GHMC officials( image credit: twitter)
హైదరాబాద్

GHMC officials: గట్టిగా వాన పడితే ఆగమాగమే.. టెండర్ల రద్దుకు అసలు కారణాలు ఇవేనా?

GHMC officials: ఇప్పటికే వర్షాకాలం మొదలైంది. పలుసార్లు వర్షం దంచి కొట్టింది. మున్ముందు మరింత భారీ వర్షాలున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నా, జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం బే ఫికర్ గా ఉన్నారు. వర్షాకాలం సహాయక చర్యల కోసం సుమారు రూ.50 కోట్ల తో ఎమర్జెన్సీ మాన్సూన్ టీమ్ లు, వాహానాలను సమకూర్చేందుకు చేపట్టిన టెండర్ల ప్రక్రియ ఏకపక్షంగా, కొందరు కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చేలా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో సర్కారు జోక్యం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

జీహెచ్ఎంసీ అధికారులు ఇష్టారాజ్యంగా, నిబంధనలకు విరుద్దంగా చేపట్టిన టెండర్ల ప్రక్రియను రద్దు చేయాలంటూ సర్కారు ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో స్పందించిన కమిషనర్ ఆ టెండర్ల ప్రక్రియను రద్దు చేసి , మళ్లీ ప్రెష్ గా టెండర్ల ప్రక్రియ చేపట్టాలని ఆదేశించినట్లు తెలిసింది. మరో వైపు రానున్న మూడు రోజుల పాటు హైదరాబాద్ మహానగరంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో 159, మరో 155 ఎమర్జెన్సీ టీమ్ లు, స్టాటిక్ లేబర్ టీమ్ లతో పాటు సహాయక చర్యల కోసం 164 వాహానాలను సమకూర్చుకోవాల్సి ఉండగా, టెండర్లు రద్దయి, వర్షకాలం సహాయక చర్యలు చేపట్టే ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చినట్టయింది.

Also Read: KCR: కాళేశ్వరం విచారణకు సమయం కోరిన కేసీఆర్.. పెద్ద ప్లానే ఉందే!

దీంతో గట్టిగా వాన పడితే మళ్లీ కష్టాలు తప్పవా? అంటూ నగరవాసుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రతి సంవత్సరం ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాల ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. అధికారుల అలత్వం, అవినీతి కారణంగా ప్రస్తుతం ఎమర్జెన్సీ టీమ్ లు, హహనాల్లేకపోవటంతో ఇప్పటికపుడు వర్షం దంచి కొడితే కాంట్రాక్టర్లను బ్రతిమాలి సహాయక చర్యలు చేపట్టేందుకు అధికారులు, ఇంజనీర్లు సిద్దమైనట్లు సమాచారం.

టెండర్ల రద్దుకు అసలు కారణాలు ఇవేనా?
వర్షాకాలం సహాయక చర్యల పేరిట బల్దియా ఖజనానాకు కన్నం వేయాలన్న కొందరు అధికారులు, ఇంజనీర్ల కుట్ర విఫలమైంది. సహయక చర్యల కోసం వినియోగించే వాహానాల్లో కేవలం ఇసుజు వాహానాలను మాత్రమే వినియోగించాలన్న నిబంధన పెట్టడం, ప్రతి సంవత్సరం వర్షాకాలంలో సహాయక చర్యల కోసం వినియోగించే వాహానానికి నెలకు రూ. 30 వేలు చొప్పున చెల్లిస్తుండగా, ఈ సారి ఇసుజు వాహానాలను వినియోగించాలని, ఒక్కో వాహానానికి నెలకు రూ.63వేల అద్దెను నిర్ణయించటంతో పాటు నాలుగు నెలల వర్షకాలానికి ఏకంగా ఏడాది పొడువున వాహానాల ఎంగేజ్ చేసేందుకు అధికారులు ఇష్టారాజ్యంగా నిబంధనలను మార్చుతూ దోపిడీకి చేసిన యత్నం బట్టబయలు కావటం, సర్కారు జోక్యం చేసుకోవటమే టెండర్ల రద్దుకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. మరో సారి చేపట్టనున్న టెండర్ల ప్రక్రియనైనా పారదర్శకంగా జరుగుతుందా? అన్న అనుమానాలు సైతం లేకపోలేవు.

