Mallujola Venugopal: నేను ద్రోహిని కాదు. ప్రస్తుత మావోయిస్టు పరిస్థితుల్లో లొంగి పోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని ఇటీవలనే లొంగిపోయిన మావోయిస్టు మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు, పోలిట్ బ్యూరో సభ్యుడు సోను దాదా అలియాస్ భూపతి అలియాస్ మల్లోజుల వేణుగోపాలరావు (Mallujola Venugopal) ఓ వీడియోను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేసిన సారాంశం. మావోయిస్టు పార్టీలో ఉన్నప్పుడే ఆయుధాలు విడిచి పెట్టాలని సహచరులకు విజ్ఞప్తి చేశానన్నారు. మావోయిస్టు పార్టీలో సైదాంతిక సంక్షోభం తీవ్రమవుతున్నట్లుగా అంగీకరించానని చెప్పారు. చత్తీస్గడ్ లో ప్రస్తుతం మావోయిస్టు పార్టీ అగ్ర నేతలు తనను సంస్థ ద్రోహిగా పిలుస్తున్నారని, దేశద్రోహిగా పరిగణించడం ఏం మాత్రం మంచిది కాదని స్పష్టం చేశారు.
Also Read: Maoist Letter: తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రతినిధి మావోయిస్టు జగన్ లేఖ కలకలం
ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా మారిపోయిన నేపథ్యం
అయితే తాను ద్రోహిని, దేశద్రోహిని మాత్రం కాదని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా మారిపోయిన నేపథ్యంలోనే తన సహచరులు 60 మందితో కలిసి ఆయుధాలు వదులుకోవాలని నిర్ణయం మేరకు సరెండర్ అయ్యామన్నారు. మావోయిస్టు పార్టీలో చాలామంది నేతలు ఇప్పటికి భూభాగం, అధికారాన్ని పొందేందుకే తుపాకీ మార్గాన్ని అవలంబిస్తున్నారని వివరించారు. అయితే ప్రజల నుండి గతంలో ఉన్న సానుభూతి నేడు కనిపించడం లేదని వీడియో సందేశంలో తెలిపారు. ప్రస్తుత మావోయిస్టు పరిస్థితులను గమనిస్తున్న ప్రజలు పార్టీని దూరం పెడుతూ వస్తున్నారని తెలిపారు. మావోయిస్టుల ప్రస్తుత వైఫల్యాన్ని ప్రజల తిరుగుబాటుతోనే స్పష్టమవుతోందని వెల్లడించారు. తోటి సహచరులను ఎన్కౌంటర్లలో కోల్పోయిన తర్వాత పూర్తిస్థాయిలో ంగి పోవాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల మధ్య పనిచేయాలని సంకల్పం
ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో నెలకొన్న విభేదాల కారణంగా ఎక్కువ కాలం మావోయిస్టులకు మనుగడలేదని గ్రహించిన తాము ఆయుధాలు విడిచి సరెండర్ అయ్యామన్నారు. ప్రస్తుతం తాను ప్రజల మధ్య ఉంటూ ప్రజాస్వామిక మార్గాల ద్వారా వారి కోసం పనిచేయాలనుకుంటున్నట్లు భూపతి తెలిపారు. ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ఇది తుపాకీని తీయడానికి సరైన సమయం కాదు, ప్రజలతో కలిసి ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజల కోసం పోరాటం చేయాలని సరెండర్ అయ్యామని వెల్లడించారు.
ఆయుధాలు పట్టుకున్న సహచరులు లొంగిపోవాలని విజ్ఞప్తి
ఆయుధాలు పట్టుకున్న సహచరులు ప్రభుత్వాల ఎదుట లొంగిపోవాలని, కుటుంబ సభ్యులతో ప్రశాంత వాతావరణంలో శాంతియుత జీవనం కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. అందుకోసం నా నెంబర్ 8856038533, రూపేష్ నెంబర్ 6267138163 లను సంప్రదించాలని కోరారు. ఆయుధాలు వదులుకోవాలనుకునే మావోయిస్టులు నేరుగా తన నెంబర్ సంప్రదించాలని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మావోయిస్టు పార్టీ మనుగడ ఎంత మేరకు కొనసాగించగలదో ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని విజ్ఞప్తి చేశారు.
Also Read: Former Maoist: ఆరేళ్లక్రితం లొంగిపోయిన మావోయిస్టు.. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా.. ఫొటో ఇదిగో
