ కలుగుచేసి విచారణకు ఆటంకం కలిగించేలా ప్రయత్నించాడు. అతడి ప్రవర్తన అనుమానస్పదంగా అనిపించడంతో.. పోలీసులు తమదైన శైలిలో సుర్జీత్ ను విచారించారు. దీంతో బాలికను తానే హత్యాచారం చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. మరోవైపు పోస్టుమార్టం రిపోర్ట్‌లోనూ బాలికపై లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. దీనికి తోడు బాధితురాలి గోర్లు, చేతిలో సుర్జీత్ వెంట్రుకలు లభ్యమయ్యాయి. దానిని డీఎన్ఏ పరీక్షకు పంపగా.. అది నిందితుడివేనని తేలింది.