Train Accident( image credit: Swetcha reporter)
క్రైమ్

Train Accident: గొర్రెలకు మేత కోసం చెట్టుపైకి ఎక్కారు.. కొమ్మ విరగటంతో ట్రాక్​ పై పడ్డారు!

Train Accident: గొర్రెల మేత కోసం చెట్టుపైకి ఎక్కిన అన్నదమ్ములు కొమ్మ విరిగి పోవటంతో ట్రాక్​ పై పడిపోగా దూసుకొచ్చిన రైలు వారి పైనుంచి వెళ్లటంతో అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఈ విషాదం  ఉదయం యాఖుత్ పురా రైల్వే స్టేషన్​ వద్ద జరిగింది. మరో నాలుగు రోజుల తరువాత బక్రీద్ పండుగను సంతోషంగా జరుపుకోవటానికి ఏర్పాట్లు చేసుకున్న తరుణంలో జరిగిన ప్రమాదం మృతుల కుటుంబంలో తీరని దుఃఖాన్ని మిగిల్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: GHMC R V Karnan: వివాదాస్పదం కానున్న.. ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్!

యాఖుత్ పురా సొంటే పీర్​ కీ దర్గా ప్రాంత నివాసులైన షాహబుద్దీన్​ (26), ఫైజాన్​ (21) అన్నదమ్ములు. ఈనెల 7న బక్రీద్ పండుగ ఉండటంతో సన్నాహాలు చేసుకుంటున్నారు. పండుగ ముందు రోజు కొంటే గొర్రెల ధర ఎక్కువగా ఉంటుందని రెండు రోజుల క్రితమే కొని పెట్టుకున్నారు. అప్పటి నుంచి యాఖుత్ పురా రైల్వే స్టేషన్​ వద్దకు వాటిని తీసుకొచ్చి మేత పెడుతున్నారు. ఎప్పటిలానే సోమవారం ఉదయం అన్నదమ్ములిద్దరు గొర్రెలతో రైల్వే స్టేషన్​ వద్దకు వచ్చారు.

ఓ చెట్టుపైకి ఎక్కి కొమ్మలు విరుస్తూ కింద ఉన్న గొర్రెలకు వేస్తున్నారు. అదే సమయంలో కొమ్మ విరిగి పోవటంతో ఇద్దరు ట్రాక్​ పై పడిపోయారు. అదే సమయంలో వేగంగా దూసుకొచ్చిన రైలు పైనుంచి వెళ్లటంతో షాహబుద్దీన్, ఫైజాన్​ లు ప్రమాద స్థలంలోనే మరణించారు. విషయం తెలిసి యాఖుత్ పురా ఎమ్మెల్యే జాఫర్​ హుస్సేన్​ మెరాజ్​ ఉస్మానియా ఆస్పత్రి మార్చురీ వద్దకు వచ్చి మృతుల కుటుంబాలను ఓదార్చారు.

Also Read: Drug Peddlers Arrested: డ్రగ్స్ ముఠా అరెస్ట్​.. కోట్ల రూపాయల మాదక ద్రవ్యాలు సీజ్!

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు