Chandrababu: ‘ ఇప్పటి వరకు నా మంచితనం మాత్రమే చూశారు. తోక తిప్పితే ఎవ్వరిని ఉపేక్షించే ప్రసక్తే లేదు’ అని సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వానికి సరిగ్గా ఇవాళ్టికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా.. ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్‌తో (Nara Lokesh) కలిసి బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లికి వందనంతో పాటు వైసీపీ ఇటీవల చేస్తున్న కార్యక్రమాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని తిరిగి పుంజుకునేలా చేస్తున్నామని.. అభివృద్ధి, సంక్షేమం కూటమికి రెండు కళ్లు అని బాబు వెల్లడించారు. తల్లికి వందనం పథకానికి సంబంధించిన జీవోలను లోకేష్‌కు ముఖ్యమంత్రి అందజేశారు. వైసీపీపై (YSRCP) చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ అమరావతి (Amaravati) మహిళల గురించి అలా ఎలా మాట్లాడుతారు? మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా? తల్లి లేరా? భార్య లేరా? పవిత్రమైన రాజధానిపై అనుచిత వ్యాఖ్యలు దారుణం. ఈ ఇష్యూను డైవర్ట్ చేయడానికే వైఎస్ జగన్ (YS Jagan) పొదిలి వెళ్లారు. పొగాకుకు రూ.12 వేల ఎవరిచ్చారు? ఎప్పుడైనా పొగాకు రైతులకు మేలు చేశారా? గంజాయి బ్యాచ్‌ను పరామర్శించడం సిగ్గుచేటు. తెనాలి రౌడీ షీటర్ దగ్గరకు వెళ్తారా? ఎన్ని గుండెలు ఉండాలి. ఇప్పటివరకు నా మంచితనాన్ని మాత్రమే చూశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకోం’ అని చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
Read Also- Tollywood: పవన్ కళ్యాణ్ లేఖ పని చేస్తోంది.. ఏపీ సీఎం చెంతకు సినీ ఇండస్ట్రీ!
నా జీవితంలో ఎప్పుడూ..
‘ అన్నదాత సుఖీభవ (Annadata Sukhibhava) కింద ఏడాదికి రూ.14వేలు ఇస్తాం. గత ప్రభుత్వం కంటే ఒక్కొక్కరికీ రూ.6,500 అదనంగా అందజేస్తాం. మత్స్యకార భరోసా కింద రూ.150కోట్లు అదనంగా ఇచ్చాం. గతపాలనలో పెన్షన్లకు ఏడాదికి రూ.21వేల కోట్లు ఇస్తే.. మేం ఈ ఏడాది పెన్షన్లకు రూ.34వేల కోట్లు ఇచ్చాం. గత ప్రభుత్వం కంటే మేమే ఎక్కువ ఇస్తున్నాం. 20 లక్షల మందికి ఉపాధి కల్పనే మా లక్ష్యం. స్కిల్ డెవలప్మెంట్, నిరుద్యోగ భృతిపై అధ్యయనం చేస్తున్నాం. భృతి కూడా వీలైనంత త్వరగా ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాము. పీ4 ద్వారా పేదరికాన్ని రూపుమాపుతాం. గత ప్రభుత్వం ప్రజలను అనేక ఇబ్బందులు పెట్టింది. నా జీవితంలో ఎప్పుడూ చూడనన్ని ఇబ్బందులు పెట్టారు. గంజాయి, డ్రగ్స్‌ను విపరీతంగా ప్రోత్సహించారు. అలాంటి పాలన రాష్ట్రానికి మంచిది కాదు. కష్టమైనా, నష్టమైనా చెప్పిన హామీలు అమలుచేస్తాం. ఆడబిడ్డ నిధిని పీ4కు అనుసంధానం చేస్తాం. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు అమలు చేస్తాం’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.
Read Also- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నిజంగానే బరువు తగ్గారా.. ఎందుకిన్ని డౌట్స్?
మాట నిలబెట్టుకున్నాం..
‘ సూపర్ సిక్స్‌లో అతి కీలకమైనది తల్లికి వందనం (Thalliki vandanam). ఈ పథకం ద్వారా ఎంతమంది పిల్లలున్నా ఇస్తామని ముందే చెప్పాం. ఈ రోజు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం. గత ప్రభుత్వం 42,61,965 మందికి అమ్మఒడి ఇచ్చింది. మా ప్రభుత్వం 67,27,164 మందికి తల్లికి వందనం ఇస్తోంది. ఒకే బిడ్డ ఉన్న తల్లులు 18,55,760 మందికి తల్లికి వందనం ఇస్తున్నాం. ఇద్దరు బిడ్డలు ఉన్న తల్లులు 14,55,322 మందికి, ముగ్గురు పిల్లలు ఉన్న తల్లులు 2,10,684 మందికి, నలుగురు పిల్లలు ఉన్న తల్లులు 20,053 మందికి తల్లికి వందనం ఇస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం 67,27,164 మంది పిల్లలకు తల్లికి వందనం ఇస్తున్నాం. తల్లికి వందనం పథకాన్ని ప్రస్తావిస్తూ ఇది కేవలం ఒక పథకం కాదు. ప్రతి కుటుంబానికి విద్యా భద్రతకు భరోసా. బటన్ నొక్కుతూ గత ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని చిన్నా భిన్నం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి ఉద్యోగులకు సరైనా జీతాలు కూడా గత ప్రభుత్వం ఇవ్వలేకబోయింది. పేదల ఆకలి తీర్చే అన్నపూర్ణలు అన్న క్యాంటీన్లు. 203 ప్రారంభం ప్రారంభించి, తద్వారా 4కోట్ల మంది ఆకలి తీరుస్తోంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ మెరుగైన జీవన పాలన అందించాలన్నది కూటమి సర్కార్ లక్ష్యం’ అని చంద్రబాబు వెల్లడించారు.
Read Also- ACB Arrest: కాళేశ్వరం మాజీ ఈఈ అరెస్ట్.. రెండు వందల కోట్లకు పైగా ఆస్తులు సీజ్!