Narayana: నియంత పాలనతో మాజీ సీఎం కేసీఆర్ తన కీర్తిని తానే పోగొట్టుకున్నారని సీపీఐ జాతీయకార్యదర్శి కె. నారాయణ అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రీయా శీలక పాత్ర పోషించడమే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందేనని ఒకే మాటపై నిలబడిన ఏకైక జాతీయ పార్టీ సీపీఐ మాత్రమే స్పష్టం చేశారు. మిగిలిన పార్టీలు ఇక్కడో మాటా అక్కడ మాట మాట్లాడాయన్నారు. హైదరాబాద్ లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూం భవన్ భవన్‌లో సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నారాయణ జాతీయ జెండాను ఎగురవేయగా, సయ్యద్ అజీజ్ పాషా అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన పేటెడ్ రైట్ మాత్రం మాజీ సీఎం కేసీఆర్ కే దక్కుతుందని, కాని ఆయన దానిని ఈ 10 ఏళ్ల కాలంలో నిలబెట్టుకోలేక పోయ్యారని తెలిపారు. రాష్ట్ర సాధన తర్వాత తెలంగాణ ప్రజలు ఏ ఉద్దేశంతో అయితే కెసిఆర్‌కు అధికారం అప్పగించారో దానిని పూర్తి చేయడంలో ఆయన పూర్తిగా విఫలం మయ్యారన్నారు. అంతేకాకుండా 10 ఏళ్ల పాటు ఆయన ప్రభుత్వాన్ని, పార్టీని పూర్తిగా అప్రజాస్వామిక పద్దుతుల్లో నియంతృత్వ పాలన కొనసాగించారని నారాయణ పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఫామ్ హౌజ్ కే పరిమితమై ప్రభుత్వాన్ని, పార్టీని నడిపిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనన్నారు.
Also Read: Raja Singh: రాజాసింగ్ పై చర్యలు.. జాతీయ పార్టీ నుంచి స్టేట్ యూనిట్ కు ఆదేశాలు!
దీంతో ఆయన సాధించిన కీర్తిని ఆయనే పొగొట్టుకున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆయన నియంత ధోరణే చివరికి వారి కుటుంబంలో కల్లోలం లేపేందుకు కారణమైందన్నారు. ఇదే క్రమంలో కేసీఆర్‌ను గద్దె దించి కాంగ్రెస్‌కు ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారని, ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన రేవంత్‌రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పాలనను ఓ గుణపాఠంగా తీసుకుని పరిపాలనకొనసాగించాలని సూచించారు. అధికారం చేపట్టే ముందుకు ప్రజలకు ఇచ్చిన హామీలను రేవంత్‌రెడ్డి పూర్తి చేయాలని ఇందుకు సీపీఐ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు.
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్ కె.శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి, ఈటి నరసింహా, బొమ్మగాని ప్రభాకర్, ఎన్.జ్యోతి, అంజయ్య నాయక్,కాంతయ్య, ఉజ్జని రత్నాకర్ రావు,తదితరులు పాల్గొన్నారు.
Also Read: Mahesh Kumar Goud: ఐయామ్ రెడీ హరీష్.. పీసీసీ చీఫ్ సంచలన కామెంట్స్!