Flight and Train Accidents: అవును.. టైటిల్ చూడగానే కాస్త విచిత్రంగా అనిపించింది కదూ? మీరు వింటున్నది నిజమేనండోయ్.. దేశ చరిత్రలోనే తీవ్ర విషాదంగా మిగిలిపోయిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash) తర్వాత ఎవరి నోట విన్నా.. ఎక్కడ చూసినా ఇదే టాపిక్ నడుస్తోంది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw), పౌర విమానయాన మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు (Kinjarapu Ram Mohan Naidu) రాజీనామా చేస్తారా? చేయరా? నెటిజన్లు, విమర్శకుల నుంచి వస్తున్న ప్రశ్నలు. ఎందుకంటే.. ఈ ఇద్దరూ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినప్పట్నుంచి ఇప్పటి వరకూ జరిగిన ప్రమాదాలు ఒకటి కాదు రెండు కాదు లెక్కలేనన్ని ఉన్నాయన్నది విమర్శకుల వాదన. అంతేకాదు.. అశ్విని వైష్ణవ్ రెండో దఫా రైల్వేశాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఆయన తప్పిదాల వల్లే, శాఖను నిర్వీర్యం చేశారని వచ్చిన ఆరోపణలు, విమర్శలకు లెక్కే లేదు. అయినా సరే ఆయన్ను మళ్లీ మంత్రిగా కంటిన్యూ చేయడం, అందులోనూ రైల్వేశాఖ కేటాయించడం పట్ల పౌరులు పెద్ద ఎత్తునే మండిపడ్డారు కూడా. ఇప్పుడు కాసేపు ఆయన్ను అటుంచితే రామ్మోహన్ పైన నెటిజన్లు పడ్డారు. అసలు ఈయనకు ఏం అనుభవం ఉందని, ఇంత కీలకమైన పౌర విమానయాన శాఖ కేటాయించారు? మంత్రి అయ్యి ఏడాది అయ్యింది కదా? ఆయన చేసిన ఒక్క సంస్కరణ చెప్పండి? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడీ ఇద్దరి గురించే ఎక్స్ వేదికగా పెద్ద ఎత్తునే చర్చ జరుగుతోంది.
Read Also- Chandrababu: ఇంతవరకూ మంచితనమే చూశారు.. చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్
వరస్ట్ మినిస్టర్స్..?
‘మనకు ఇద్దరు వరస్ట్ మినిస్టర్లు ఉన్నారు.. ఇదిగో వాళ్లే ఈ ఇద్దరు’ అంటూ అశ్విని వైష్ణవ్, రామ్మోహన్ నాయుడు ఫొటోలు పెట్టి నెటిజన్లు కొందరు గట్టిగానే హడావుడి చేస్తున్నారు. దీనికి కామెంట్స్ రూపంలో స్పందిస్తున్న జనాలు, విమర్శకులు ఓ రేంజిలో ఆటాడుకుంటున్నారు. అవును.. ‘ఈ ఇద్దరూ తప్పకుండా రాజీనామా (Resignation) చేయాల్సిందే.. ప్రధాని మోదీ దగ్గరుండి చేయించాల్సిందే’ అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇంకొందరేమో మొదటి వ్యక్తితో పోలిస్తే.. రెండో వ్యక్తి వరస్ట్‌కు మించి అని విమర్శిస్తున్న వాళ్లూ లేకపోలేదు. ఇంకొందరేమో.. ఓరి బాబోయ్ ఆపండ్రా వాళ్లు ఆయా శాఖలకు మంత్రులు అయినంత మాత్రాన.. అశ్విని వైష్ణవ్ రైలును, రామ్మోహన్ ఫ్లైట్‌ను నడపరు కదా? ఆ మాత్రం మినిమమ్ సెన్స్ లేకుండా మాట్లాడటం ఏమిటి? కాస్తయినా బుద్ధి, జ్ఞానం లేకుండా ట్వీట్లు చేస్తున్నారేంటి? అని స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చి పడేస్తున్నారు. మరికొందరేమో.. అరే బాబూ ఈ ట్వీట్ చేశావంటే పక్కాగా తమరు వైసీపీకి చెందిన కార్యకర్తవే అని అర్థమైందిలే కానీ.. ఇక నోరు మూసుకొని డెలీట్ చేయమని సలహాలు ఇస్తున్నారు. అవును.. మరి ఇన్ని సంఘటనలు జరిగిన తర్వాత నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిందేనంటూ పట్టుబడుతున్న వాళ్లూ లేకపోలేదు. ఇలా ఎవరికి తోచినట్లుగా వాళ్లు కామెంట్స్ చేసేస్తున్నారు.. కౌంటర్లు కూడా అంతే రీతిలో ఉంటున్నాయ్. అయినా ఇప్పుడు సోషల్ మీడియాలో అడ్డూ అదుపు అనేది లేకుండా పోతోంది. బూతులు మాట్లాడినా సరే దానికి సెన్సార్ అనేది లేదు. దీంతో ఇలాంటి విషయాల్లో పనిగట్టుకుని మరీ కొందరు విర్రవీగిపోతున్నారు.
Read Also- Plane Crash: పాపం.. పెళ్లైన 5 నెలలకే.. తీవ్ర విషాదం
విమాన ప్రమాదాలు ఎన్నో..?
కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన కొన్ని విమాన ప్రమాదాలు (Flight Accident) వివరాలు ఇప్పుడు చూద్దాం. ఏప్రిల్ 12, 2015 ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రమాదం (కేరళ, కోజీకోడ్) జరిగింది. రన్‌వే ఓవర్ రన్‌కు కారణమై రెండు విభాగాలుగా విరిగిపోయింది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రయాణికులు మరణించగా, 123 మంది గాయపడ్డారు. ఆగస్ట్ 7, 2020లో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రమాదం (కర్ణాటక, కళ్లెకుంటె)లో జరిగింది. దుబాయ్ నుంచి కోజికోడ్‌కు వెళ్తున్న ఫ్లైట్ IX-1344 (బోయింగ్ 737), వాయు సమస్యల కారణంగా మళ్లించి మంగళూరు సమీపంలో అత్యవసర ల్యాండింగ్ ఆప్ట్ చేసింది. విమానం రన్‌వే నుంచి స్లిప్ అయ్యి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 18 మంది మరణించారు. ఏప్రిల్ 2, 2025 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జాగ్వార్ జెట్.. శిక్షణా మిషన్ సమయంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. మే నెల చివరిలో ఢిల్లీలో కురిసిన కుండపోత వర్షం, బలమైన గాలుల వల్ల విమానాశ్రయం టర్మినల్ 1లోని పైకప్పు ఛత్రం కుప్పకూలిపోయింది. అప్పట్లో ఇదో పెద్ద బర్నింగ్ పాయింట్ అయ్యింది. జూన్ 12, 2025న ఎయిర్ ఇండియా డ్రీమ్‌లైనర్ ప్రమాదం (గుజరాత్, అహ్మదాబాద్) జరిగింది. అహ్మదాబాద్ నుంచి లండన్ గత్విక్‌కు వెళ్తుండగా కొద్దిసేపటికే క్రాష్ అయ్యింది. విమానంలో 232 ప్రయాణికులు,10 మంది సిబ్బంది ఉన్నారు. బీజే మెడికల్ కాలేజీపైన పడటంతో 20 మందికి పైగా మెడికోలు మృతిచెందినట్లుగా తెలుస్తున్నది. అయితే ప్రయాణికుల్లో ఎంతమంది చనిపోయారన్న విషయం మాత్రం ఇంతవరకూ అధికారికంగా ప్రకటించలేదు. ఇదిలా ఉంటే ప్రమాదంలో ఏ ఒక్కరూ బతికి బయటపడే పరిస్థితి మాత్రం లేదని విశ్లేషణలు వస్తున్నాయి.
Read Also- Plane Crash: విమాన ప్రమాదం బాధాకరం.. టాలీవుడ్ నటుల స్పందనిదే!
రైలు ప్రమాదాలు ఇలా..!
2024లో జనవరి నుంచి జులై వరకూ 7 నెలల కాలంలో దేశంలో ఏకంగా 19 రైలు ప్రమాద ఘటనలు (Train Accidents) జరిగాయి. ఒక్క జూలైలోనే నాలుగు రైళ్లు పట్టాలు తప్పడం, వరుసగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నప్పటికీ కేంద్రంలోని మోదీ సర్కారు నిర్లక్ష్య వైఖరిని వీడట్లేదనే విమర్శలు వెల్లువెత్తుతాయి. ఇలా భారీ ప్రమాదాలే 2024లో, అంతకుముందు ఇదే అశ్వినీ వైష్ణవ్ మంత్రిగా ఉండగా జరిగాయి. 2023లో జూన్ 2న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆగివున్న గూడ్స్ రైలును ఢీకొట్టి పట్టాలు తప్పింది. ట్రాక్‌పై పడిన ఈ రైలు బోగీలను యశ్వంత్‌పూర్- హౌరా ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో వెయ్యిమందికి పైగా ప్రయాణికులు గాయపడగా.. 275 మంది మృతి చెందారు. ఇదే ఆ ఏడాది అతి పెద్ద ప్రమాదం. జనవరి 22, 2025లో జలగావ్ రైలు ప్రమాదం జరిగింది. లక్నో నుంచి ముంబై వెళ్తున్న 12533 పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం జరిగిందనే పుకారు వ్యాపించింది. దీంతో భయాందోళన చెందిన ప్రయాణికులు అత్యవసర చైన్ లాగి, రైలు నుంచి దూకేశారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో 13 మంది మరణించగా, 15 మందికి పైగా గాయపడ్డారు. ఫిబ్రవరి 22, 2025న ఒడిశాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. 11 బోగీలు పట్టాలు తప్పాయి కానీ, ప్రాణ నష్టం మాత్రం జరగలేదు. మార్చి 30, 2025న జార్ఖండ్‌లో రెండు గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లోకో పైలెట్లు సహా ముగ్గురు మరణించారు. ఏప్రిల్ 1, 2025న ముంబై లోకల్ ట్రైన్ ప్రమాదానికి గురైంది. ఓవర్ క్రౌడ్ కారణంగా ఈ ఘటన జరిగింది. ఈ సంఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. ఏప్రిల్ 12, 2025న తెలంగాణలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఐరన్ ఓర్ రవాణా చేస్తున్న గూడ్స్ రైలుకు చెందిన 11 వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించలేదు. ఇలా ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ చిన్న చిన్న ప్రమాదాలు మొదలుకుని ఊహించని భారీ ప్రమాదాల వరకూ చాలానే ఉన్నాయి. అందుకే 2022 నుంచే అశ్విని వైష్ణవ్ అప్పట్లో జరిగిన ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలనే డిమాండ్ ఉన్నది. నాటి నుంచి నేటి వరకూ అదే కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రమాదాలు కూడా ఏ మాత్రం అస్సలు ఆగట్లేదు.
Read Also- Thalliki Vandanam: తల్లికి వందనం పథకంలో రూ.2వేలు ఎగనామం.. ఎందుకనీ?
2 worst ministers we have pic.twitter.com/uqi15qyhM2
— Batting Baba 🤘🇮🇳 (@bloodcobalt) June 12, 2025