Janasena MLA Controversy: తిరుపతి జిల్లా నారా కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై వచ్చిన లైంగిక ఆరోపణల అంశం పొలిటికల్ టర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే. బాధిత మహిళను ప్రలోభపెట్టి కూటమి ప్రభుత్వంపై వైసీపీ (YSRCP) అసత్య ప్రచారానికి తెర లేపిందంటూ జనసేన (Janasena)తో పాటు టీడీపీ (TDP) శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ విమర్శలను ఖండిస్తూ బాధిత మహిళ మరో వీడియోను విడుదల చేశారు. తనను వైసీపీ వాళ్లు మాయ చేసి పెట్టి హానీట్రాప్ చేయించారన్న ఆరోపణలను కొట్టిపారేశారు.
‘వైసీపీతో ముడిపెట్టొద్దు’
తనకు జరిగిన అన్యాయాన్ని మాత్రమే బయటపెట్టినట్లు బాధిత మహిళ తాజా వీడియోలో పేర్కొన్నారు. తనను ఎవరూ ప్రలోభపెట్టలేదని.. వైసీపీకి ఈ అంశంతో సంబంధం లేదని తేల్చి చెప్పారు. తనకు వైసీపీకి ముడిపెడుతున్న వారంతా.. ఎమ్మెల్యే శ్రీధర్ గతంలో ఆ పార్టీ తరపున సర్పంచ్ గా గెలిచిన విషయాన్ని గుర్తుంచుకోవాలని బాధితురాలు సూచించారు. తనకు జరిగిన అన్యాయానికి.. పార్టీలకు సంబంధం లేదని తేల్చి చెప్పారు.
మరో వీడియో విడుదల చేసిన వీణ
వైసీపీ నేతలు ప్రలోభ పెట్టి నాతో హనీ ట్రాప్ చేయించారని కొందరు ఆరోపించడంలో వాస్తవం లేదు
నన్ను ఎవరూ ప్రలోభపెట్టలేదు
నాకు జరిగిన అన్యాయంపై నేను మాట్లాడాను
గతంలో వైసీపీ నుంచి సర్పంచ్ గా పనిచేసిన శ్రీధర్ ప్రస్తుతం జనసేన ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి పార్టీ… pic.twitter.com/q7W6fwpbrq
— BIG TV Breaking News (@bigtvtelugu) January 29, 2026
తాతంశెట్టి నాగేందర్‌కు సూటి ప్రశ్నలు
తనకు అన్యాయం చేసిన వ్యక్తి జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే కాబట్టే పదే పదే ఆ పార్టీ పేరు ప్రస్తావనకు తీసుకురావాల్సి వస్తోందని బాధితురాలు అన్నారు. మరోవైపు జనసేన నేత తాతంశెట్టి నాగేందర్ తనపై చేసిన ఆరోపణలకు సైతం ఆమె కౌంటర్ ఇచ్చారు. ‘2012 నుంచి నా బయోడేటా చూపించి తాతంశెట్టి నాగేందర్ నాపై ఆరోపణలు చేస్తున్నారు.ఎవరెవరో అబ్బాయిల పేర్లు చేప్పి మాట్లాడుతున్నారు. వాళ్లు ప్రైండ్సా.. బాయ్ ప్రైండ్సా.. ఎఫైర్సా నాగేందర్ క్లారిటీ ఇవ్వాలి.పేర్లు చేబితే.. ఊరుకోను.. అధారాలను చూపించాలి’అంటూ బాధిత మహిళ డిమాండ్ చేశారు.
జనసేన నేత తాతంశెట్టి నాగేందర్ ఆరోపణలకు వీణ కౌంటర్
2012 నుంచి నా బయోడేటా చూపించి ఆరోపణలు చేస్తున్నారు
ఎవరెవరో అబ్బాయిల పేర్లు చెప్పి మాట్లాడుతున్నారు
వాళ్లు నా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ లేదా ఎఫైర్స్ అన్నదానిపై నాగేందర్ క్లారిటీ ఇవ్వాలి
జస్ట్ పేర్లు చెబితే ఊరుకోను.. ఆధారాలు… pic.twitter.com/pj9PG6t83w
— BIG TV Breaking News (@bigtvtelugu) January 29, 2026
రూ.25 కోట్లు డిమాండ్‌పై క్లారిటీ
రూ.25 కోట్లు డిమాండ్ చేసినట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోకు తనకు ఎలాంటి సంబంధం లేదని బాధితురాలు తాజా వీడియోలో క్లారిటి ఇచ్చారు. ఆ వాయిస్ తనది కాదని స్పష్టం చేశారు. తానెవరితో మాట్లాడి రూ.25 కోట్లు అడిగానో ఫుల్ ఆడియో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తనను ధైర్యంగా ప్రశ్నిస్తున్న వారు.. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ను కూడా అదే విధంగా నిలదీయాలని డిమాండ్ చేశారు.
Also Read: KCR SIT Notice: గులాబీ నేతకు సిట్ నోటీసులు.. కాసేపట్లో కేసీఆర్‌తో కేటీఆర్, హరీశ్ అత్యవసర భేటి!
రంగంలోకి పోలీసులు..
మరోవైపు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తల్లి ప్రమీలమ్మ ఫిర్యాదుపై రైల్వే కోడూరు అర్బన్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రభుత్వ ఉద్యోగిని హర్ష వీణ తన కొడుకును బ్లాక్ మెయిల్ చేస్తోందని ఈనెల 7న ప్రమీలమ్మ ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి హర్ష వీణ కాల్ డేటా, ఇతర సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నట్లు రైల్వే కోడూరు సీఐ చంద్రశేఖర్ గురువారం తెలిపారు. ఎమ్మెల్యే పై ఆరోపణలు చేస్తున్న హర్ష వీణ ఇంకా పోలీసుల ముందుకు రాలేదని తెలిపారు. ఆమె స్థానికంగా లేనట్లు తెలుస్తోందని చెప్పారు. ఈ కేసులో ఎమ్మెల్యే స్టేట్మెంట్ కూడా రికార్డు చేస్తామన్నారు. హర్ష వీణ నేరుగా విచారణకు హాజరైనా.. లేకపోతే తమను రమ్మని పిలిచినా వెళ్లి విచారిస్తామని కోడూరు అర్బన్ సీఐ స్పష్టం చేశారు. మరోవైపు స్థానిక విలేకరి శంకర్ రాజుపై నిర్భందించి దాడి చేసిన ఘటనపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు సీఐ తెలిపారు.

