Bhu Bharati Act( image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Bhu Bharati Act: దేశంలోనే భూభారతి చట్టం.. అగ్రగామిగా నిలుస్తోంది!

Bhu Bharati Act: భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి చట్టం అగ్ర గ్రామిగా నిలుస్తోందని డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.  ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గం ములుగుమాడు గ్రామంలో భూభారతి ఫైలెట్ ప్రాజెక్టును డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ… గత ప్రభుత్వంలో టిఆర్ఎస్ నేతలు వారి అనుచరుల కోసం ధరణి చట్టాన్ని ప్రత్యేకంగా తీసుకొచ్చారని విమర్శించారు.

ధరణితో ఆరు కాలం కష్టించి ధాన్యాన్ని పండించే రైతుల భూములను భూస్వాములకు కట్టబెట్టారని ఆరోపించారు. పార్ట్ బి లోని భూములు అసైన్మెంట్ కమిటీలు వేసి అర్హులైన వారికి అప్పగిస్తామన్నారు. ఇక పైన అసైన్మెంట్ కమిటీలు వేసి ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామన్నారు. తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలకి భూభారతి శాశ్వత పరిష్కార మార్గం చూపుతుందని భరోసా కల్పించారు. ఇప్పటివరకు రైతులు తమ భూ సమస్యల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అలిసిపోయారని, ఇకపై అలా జరగదని భూభారతిలో అన్ని రకాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తోందన్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భూ సమస్యల పరిష్కారం కోసం వివిధ రాష్ట్రాల్లో పర్యటించి చరిత్రత్మక చట్టాన్ని మన ముందుకు తీసుకొచ్చేందుకు ప్రత్యేక కృషి చేశారని ప్రశంసించారు.

Also ReadTrain Accident: గొర్రెలకు మేత కోసం చెట్టుపైకి ఎక్కారు.. కొమ్మ విరగటంతో ట్రాక్​ పై పడ్డారు!

భూభారతి చట్టాన్ని రూపొందించిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి ఖమ్మం జిల్లా వాసి కావడం మనందరికీ గర్వకారణం అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తెచ్చిన మూడు భూ చట్టాలు కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే వచ్చాయని పేర్కొన్నారు. తద్వారా రాష్ట్ర ప్రజలకు, రైతులకు వారి భూమిపై భరోసా ఉండేదన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణి చట్టాన్ని తీసుకొచ్చి రైతుల హక్కుల్ని కాలరాశారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో భూములకు సమస్యలు వచ్చాయి అంటే అది కేవలం ధరణి చట్టంతోనే నని నొక్కి వక్కానించారు. టిఆర్ఎస్ నాయకులకు కావలసిన బడా వ్యక్తులకు రైతులు సైతం చేసుకుంటున్న భూములను కట్టబెట్టి తిరిగి సవరణ చేసుకునే అవకాశం లేకుండా ధరణిని రూపొందించారని ఆవేదన వ్యక్తం చేశారు.

10 ఎకరాల భూమి ఉంటే 17 ఎకరాలు పట్టా పాస్ బుక్కులు ఇచ్చి చిన్న సన్న కారు రైతులను అగాధంలోకి నెట్టివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. భూములు లేకుండానే రైతు భరోసా డబ్బులను కొల్లగొట్టేందుకు వందలాది ఎకరాల పట్టా లను తయారు చేయించి తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు చందే విధంగా రూపొందించడం దారుణం అన్నారు. భూ సంస్కరణల చట్టంలో భాగంగా రాష్ట్రంలో 26 లక్షల ఎకరాల భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు పంచి ఇచ్చిందని గుర్తు చేశారు. అలాంటి భూమిని ధరణి చెట్టు ద్వారా ఫార్టు బీలో చేర్చి సవరణలు చేయకుండా రూపొందించారని మండిపడ్డారు.

Also Read: Kodanda Reddy: సత్వర చర్యలు తీసుకోవాలని.. అధికారులకు కోదండరెడ్డి ఆదేశం!

