Maoist Letter: విప్లవోద్యమ నమ్మకద్రోహులరా.. పీడిత ప్రజల చేతిలో శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్, మల్లోజుల వేణుగోపాల్ రావు(Mallojula Venugopal Rao), తక్కెళ్ళపల్లి వాసుదేవరావు(Takkellapalli Vasudeva Rao) లపై ధ్వజమెత్తారు. శనివారం భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ(Telangana State Committee) అధికార ప్రతినిధి జగన్(Jagan) విడుదల చేసిన లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే మల్లోజుల, తక్కలపల్లి లపై కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుట లేఖ విడుదల అయిన విషయం విధితమే. తాజాగా తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరిట ఆ ఇద్దరిపై లేఖ విడుదల కావడం కూడా చర్చనీయంగా మారింది. విప్లవ శ్రేణులారా.. ప్రజాస్వామ్య వాదులారా.. ప్రజలారా.. భారత దేశ ఎంఎల్ పార్టీ చరిత్రలో ఎన్నడు జరగని తీవ్రమైన నమ్మకద్రోహం మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోను దాదా(Sonudada), తక్కెళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ రూపేష్ అలియాస్ సతీష్ లకు చెందిన ముఠా వలన భారీ నమ్మకద్రోహం జరిగిందన్నారు.
ఈ రెండు ఘటనలు విప్లవోద్యమ పురోగమన చరిత్రను మాయని మచ్చగా మిగిలాయన్నారు. ద్రోహాలు, నమ్మక ద్రోహాలు పార్టీకి బయట నుండి ఎక్కువ జరుగుతాయని తెలిపారు. చాలా తక్కువ సందర్భాలలో పార్టీలోని శ్రేణుల నుండి తప్పిదాలు జరుగుతుంటాయని పేర్కొన్నారు. పీపుల్స్ వార్, మావోయిస్టు పార్టీ చరిత్రలో కత్తుల సమ్మయ్య వంటి కొన్ని సంఘటనలు, గోవిందరెడ్డి వంటి కొన్ని సంఘటనలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటనలకు పాల్పడిన వాళ్లు డిసి స్థాయి లోపు వాళ్లేనని వెల్లడించారు.
అంతుచిక్కని సిద్ధాంతాలు..
ఇప్పుడు పార్టీకి, విప్లవోద్యమానికి మరీ ముఖ్యంగా ఆదివాసులకు జరుగుతున్న నష్టానికి కారకులైన నమ్మకద్రోహులు పార్టీలో అగ్రసేని నాయకులుగా ఉన్నవారు కావడం వల్ల మనువాద ఫాసిస్ట్ రాజ్యానికి, దోపిడి వర్గాలకు ఉపయోగం జరుగుతుందన్నారు. ఇటువంటి చర్యలతో తాత్కాలిక విజయం మాత్రమేనని గుర్తుంచుకోవాలని సూచించారు. అతివాద వాగాడంబరం, మితవాద, అవకాశవాద ఆచరణతో అత్యంత గోప్యంగా దోపిడీ వర్గాలకు ఉపయోగపడే కార్యాచరణను పార్టీ శ్రేణుల ద్వారా చేయిస్తూ విప్లవోద్యమానికి తీవ్రమైన నష్టం చేస్తున్నారని మండిపడ్డారు.
అనేక కుంటి సాకులతో అతుకని.. పోసగని వ్యూహ, ఎత్తుగడలను వల్లిస్తూ విప్లవ శ్రేణుల చైతన్యాన్ని దిగజార్చడానికి అంతుచిక్కని సిద్ధాంతాలు వల్లిస్తూ, నాయకత్వంలో కమ్యూనికేషన్ గ్యాప్ సృష్టిస్తూ దోపిడీదారుల ఎజెండాను పకడ్బందీగా సాగిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. పార్టీ నాయకత్వానికి ఎక్కడ అనుమానం రానివ్వకుండా జాగ్రత్త పడుతూ గొప్ప విప్లవకారులుగా ఫోజులు కొడుతూ అనేక నష్టాలకు కారకులయ్యారని విమర్శించారు.
Also Read: PDS Rice Scam: కండ్లకోయలో భారీగా అక్రమ రేషన్ బియ్యం దందా.. వాటి విలువ ఎంతో తెలిస్తే షాక్..!
మ్మకద్రోహుల మాయమాటలు నమ్మి..
కేంద్ర, చత్తీస్గడ్ రాష్ట్ర ప్రభుత్వాల నేతృత్వంలో మావోయిస్టులను మట్టు పెట్టడానికి పెట్టిన ఆపరేషన్ కగార్ ప్రారంభం నుండి మొదలైన ఈ కుట్ర దారుల కార్యాచరణ పార్టీ తగిన సమయంలో పరిశీలించకపోవడంతో విప్లవ శ్రేణులకు, ఆదివాసీలకు, విప్లవ పురోగమనానికి జరిగిన తీవ్రమైన నష్టానికి మావోయిస్టు పార్టీ పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తుందన్నారు. *పార్టీ సంపదను మనువాద పాసిస్ట్ రాజ్యం పాదాల వద్దకు చేర్చిన ఈ నమ్మకద్రోహాన్ని పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. పార్టీ సంపదను మనువాద ఫాసిస్టు రాజ్యం వాదాల వద్దకు చేర్చిన ఈ నమ్మకద్రోహాన్ని పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొన్నారు. నమ్మకద్రోహుల మాయమాటలు నమ్మి క్రమశిక్షణను కలిగిన కొంతమంది ఆదివాసి కామ్రేడ్స్ వారి వెంట వెళ్లడం దురదృష్టకరమన్నారు.
నమ్మకద్రోహుల ఉచ్చులో పడి కొనసాగకుండా, ఆదివాసి ప్రాంత ప్రజలకు నష్టం చేయకుండా జీవితాలను కొనసాగించాలని సూచించారు. ఆదివాసి ప్రాంతాలలో పెట్టుబడిదారులు గద్దల్లాగా వాలడానికి సిద్ధంగా ఉన్నారని గుర్తు చేశారు. అటవీ సంపదను కొల్లగొట్టడానికి అమిత్ షా, మోడీ పెట్టుబడిదారులకు ఎర్రతి వాచీలు పరిచి మోకరిల్లి స్వాగతం పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నీ కంట్లో మీ వేళ్ళతోనే పొడవడానికి వేణుగోపాలరావు, వాసుదేవరావు వంటి వాళ్లను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకోబోతున్నారని గుర్తు చేశారు. తరతరాలుగా అటవీ సంపదను కాపాడిన ముందు తరాల వారి త్యాగాలను కించపరచకుండా, అవమానపరచకుండా భవిష్యత్ తరాల కోసం సంపదను కాపాడుకుందాం అని వివరించారు.
ఇది చారిత్రక సత్యం
భారతదేశంలో దోపిడి, అసమానతలు, వివక్ష, ఆధిపత్యం కొనసాగినంత కాలం ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడతాయి ప్రజలారా.. భారతదేశంలో దోపిడీ, అసమానతలు, వివక్ష, ఆధిపత్యం కొనసాగినంత కాలం ఉద్యమాలు, పోరాటాలు ఉవ్వెత్తున ఎగిసి పడతాయని లేఖలో పేర్కొన్నారు. ఏ సిద్ధాంతాల తోటి సంబంధం లేకుండానే సమస్యల ప్రాతిపదికన పోరాటాలు ప్రారంభమవుతాయని, ఇది చారిత్రక సత్యమని, ఈ విధంగా పురుడు పోసుకుంటున్న పోరాటాలను సిద్ధాంతికరిస్తూ కాలమాన పరిస్థితులకు తగినట్టుగా వ్యూహ, ఎత్తుగడలను రూపొందిస్తూ దీర్ఘకాలిక ప్రజాబందాలో దోపిడిదారుల నుండి ఈ దేశ ప్రజలను విముక్తి చేయడానికి మావోయిస్టు పార్టీ అకౌంటిత దీక్షతో ముందుకు సాగుతుందని వివరించారు. అమరుల త్యాగాలను కించపరుస్తూ, హేళన చేస్తూ మనువాద పాసిస్ట్ పాలకుల అడుగులకు మడుగులోత్తుతూ విప్లవోద్యమ తాత్కాలిక నష్టానికి కారకులైన మల్లోసుల, తక్కల్లపల్లి ముఠాలకు శిక్ష తప్పదని అమరుల త్యాగాల సాక్షిగా శపధం చేస్తున్నామని తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ లేఖలో వెల్లడించారు.
Also Read: Diwali Movies: తుస్సుమన్న దీవాళి వెండితెర టపాసులు.. ఒక్కటంటే ఒక్కటి కూడా పేలలే!
