Harish Rao9 IMAGE CREDIT SWETCHA REPORTER)
Politics

Harish Rao: బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తే.. రెడ్ బుక్ లో పేర్లు నమోదు!

Harish Rao: రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే బీఆర్ఎస్ పోటీ చేస్తుందని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుస్పష్టం చేశారు. ఎవడో పొత్తు పెట్టుకుంటాం అన్నట్లు మాట్లాడుతున్నారు.. ఎవరితో పొత్తుపెట్టుకోమని స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వంద సీట్లతో బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుందని వెల్లడించారు. తెలంగాణ భవన్ లో సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఎమ్మెల్సీ మధుసూదనాచారి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ బీజేపీకి తెలంగాణ మీద హక్కు లేదని, 1996లో ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని మోసం చేశారని మండిపడ్డారు. చంద్రబాబుకు బయపడి బీజేపీ తెలంగాణ ఇవ్వేలేదన్నారు. 8 మంది ఎంపీలు గెలిపిస్తే నిధులు కేటాయించడంలో మొండి చేయి చూపిందన్నారు. పోలవరం జాతీయ హోదా ఇవ్వడమే కాక, గోదావరి బనకచర్ల లింకు అక్రమ ప్రాజెక్టుకు నిధులు ఇస్తున్నదన్నారు. బీజేపీ ఏం చేసిందని ప్రశ్నించారు.

Also Read: Raja Singh: రాజాసింగ్ పై చర్యలు.. జాతీయ పార్టీ నుంచి స్టేట్ యూనిట్ కు ఆదేశాలు!

తెలంగాణకు, మెడికల్ కాలేజీ లేదు, జాతీయ హోదా లేదన్నారు. గోదావరి బనకచర్ల మీద కిషన్ రెడ్డి, బండి సంజయ్ మాట్లాడడు, ఈటల రాజేందర్ మాట్లాడడుఅన్నారు. తెలంగాణకు బనకచర్ల ప్రాజెక్టు శాపం కాబోతున్నదన్నారు. అది నిర్మిస్తే గోదావరి జలాల్లో తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కృష్ణాలో మన వాటా వాడుకునే తెలివి లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయితే బనకచర్ల విషయంలో సుప్రీం కోర్టుకు వెళ్తాం, బనకచర్ల ప్రాజెక్టు ఆపుతాం అని స్పష్టం చేశారు. తెలంగాణపై ప్రేమ ఉంటే బనకచర్ల ప్రాజెక్టు ఆపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పథకాలకు పైసలు లేవు, అందాల పోటీలకు పైసలు ఎక్కడికెల్లి వచ్చాయని ప్రభుత్వాన్ని నిలదీశారు. బడా బడా కాంట్రాక్టర్లకు 12వేల కోట్ల బిల్లులు ఎట్లా ఇచ్చారని, యంగ్ ఇండియా పేరుతో ఒక స్కూల్ కు ముందు 80కోట్లు, తర్వాత 130 కోట్లు, ఇప్పుడు 200 కోట్లు అంటున్నారని, అదో 5,6వేల కోట్ల స్కాం అని ఆరోపించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ లేదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులపై డిప్యూటీ సీఎం భట్టి కి ప్రేమ లేదా? అని ప్రశ్నించారు. అక్రమ కేసులు పెట్టి సోషల్ మీడియా వారియర్స్ ను వేధిస్తున్నారని, ఎవరు ఎక్కువ చేస్తున్నారో, వారి పేర్లను రెడ్ బుక్ లో రాసి పెట్టండి అని కేడర్ కు సూచించారు. అతిగా వ్యవహరించే అధికారుల తీరును అన్ని గమనిస్తున్నామని, ఎక్కువగా చేసే అధికారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

సర్పంచుల నుంచి జడ్పీ చైర్మన్ల దాకా అందరిని ఏదో రకంగా బెదిరిస్తున్నారని, చిన్న కాంట్రాక్టర్లకు 1200 కోట్లు ఇవ్వలేదు, 12000 కోట్ల బడా కాంట్రాక్టర్లకు కట్ట బెట్టారని మండిపడ్డారు. ‘నీ దగ్గరగా ఉండే ఒక ఎంపీ, కార్పొరేషన్ చైర్మన్, ఐఏఎస్ అధికారి మిస్ ఇంగ్లాండ్ పట్ల అనుచితంగా వ్యవహరించారని వార్తలు వచ్చాయి.. నీకు చిత్తశుద్ది ఉంటే వీడియో బయట పెట్టు, వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయి’ అని సీఎంను డిమాండ్ చేశారు.

Also Read: Anudeep Durishetty: నిధులిచ్చాం పనులెందుకు చేయలే?.. అధికారులపై కలెక్టర్ అనుదీప్ ఫైర్!

రేవంత్ రెడ్డిని దించే ఆలోచన బీఆర్ఎస్ కు లేదన్నారు. రేవంత్ రెడ్డి ఎన్నటికీ తెలంగాణ ద్రోహియేనని, ఎందుకంటే నువ్వు ఎన్నడూ జై తెలంగాణ అనలేదు
ఉద్యమం చెయ్యలేదు అన్నారు. ఇప్పటికైనా బుద్ధి మార్చుకో. చరిత్ర హీనుడిగా మిగలకు, తెలంగాణకు ద్రోహం చేయకు అని అన్నారు. కృష్ణా నదిలో నీళ్లు ఆపకుండా గురువుకు దాసోహం అయ్యావని, ఇప్పుడు గోదావరి నీళ్లలోనూ అదే చేస్తున్నావు అని మండిపడ్డారు. అసెంబ్లీలో చర్చ పెట్టు, ఢిల్లీ పోదాం పదా.. ఢిల్లీలో ధర్నా పెట్టేందుకు మేం సిద్దం అని స్పష్టం చేశారు. నువ్వు పోరాటం చేయకుంటే మేం పోరాటం చేస్తాం.. తెలంగాణ కోసం ఏదైనా చేస్తాం.

అధికారం ముఖ్యం కాదు, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అని వెల్లడించారు. రేవంత్ వచ్చాక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పడిపోయింది, ఏ రంగం చూసినా అదే పరిస్థితి అని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు రేవంత్ కు ధైర్యం లేదు అన్నారు. వస్తే సిద్దంగా ఉండాలని కేడర్ కు పిలుపు నిచ్చారు. ప్రజలు కూడా కాంగ్రెస్ కు బుద్ధి చెప్పేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. త్యాగాలకు మారుపేరు కేసీఆర్ అన్నారు. నీ ఏడాది పాలనలో నువ్వు చేసిందేమిటి రేవంత్ రెడ్డి అని నిలదీశారు. ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చినవా, ఒక్క ప్రాజెక్టు కట్టినవా, ఒక్క చెక్ డ్యాం నిర్మించినవా, ఒక్క చెరువు తవ్వినవా అని ప్రశ్నించారు. రేవంత్ అబద్దాలకు హద్దు పద్దు ఉండటం లేదన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్ర ఆదాయం ఆకాశం వైపు చూస్తే, రేవంత్ పాలనలో నేల వైపు చూస్తున్నదని దుయ్యబట్టారు.

Also Read: Mahesh Kumar Goud: ఐయామ్ రెడీ హరీష్​.. పీసీసీ చీఫ్ సంచలన కామెంట్స్!

Just In

01

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?