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం.. ఈ ప్రభుత్వం రైతుల నుంచి లాక్కున్న భూములన్నింటినీ తిరిగి సేద్యం చేసుకుంటున్న రైతులకు అప్పగించే విధంగా కృషి చేస్తుందని వ్యాఖ్యానించారు. గత పది సంవత్సరాలపాటు అసైన్మెంట్ కమిటీలు లేకపోవడంతో అనేక రకాల భూ సమస్యలు ఉత్పన్నం అయ్యాయని వివరించారు. భూభారతి చట్టం ప్రజలు సాధించిన విజయంగా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉందన్నారు.

రైతుల భూమికి ఉన్న న్యాయబద్ధమైన హక్కులను కల్పించి వారికి అప్పగించేందుకు ప్రభుత్వం నడుం బిగించిందన్నారు. పైలెట్ ప్రాజెక్టు కింద సర్వే చేపడుతున్నామంటే ములుగు మాడు ఊరంతా కదలి రావడం ఆనందంగా ఉందని తెలిపారు. భూ భారతి చట్టం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి గొప్ప కీర్తి రాబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భూభారతి మనందరి చట్టమని దీన్ని ప్రతి ఒక్క రైతు అర్థం చేసుకొని అమాయక రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.

రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి మాట్లాడుతూ…
జూన్ కంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో విస్తృత వర్షాలు కురవడం కాంగ్రెస్ చేసే మంచి పనులకు దేవుడు సైతం అండ కల్పిస్తున్నట్లుగా అర్థమవుతుందన్నారు. ఈ వర్షాకాలం సీజన్లోనే రైతులకు రైతు భరోసా అందించే విధంగా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో కృషి చేస్తుందని వివరించారు. గ్రామాల్లో అత్యాధునిక టెక్నాలజీలతో గ్రామ రైతులకు సమగ్ర సర్వే చేయించి వారికి హక్కు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రజల ఆలోచనలనే ఆచరణలోకి తీసుకొని అమలు చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా అధికారులే గ్రామాల్లోకి వచ్చి రైతులకు ఉన్న భూ సమస్యలన్నింటిని పరిష్కరించడమే ధ్యేయంగా భూభారతి చట్టం పనిచేస్తుందన్నారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూభారతి చట్టంపై రైతులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. రాష్ట్రంలోని 413 రెవెన్యూ గ్రామాల్లో ఇప్పటివరకు ప్రత్యేక నక్షలు లేవన్నారు.

మనుషులకు ఆధార్ కార్డు ఉన్నట్లే రైతులకు భూదార్ కార్డులను కాంగ్రెస్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తుందని ఆకాంక్షించారు. ప్రతి మండలంలో గ్రామంలోనూ సైతం లైసెన్సుడ్ సర్వేయర్లను ప్రత్యేకంగా నియమించి భూములను సర్వే చేయించేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నామని వివరించారు. రెవిన్యూ అధికారి భూములకు ముఖ్య కాపలాదారుడుగా ఉండే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోందని వెల్లడించారు.

Also Read: Drug Peddlers Arrested: డ్రగ్స్ ముఠా అరెస్ట్​.. కోట్ల రూపాయల మాదక ద్రవ్యాలు సీజ్!

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ…
వర్షాకాలం సీజన్లోనే రైతులకు భరోసా అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక విప్లవాత్మకమైన, వినూత్నమైన భూభారతి చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాలు మారిన ఎన్ని చట్టాలు తెచ్చినా భూ సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. నేడు సీఎం రేవంత్ రెడ్డి చొరవతో భూభారతి చట్టాన్ని అమల్లోకి తేవడం రైతులకు వరం లాంటిది అన్నారు.

ప్రతి గ్రామంలో ప్రతి చిన్న సమస్యకు సైతం అత్యాధునికమైన టెక్నాలజీతో ఎంజాయ్ మెంట్ సర్వేలు చేయించి రైతులకు హక్కులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. భూభారతి చట్టంలో కీలక పాత్ర పోషించిన పొంగిలేటి శ్రీనివాసరెడ్డి రైతుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతారని అభినందించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఎన్నో తప్పిదాలు రైతులను వెంటాడకుండా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తూ రైతులకు పూర్తిస్థాయి హక్కులు, ఆధారాలు కల్పించేందుకు ప్రత్యేక కృషి చేస్తుందని వివరించారు.

Also Read: Narayana: నియంత పాలనతో.. కీర్తిని పోగొట్టుకున్న కేసీఆర్!

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు