Jurala Project (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Jurala Project: జూరాలకు కొనసాగుతున్న వరద ప్రవాహం.. 9 గేట్లు ఎత్తివేత!

Jurala Project: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టి(Almatti), నారాయణపూర్ డ్యాం,(Narayanpur Dam)లలో నీటి నిల్వలు గరిష్ట స్థాయికి చేరడంతో అక్కడి అధికారులు నీటిని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు(Priyadarshini Jurala Project)కు వదులుతున్నారు. దీంతో జూరాలకు మరో సారి వరద ప్రవాహం క్రమంగా భారీగా పెరుగుతోంది.

Also Read: Srushti Fertility Centre Case: డాక్టర్ నమ్రత సీక్రెట్స్ బట్టబయలు.. ఈ ప్లాన్‌తో కోట్లు కొల్లగొట్టింది!

9 క్రస్ట్ గేట్స్ ఓపెన్..

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల ప్రాజెక్టు 9 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువనున్న శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని వదులుతున్నారు. ఇన్ ఫ్లో(In Flow) 95 వేల క్యూసెక్కులు నమోదు అవుతుండగా ఔట్ ఫ్లో(Out Flow) 1.3 లక్షల క్యూసెక్కులు నీటిని దిగువకు వదులుతున్నారు. ఇందులో జూరాల జల విద్యుత్ ఉత్పత్తి(Jurala Hydropower Generation)కి 41,359 క్యూసెక్కుల నీటిని వదులుతుండగా, జూరాల ఎడమ ప్రధాన కాలువకు 550 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 47 క్యూసెక్కుల నీరు పోతుంది.

ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516. మీటర్లు ఉండగా ప్రస్తుత నీటిమట్టం.. 318.270 మీటర్ల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 9.512 టీఎంసీలుగా కొనసాగుతోంది.జూరాల ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాలలో 11 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

Also Read: Bellamkonda Sai Sreenivas: ‘కిష్కింధపురి’ చూసిన వారంతా.. ఏం అడుగుతారంటే?

Just In

01

OTT review: ఆఫీస్‌లో కొత్త బాస్ మాజీ లవర్ అయితే.. పాపం వాడి పరిస్థితి ఏంటంటే?

India vs Pakistan: ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌పై పంజాబ్ కింగ్స్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

Khammam District: చేసేది ప్రభుత్వ ఉద్యోగం.. కానీ సెటిల్మెంట్ లక్ష్యం.. ఇంతకీ ఎవరు..?

CM Revanth Reddy: సీఎంగా తొలి గోదావరి పుష్కరాలు.. రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

KTR: అంగట్లో కొలువులను అమ్ముకున్న ప్రభుత్వం: కేటీఆర్