పూడికతీత పనుల్లోనూ నిర్లక్ష్యం, అవినీతి
వర్షాకాలానికి ముందే జీహెచ్ఎంసీ పరిధిలో ప్రవహించే 380 కి.మీ.ల పొడువున్న మేజర్ నాలాలు, మరో 600 కి.మీ,ల పై చిలుకు పొడువున ప్రవహించే చిన్న, మధ్య తరహా నాలాల్లోని పూడికతతీత పనులను సకాలంలో పూర్తి చేయటంలోనూ జీహెచ్ఎంసీ విఫలమైంది. కిర్లోస్కర్ కమిటీ సిఫార్సుల ప్రకారం వర్షాకాలానికి ముందే నాలా పూడికతీత పనులను పూర్తి చేయాల్సి ఉండగా, ఇప్పటికే వర్షాలు మొదలైనా అధికారులు కేవలం 70 శాతం మాత్రనే నాలా పూడికతీత పనులను చేనట్టినట్లు సమాచారం. ఈ పనుల్లో అడుగడుగునా అధికారుల అలసత్వంతో వ్యవహారిస్తూ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. కోట్లాది రూపాయలు వెచ్చించినా, సకాలంలో నాలాల్లోని పూడికతీత పనులు పూర్తి కాకపోవటంతో ఈ సారి మళ్లీ వరద ముప్పు తప్పేట్టు లేదన్న భాయందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: Drug Peddlers Arrested: డ్రగ్స్ ముఠా అరెస్ట్​.. కోట్ల రూపాయల మాదక ద్రవ్యాలు సీజ్!

రూ. 55 కోట్లతో చేపట్టిన 327 నాలా పూడికతీత పనులు మే మాసం చివ‌రి నాటికి పూర్తి కావాల్సి ఉన్నా, ఇప్పటి వరకు పూర్తి చేయకపోవటంతో ఈ పనులపై కమిషనర్, ఇంజనీర్ల చిత్తశుద్ధి ఏ పాటిదో అంఛనా వేసుకోవచ్చు. 70 శాతం పూడికతీత పనులు పూర్తి చేశామని అధికారులు చెప్పుకుంటున్నా, బల్కాపూర్ వంటి మేజర్ నాలాల్లో ఇప్పటి వరకు సుమారు పది నుంచి 15 ఫీట్ల ఎత్తు వరకు పూడికతో దర్శనమిస్తుంది. ఇంకా వంద‌లాది కిలోమీట‌ర్ల పొడువున నాలాల్లో, వ‌ర‌ద నీటి కాలువ‌ల్లో పూడిక‌ పేరుకుపోయి ఉండటం కన్పిస్తుంది. ఇంజనీర్లు, కాంట్రాక్టర్లకు కుమ్మక్కై చేయని పనులకు కూడా బిల్లులు క్లెయిమ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. గంట వ్యవధిలోనే రెండు సెంటీ మీట‌ర్ల వ‌ర్షం ప‌డితే మాత్రమే తట్టుకోగలిగే సామర్థ్య మున్న వరద నీటి కాలువల వ్యసస్థలున్న నగరంలో వర్షం దంచి కొడితే ,తట్టుకోక పొంగి ప్రవహించనున్నాయి.

నాలాల్లో పూడిక, వ్యర్థాలను తొల‌గించ‌డంతో పాటు పూడిక, మ‌ట్టిని స‌మీపంలోని డంపింగ్ యార్డుకు త‌ర‌లించే బాధ్యత కూడా కాంట్రాక్టర్లే చేప‌ట్టాల్సి ఉంటుంది. కాని ఇప్పటి వరకు బ‌ల్దియా ప‌రిధిలో మొత్తంగా మూడు లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక తీసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే మొత్తం పూడిక 5 ల‌క్షల 42వేల 239 క్యూబిక్ మీటర్లు ఉంటుందని అంచనా వేశారు. ఇప్పటి వరకు అన్ని నాలాల్లో కలిపి మొత్తంగా 70 శాతం పూడిక ను మాత్రమే తొలగించిన జీహెచ్ఎంసీ మరో 30 శాతం పూడిక తొలగించాల్సి ఉంది. మిగిలిపోయిన 30 శాతం పూడిక కూడా తొలగించినట్లు బిల్లులు క్లెయిమ్ చేసేందుకు కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

Also Read: Raja Singh Threat: ఎమ్మెల్యే రాజాసింగ్‌ ప్రాణాలకు ముప్పు.. వరుసగా బెదిరింపు కాల్స్!

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు