Raja Singh Threat: బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోమారు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ విషయాన్ని ప్రత్యేక వీడియో సందేశం ద్వారా రాజా సింగ్ తెలియజేశారు. ప్రతిసారిలాగా ఈసారి కూడా బెదిరించే వాళ్లు యాక్టీవ్ అయ్యారని ఆయన అన్నారు. గోసంరక్షణ గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ నెంబర్లు తీసుకొని బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. చాలా మంది హిందూ నేతలతో పాటు తనకి కూడా గత కొంతకాలంగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని స్పష్టం చేశారు.
పోలీసులకు ఫిర్యాదు
వివిధ నెంబర్ల నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని రాజా సింగ్ తెలిపారు. అందులో విదేశీ నెంబర్లు సైతం ఉన్నట్లు పేర్కొన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని అన్నారు. సదరు నెంబర్లను మీడియాకు సైతం విడుదల చేశారు. అయితే తాను ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా వారు యాక్షన్ తీసుకోవడం లేదని ఆసహనం వ్యక్తం చేశారు. ఇతర దేశాల నుంచి వచ్చే కాల్స్ పైన తాము ఎలాంటి యాక్షన్ తీసుకోలేమని పోలీసులు అంటున్నారని చెప్పారు. వారి కాల్స్ ను ట్రేస్ చేసి పట్టుకునేంత టెక్నాలజీ తమ వద్ద లేదని పోలీసులు చెబుతున్నట్లు వివరించారు. తనను ఫోన్లో బెదిరించేవారు దమ్ముంటే ఎదురొచ్చి కొట్లాడాలని రాజా సింగ్ సవాలు విసిరారు. ధర్మం చండానికైనా.. చావడానికైనా తమ కుటుంబం సిద్ధమని రాజాసింగ్ అన్నారు.
రాజా సింగ్ కు నోటీసులు
మరోవైపు గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆయన ప్రాణాలకు హాని ఉందని.. కాస్త జాగ్రత్తగా ఉండాలని మంగళహాట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. భద్రతా కారణాల రిత్యా ఒంటరిగా తిరగవద్దని సూచించారు. బయటకు వెళ్తే బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోనే వెళ్లాలని హితవు పలికారు. ప్రభుత్వం కల్పించిన భద్రతా సిబ్బందిని ఉపయోగించుకోవాలని నోటీసుల్లో సూచించారు. జాగ్రత్త చర్యలు పాటించకుంటే మీ ప్రాణాలకే ముప్పు అని హెచ్చరించారు.
Also Read: Madhu Yashki On Kavitha: జాగృతిలో భారీ స్కామ్.. రూ.800 కోట్లు హాంఫట్.. కవితపై ఆరోపణలు!
బెదిరింపు కాల్స్ కారణమిదేనా!
ఈనెల 6న బక్రీద్ పండు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆ రోజున ఒక్క ఆవు, ఎద్దు, దూడను కోసినా ఊరుకునేది లేదని ఎమ్మెల్యే రాజా సింగ్ హెచ్చరించారు. బక్రీదును ఎలా జరుపుకుంటారో తనకు అనవసరమని.. కానీ ఆవుల జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు గోవద జరగకుండా చూడాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి సైతం చేశారు. ఈ క్రమంలోనే ఆయనకు బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Also Read This: Virat Kohli: కోహ్లీకి ఊహించని షాక్.. పోలీస్ కేసు నమోదు.. మ్యాటర్ ఏంటంటే!