Jogulamba Gadwal (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Jogulamba Gadwal: సిసిఐ కొనుగోలు ఊపందుకునేనా..! పత్తి రైతుకు ప్రకృతి సహకరించేనా..!

Jogulamba Gadwal: జోగులాంబ గద్వాల జిల్లాలో మూడు పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యాయి. అందులో గద్వాలలో రెండు, అలంపూర్ చౌరస్తాలో ఒక సీసీఐ(CCI) కొనుగోలు కేంద్రాన్ని మార్కెటింగ్ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే అలంపూర్ చౌరస్తాలో ఏర్పాటుచేసిన వరసిద్ధి వినాయక కొనుగోలు కేంద్రంలో పత్తి కొనుగోలు ప్రారంభం కాగా గద్వాలలోని రెండు మిల్లులలో రైతులు పత్తి అమ్మేందుకు నేటి నుంచి స్లాట్ బుక్ చేసుకున్న అవకాశాన్ని అందుబాటులోకి తేనున్నట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు.. ప్రస్తుత ఖరీఫ్ లో జోగులాంబ గద్వాల(Jogulamba Gadwala) జిల్లాలో 1.87 లక్షల ఎకరాలలో పత్తి పంటను సాగు చేస్తున్నారు. కాగా ఈ దఫా అధిక వర్షాలు కురవడంతో భూమిలో తేమశాతం అధికమై పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపింది. ఎకరాకు ఐదు ఆరు క్వింటాలకు మించి రావడం లేదని రైతుల చెబుతున్నారు. ఇప్పటికే పత్తిని మొక్క నుంచి వేరు చేసే ప్రక్రియను ప్రారంభించారు. కూలీల కొరత కారణంగా కేజీకి 15 నుంచి 20 రూపాయల దాకా వెచ్చించి పత్తిని తీసుకుంటున్నారు. 60 శాతం మేర పంట కోతలు పూర్తయ్యాయి. గ్రామాలలో దళారులు పత్తిని తక్కువ ధరకు కొనుగోలు చేసి రాయచూర్ కు తరలిస్తున్నారు. మరికొందరు స్థానికంగా ధర రాకపోతే పత్తి క్వాలిటీ బాగుంటే రాయచూర్ మిల్లులలో అమ్ముకున్నారు.

స్లాట్ బుకింగ్ తప్పనిసరి

పత్తి మిల్లులలో పత్తిని కొనుగోలు కోసం సిసిఐ కపాస్ కిసాన్ యాప్ ను అమల్లోకి తీసుకువచ్చింది. అందులో భాగంగా రైతులు సీసీఐకి అమ్మాలంటే ఖచ్చితంగా మార్కెట్ యార్డ్ కు రాకముందే యాప్ ద్వారా జిన్నింగ్ మిల్లు ఎంపిక చేసుకొని స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. అందులో తేదీ నిర్ధారణ చేసుకున్న తర్వాతే కొనుగోలు కేంద్రానికి రావాల్సి ఉంటుంది.

8 శాతం తేమ ఉంటేనే..

పత్తిలో 8 శాతం తేమ ఉంటేనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలుకు రూ.8,110 చెల్లిస్తామని సీసీఐ అధికారులు వెల్లడిస్తున్నారు. ప్రతి అదనపు శాతానికి రూ 81 కోత ఉంటుందని తెలిపారు. అది కూడా 12 శాతం వరకే. అంతకు మించితే కొనుగోలు చేసేది లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇదే ఇప్పుడు పత్తి రైతును ఇబ్బందులకు గురిచేస్తోంది. తరచుగా వాతావరణ పరిస్థితులు ఉండడంతో ఆరబెడదామంటే అనువైన వాతావరణం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. తరచూ కురుస్తున్న వర్షాలతో రైతులు బెంబేలెత్తుతున్నారు. ఈ పరిస్థితుల్లో పత్తిని ఆరబెట్టేదెలా అనే ఆలోచనలో పడ్డారు. మరోవైపు ఇంట్లో నిల్వ చేస్తే తేమశాతం ఉన్న దానికంటే పెరిగే పరిస్థితి ఉంది.

Also Read: Mallujola Venugopal: ప్రస్తుత పరిస్థితుల్లో లొంగి పోవాల్సి వచ్చింది.. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల మధ్య పనిచేయాలనే సంకల్పం!

మందకోడిగా సాగుతున్న కొనుగోలు

జిల్లాలో మూడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన నేటికీ ఆశించిన స్థాయిలో కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కాలేదు. ప్రస్తుతం వర్షాలు కులుస్తుండడంతో తేమ ఉంటుందనే కారణంతో స్లాట్ బుక్ చేసుకునేందుకు గద్వాల కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేకపోయాయి. నేటి నుంచి సైట్ అందుబాటులోకి రానున్నడంతో బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది.

తేమ పేరుతో దోచుకుంటున్న దళారులు

రైతులు ఎంతో శ్రమించి పండించిన పత్తి పంటను తేమ పేరుతో రైతులు ఆశించిన మద్దతు ధరను దళారులు ఇవ్వడం లేదు. అసలే పత్తి పంటలో ఆశించిన స్థాయిలో దిగుబడులు రాకపోవడంతో ఆర్థికంగా పెట్టుబడుల రూపంలో నష్టపోతున్నామని ఒక వైపు రైతు బాధపడుతుండగా మరోవైపు బహిరంగ మార్కెట్లో ఆశించిన స్థాయిలో మద్దతు ధర లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రానున్న రోజులలో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉండటంతో సీసీఐ ద్వారా మద్దతు ధరతోనైనా కోలుకుందామని రైతులు ఆశిస్తున్నారు.

ఊపందుకొనున్న కొనుగోలు: మార్కెటింగ్ అధికారి పుష్పమ్మ

జిల్లాలో ఏర్పాటు చేసిన మూడు కొనుగోలు కేంద్రాలలో నేటి నుంచి పూర్తిస్థాయిలో కొనుగోలు ప్రక్రియ చేపట్టేందుకు చర్యలు చేపట్టాం. దీంతో రైతులు కేంద్రాలకు పత్తిని తీసుకువచ్చే అవకాశం ఉంది.ప్రతి శని, ఆదివారాలలో సీసీఐ కొనుగోలు కేంద్రాలు బంద్ ఉండనున్నాయి. ఈ విషయాన్ని రైతులు గమనించాలని మార్కెటింగ్ శాఖ అధికారి పుష్ప సూచించారు. ప్రతిని పూర్తిగా ఆరబెట్టిన తర్వాత మార్కెట్ కు తీసుకురావడం ద్వారా మద్దతు ధర పొందే అవకాశం ఉందన్నారు కపాస్ కిసాన్ యాప్ లో స్లాట్ బుకింగ్ చేసుకొని తేదీ నిర్ధారణ తర్వాతే రైతు పత్తిని విక్రయించేందుకు కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలన్నారు.

జాతీయ రహదారిపై ధర్నా..

ఉండవెల్లి మండలం శివారులోని జాతీయ రహదారి ప్రక్కన శ్రీ వరసిద్ధి వినాయక సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రంలో.. ఎకరాకు 12 క్వింటాలు బదులు 7 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేయడంతో జాతీయ రహదారిపై అక్కడి రైతుల ధర్నాకు దిగారు. ఎకరాకు 12 క్వింటాల పత్తి కొనుగోలు చేయాలంటూ రైతుల డిమాండ్ చేశారు. నేషనల్ హైవే 44 పై చిన్న ధర్నాతో ఆమదాలపాడు వద్ద పత్తి రైతుల ధర్నా దాదాపుగా కిలోమీటర్ మేరా భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

 

Also Read: Naagin 7 First Look : అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న నాగిన్ 7 ఫస్ట్ పోస్టర్ లుక్ రిలీజ్.. ఈ సారి నాగినిగా ఎవరంటే?

Just In

01

Dheeraj Mogilineni: వేస్ట్.. ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌పై ‘ది గర్ల్ ‌ఫ్రెండ్’ నిర్మాత షాకింగ్ కామెంట్స్!

Prabhas: ప్రశాంత్ వర్మతో ప్రభాస్ చేయాల్సిన ‘బ్రహ్మరాక్షస్’ డౌటేనా?

Bigg Boss Buzzz: మాధురిపై శివాజీ కౌంటర్స్ చూశారా? ఇది వేరే లెవల్ అంతే..!

TPCC: జూబ్లీహిల్స్‌లో టీపీసీసీ ‘ఉమెన్స్ వ్యూహం’.. రంగంలోకి 7 మహిళా బృందాలు.. ఏం చేస్తాయంటే?

RT76: ఆషికాతో రొమాన్స్‌లో రవితేజ.. షూటింగ్ అప్డేట్ ఇదే!