ACB Arrest( image credit: twitter)
తెలంగాణ

ACB Arrest: కాళేశ్వరం మాజీ ఈఈ అరెస్ట్.. రెండు వందల కోట్లకు పైగా ఆస్తులు సీజ్!

ACB Arrest: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో పని చేసిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌ను  ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనపై ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టు కేసులు నమోదు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం కేసులో జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు హాజరైన రోజునే జరిగిన ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి. నీటి పారుదల శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పని చేస్తున్న నూనె శ్రీధర్ కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కీలకమైన గాయత్రీ పంప్ హౌస్ బాధ్యతలను చూశారు.

గాయత్రీ పంప్ హౌస్‌లను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం బాహుబలి మోటార్లుగా చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన చొప్పదండిలోని ఎస్సారెస్పీ క్యాంపు కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా, ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టుకున్నట్టు తెలియడంతో ఏసీబీ అధికారులు బుధవారం రంగంలోకి దిగారు. కరీంనగర్‌లో శ్రీధర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇక, ప్రత్యేక బృందాలు హైదరాబాద్ మలక్‌పేట్‌లోని ఆయన నివాసంతోపాటు హైదరాబాద్, కరీంనగర్, బెంగళూరులో ఇరవై ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు.

  Also ReadPhone Tapping Case: సిట్ ఎదుటకు.. రెండోసారి ప్రభాకర్ రావు!

దీంట్లో శ్రీధర్‌కు మలక్‌పేటలో నాలుగు అంతస్తుల భవనం, షేక్‌పేటలోని స్కై హై గేటెడ్ కమ్యూనిటీలో 4,500 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్, తెల్లాపూర్ ఉర్జిత్ గేటెడ్ ఎంక్లేవ్‌లో లగ్జరీ విల్లా, వరంగల్‌లో జీ ప్లస్ మూడు అంతస్తుల భవనం, కరీంనగర్‌లోని పలు ప్రముఖ హోటల్‌లో భారీగా పెట్టుబడులు ఉన్నట్టు వెళ్లడైంది. దీంతోపాటు వేర్వేరు చోట్ల ఆస్తులు ఉన్నాయని, వీటి విలువ మార్కెట్ రేట్ ప్రకారం రెండు వందల కోట్లకు పైగా ఉంటుందని తెలిసింది.

కొంప ముంచిన కొడుకు పెళ్లి
శ్రీధర్ గత మార్చిలో కొడుకు పెళ్లి చేశారు. ఓ ఫాంహౌస్‌లో హల్దీ, సంగీత్ ఫంక్షన్‌ను ఔరా అనే రీతిలో చేశారు. మార్చ్ 6న థాయ్‌లాండ్‌లో వివాహం జరిపించిన ఆయన, 9వ తేదీన నాగోల్‌లోని శివం కన్వెన్షన్‌లో రిసెప్షన్ జరిపారు. వీటి కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. దీనికి సంబంధించిన సమాచారం వచ్చిన నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు దాడులు చేసినట్టు తెలిసింది.

13 ప్రాంతాలో సోదాలు చేసిన ఏసీబీ 14 రోజుల రిమాండ్

నీటపారుదల శాఖకు చెందిన అవినీతి తీమిగలం ఏసీబీ వలకు చిక్కింది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న నూనె శ్రీధర్‌ను ఆదాయానికి మించిన ఆస్తుల కేసలో ఏసీబీ అధికరులు అరెస్టు చేశారు. ఎసీబీ కోర్ట్ ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. నీటపారుదల శాఖకు చెందిన కాళేశ్వరం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ నూనె శ్రీధర్ రిమాండ్ తరలించారు. మొత్తం 13 ప్రాంతాలో సోదాలు చేసిన ఏసీబీ 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను గురువారం తెల్లవారుజామున చంచల్‌గూడా జైలుకు తరలించారు. కాగా ఆయన బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయడానికి అధికారులు కస్టడీకి కోరుకున్నారు. వందల కోట్లు అక్రమాస్రులు కూడబెట్టినట్లు ఇప్పటికే ఏసీబీ గుర్తించింది.

 Also Read: Kaleshwaram Commission: 115వ సాక్షిగా కమిషన్.. ఒన్ టు వన్ విచారణ!

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?