Kodanda Reddy( image credit: swetcha reporter)
తెలంగాణ

Kodanda Reddy: సత్వర చర్యలు తీసుకోవాలని.. అధికారులకు కోదండరెడ్డి ఆదేశం!

Kodanda Reddy: అధికారులకు రైతు కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ములుగు జిల్లాలో మొక్కజొన్న విత్తనాల ద్వారా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించడంపై జరుగుతున్న ఆలస్యంపై రైతు కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి జిల్లా అధికారులపై మండిపడ్డారు. హైదరాబాద్‌ నుంచి అధికారులతో జూమ్‌ మీటింగ్‌ నిర్వహించారు. మల్టినేషనల్‌ కంపెనీల వ్యవహారంపైకోదండరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. నష్టపరిహారం చెల్లించడంలో జరుగుతున్న ఆలస్యంపైనా ఆరా తీశారు. విత్తనోత్పత్తి ఘటనలో ఇప్పటి వరకు జరిగిన పురోగతిపై సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ టీ.ఎస్.దివాకర ఇప్పటి వరకు జరిగిన పురోగతిని చైర్మన్‌కు వివరించారు.

Also Read: Harish Rao: బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తే.. రెడ్ బుక్ లో పేర్లు నమోదు!

నష్టపరిహారం చెల్లించడంలో,లబ్ధిదారులను ఎంపిక చేయడంలో జరుగుతున్న ఆలస్యంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఒక కంపెనీ హైకోర్టుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారంతో ఆ కంపెనీ లీగల్ గా పోతే తీసుకోవాల్సిన చర్యలపైనా సమీక్షించారు. ఆలోపే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతు కమిషన్ మెంబర్ భూమి సునీల్ మాట్లాడుతూ రైతుకు నష్టం జరిగితే రాష్ట్రంలో కఠినమైన చట్టలు లేవన్నారు. కేవలం వినియోగదారుల ఫోరం, కోర్టుకు పోవడమే జరుగుతుందనిశిక్షలు తక్కువగా ఉన్నాయన్నారు.

రాష్ట్రంలో చట్ట సవరణ జరగాల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో అగ్రికల్చర్ డైరెక్టర్ గోపి, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ చిత్ర మిశ్రా, డైరెక్టర్ ఆఫ్ సీడ్స్ కేశవులు, రైతు కమిషన్ సలహాదారులు రామాంజనేయులు, దొంతి నర్సింహా రెడ్డి, ఎం.శ్రీనివాస్ రెడ్డిలతోపాటు అడ్వకేట్ రామచంద్ర రెడ్డి, కమిషన్ అధికారులు పాల్గొన్నారు.

Also Read: GHMC officials: గట్టిగా వాన పడితే ఆగమాగమే.. టెండర్ల రద్దుకు అసలు కారణాలు ఇవేనా?

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు