Adwait Kumar Singh (image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Adwait Kumar Singh: రోగులకు మెరుగైన వైద్యం అందించాలి.. జిల్లా కలెక్టర్ అద్వైత్ సింగ్ కీలక అదేశాలు

Adwait Kumar Singh: విద్య, వైద్యంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్(Adwait Kumar Singh) అన్నారు. జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ బయ్యారం మండలం నామాలపాడు లోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ పాటశాల యందు విద్యార్థుల కిచెన్ హాల్, డైనింగ్ హాల్, మ్యూజిక్ గది,తరగతి గదులను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడి బోధనాంశాల పై వారి యొక్క సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా ఉపాద్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే పద్దతిలో విద్య బోదించాలని, షెడ్యుల్ ప్రకారం సిలబస్ ను పూర్తి చేసి పాఠ్యాంశాలపై, విద్యార్థుల యొక్క సామర్థ్యాలను తెలుసుకోవాలని, విద్యార్ధుల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలని అన్నారు. మెనూ ప్రకారం పరిశుభ్రమమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని అన్నారు. పాటశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. 

 Also Read: Diwali 2025: దీపావళిపై కాలిఫోర్నియా సంచలన నిర్ణయం.. గాల్లో తేలిపోతున్న భారతీయులు!

రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలి

అనంతరం మహబూబాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని జనరల్ మేల్, ఫిమేల్ వార్డులను, పిల్లల వార్డులను తనిఖీ చేసి అక్కడి పేషెంట్ల యొక్క వివరాలను, వారికి అందుతున్న వైద్యసేవలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి ఆవరణ పరిశుభ్రంగా ఉండాలని, ఆసుపత్రి కు వచ్చే రోగులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా వైద్యానికి సంబందించిన అన్ని సదుపాయాలని కల్పించాలని అన్నారు. సీజనల్ వ్యాదులకు సంబందించిన మందులను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు రోగులకు నాణ్యమైన వైద్యాన్ని అందించి ప్రజల నుంచి మంచి మన్ననలు పొందాలని సూచించారు. ఈ తనిఖీల్లో కలెక్టర్ వెంట ఈ.ఎం.ఆర్.ఎస్ ప్రిన్సిపాల్, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆర్.ఎం.ఓ జగదీశ్వర్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

 Also Read: Nilakhi Patra: సొంత బండి లేదు ఆడపిల్లకి.. ఆ ఒక్క డైలాగ్ తో హీరోయిన్ అదరగొట్టేసిందిగా..!

Just In

01

Pawan Kalyan thanks: వారికి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్.. ప్రత్యేకించి అభిమానులకు అయితే..

OG Concert: ‘ఓజీ’ సినిమాలో హీరో తాను కాదంటూ బాంబ్ పేల్చిన పవన్.. ఇంతకూ వారు ఎవరంటే?

Ind Vs Pak: కీలక క్యాచ్‌లు నేలపాలు.. టీమిండియా ముందు భారీ టార్గెట్

BRS women wing: బీఆర్ఎస్ మహిళా విభాగ అధ్యక్షురాలి పదవి ఎవరికి?

OTT movie review: పేరెంట్స్ అలా చేయడంతో దానికి రెడీ అయిన స్టూడెంట్.. ఏం చేసిందంటే?