Thalliki Vandanam
ఆంధ్రప్రదేశ్

Thalliki Vandanam: తల్లికి వందనం పథకంలో రూ.2వేలు ఎగనామం.. ఎందుకనీ?

Thalliki Vandanam: ‘ నీకు రూ.15 వేలు.. నీకు రూ.15 వేలు.. నీకు రూ.15 వేలు’ అనే డైలాగ్ ఎన్నికల ముందు కూటమి నేతల నోట మార్మోగింది. మరీ ముఖ్యంగా ప్రస్తుత నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Rama Naidu) వేలు చూపించి మరీ 15వేలు.. 15వేలు అని చెప్పిన మాటలు ఒక రేంజిలో పాపులర్ అయ్యాయి. ఎంతలా అంటే ఆ మాటలు కాస్త డీజే సాంగ్‌లాగా వచ్చేశాయంటే ఎంత ఫేమస్ అయ్యాయో అర్థం చేసుకోవచ్చు. కూటమి పార్టీల నేతల్లో రూ.15వేలు అంటూ ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు తెగ ఊదరగొట్టేశారు. సీన్ కట్ చేస్తే.. రూ.15వేలు కాస్త రూ.13వేలు అయ్యింది. అసలే గతేడాది మొత్తం కూటమి సర్కార్ నయా పైసా ఇవ్వలేదని రాష్ట్ర ప్రజలు రగిలిపోతున్న పరిస్థితి. ఇప్పుడు తల్లికి వందనం (Thalliki vandanam) డబ్బులు వేస్తున్నప్పటికీ రూ.2వేలు కట్ చేసి రూ.13వేలు వేస్తున్నట్లు ప్రకటించడంతో ప్రభుత్వంపై జనాలు మండిపోతున్నారు. ఇదేం దౌర్భాగ్యం ఏడాది తర్వాత కూడా ఎందుకిలా చేస్తున్నారు? ఏడాది వరకూ వేచి చూసింది ఇందుకేనా? అంటూ జనాల నుంచి కామెంట్స్ వస్తున్నాయి. మరోవైపు.. వైసీపీ సైతం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. కూటమి అధికారంలోకి రాకముందు రూ.15వేలు అని చెప్పి.. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో ఒక్కరికి.. ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఎగనామం పెట్టి.. ఈ ఏడాది ఇస్తాం కానీ, రూ.15 వేలు కాకుండా రూ.13 వేలే ఇస్తామంటూ మెలిక పెట్టడం ఎంతవరకూ సబబు? అది కూడా 30 లక్షల మందికి ఇవ్వరట. మరి గత ఏడాది తల్లికి వందనం డబ్బు సంగతేంటి చంద్రబాబూ? అని ప్రశ్నిస్తున్నది.

Read Also- Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రైతులకు పండుగ లాంటి శుభవార్త..

ఎందుకు 2వేలు కట్?
కూటమి ప్రభుత్వానికి సరిగ్గా ఇవాళ్టికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా తల్లికి వందనం పథకం జీవో విడుదల అయ్యింది. ప్రతి విద్యార్థికీ రూ.15 వేల ఆర్థికసాయం ఇస్తున్నట్లు ప్రకటించింది. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రతివిద్యార్థికి లబ్ధి చేకూరనుంది. అయితే విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి మాత్రం రూ.13 వేలు మాత్రమే నగదు జమ కానున్నట్లు జీవోలో ఉండటం గమనార్హం. ప్రతి విద్యార్థి నుంచి రూ.2 వేల మినహాయింపు అని జీవోలో ప్రభుత్వం పేర్కొన్నది. స్కూళ్లు, కాలేజీల అభివృద్ధి పనుల కోసం మినహాయించిన నిధులను వినియోగించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కలెక్టర్‌ ఆధ్వర్యంలోని ఖాతాలో సర్కార్ ఈ నగదు జమచేయనున్నది. గత ప్రభుత్వం రూ.15వేల అమ్మఒడి ఇచ్చినప్పటికీ రెండు వేల రూపాయిలు కట్ చేసిందన్నది టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇందులో ఒక వెయ్యి రూపాయిలు స్కూల్ మెయింటెన్స్ కోసం, మరో వెయ్యి టాయిలెట్స్ నిర్వహణ కోసం ఇవ్వాలని జూన్ 28, 2023న కురుపాం సభలో నాడు సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటనను కౌంటర్‌గా ఇస్తున్న పరిస్థితి. సో.. దీన్ని బట్టి అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో.. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో రూ.2 వేలు కటింగ్ మాత్రం కామన్ అయ్యిందన్న మాట.

Babu And Lokesh

కాలర్ ఎగరేయట్లేదు కానీ..
గత ప్రభుత్వం 42,61,965 మందికి మాత్రమే అమ్మఒడి ఇచ్చిందని.. తమ ప్రభుత్వం 67,27,164 మందికి తల్లికి వందనం ఇస్తున్నట్లు సీఎం చంద్రబాబు (CM Chandrababu) ప్రకటించారు. ఒకే బిడ్డ ఉన్న తల్లులు 18,55,760 మంది, ఇద్దరు బిడ్డలు ఉన్న తల్లులు 14,55,322 మందికి, ముగ్గురు పిల్లలు ఉన్న తల్లులు 2,10,684 మందికి, నలుగురు పిల్లలు ఉన్న తల్లులు 20,053 మందికి తల్లికి వందనం ఇస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ప్రజలు, ప్రజాస్వామ్యం గెలిచి నేటికి ఏడాది పూర్తయ్యిందని లోకేష్‌ వ్యాఖ్యానించారు. ‘ సుపరిపాలనలో తొలి అడుగు పడింది. విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం మొదలైంది. ఇచ్చిన ప్రతి హామీ పద్ధతి ప్రకారం అమలు చేస్తున్నాం. అన్ని ప్రాంతాలను అభివృద్ధి బాట పట్టిస్తున్నాం. అన్ని పనులు పూర్తి చేశామని కాలర్‌ ఎగరేయడంలేదు. చేయాల్సింది ఎంతో ఉంది. నిర్దేశించుకున్న లక్ష్యం కోసం శ్రమిస్తాం. ప్రజాసేవలో నిమగ్నమవుతాం’ అని నారా లోకేష్‌ వెల్లడించారు.

Read Also- Chandrababu: ఇంతవరకూ మంచితనమే చూశారు.. చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం