Nilakhi Patra: ” సొంతిల్లు లేదు ఆడ పిల్లకి ” అనే ఒక్క డైలాగ్ తో ఫేమస్ అయింది కడలి సత్యనారాయణ. ఆమె చెప్పిన దానిలో వాస్తవం ఉందని కొందరు, మరి కొందరు ఆమె కావాలనే అలా మాట్లాడిందని మండి పడుతున్నారు. ఇక ట్రోలర్స్ అయితే ఆ మాటలను విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఓపెన్ చేసిన ఈ వీడియోనే ముందు కనిపిస్తుంది. ఇక ప్రతి ఒక్కరూ ఈ డైలాగ్ ను విచ్చల విడిగా వాడేస్తున్నారు. సోషల్ మీడియాను వాడే రీతిలో వాడితే ఎన్నో అద్భుతాలు చేయోచ్చు. కానీ, పనికి రాని వాటికీ కూడా వాడి సమస్యలను కోరి కొని తెచ్చుకుంటున్నారు.
Also Read: HCA Fund Misuse: హైకోర్టు ఉత్తర్వులు లెక్కచేయని జగన్ మోహన్ రావు.. వెలుగులోకి మరో సంచలనం..?
చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు వారి డైలీ లైఫ్ లో జరిగే వాటితో లింక్ పెట్టి మాకు ” సొంత మొగుడు లేదు.. సొంత పెళ్ళాం లేదు.. సొంత కారు కారు లేదు ” అంటూ ఇలా ఎవరిష్టం మొచ్చినట్లు వాళ్ళు వాడేస్తున్నారు. ఇక తాజాగా ఓ హీరోయిన్ కూడా ఇదే డైలాగ్ చెప్పడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
బ్యూటీ సినిమాలో హీరోయిన్ మైక్ తీసుకుని ” సొంత బండి లేదు తెలుసా ఆడ పిల్లకి.. సొంత బండి ఉండదు ఇప్పుడే ఆడ పిల్లకి, అయితే నాన్న బండి ఉంటుంది.. లేకపోతే బాయ్ ఫ్రెండ్ బండి ఉంటుంది. సొంత బండి ఎక్కడ ఉంది ఆడ పిల్లకి, నా బండి అనుకునే నేను డ్రైవ్ చేసే స్వేచ్ఛ ఉందా? లేదు కదా.. అది మా నాన్న బండి.. నాది ఎట్లా అవుతుంది.. నేను పెళ్లి చేసుకుంటే అది మా ఆయన బండి.. వాళ్ళ ఫ్యామిలీ.. మీరు చెప్పండి.. నా బండి ఎక్కడ ఉంది ” అనే డైలాగ్ చెప్పి అక్కడున్న వారందర్ని సర్ప్రైజ్ చేసింది.