Andhra Farmers
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రైతులకు పండుగ లాంటి శుభవార్త..

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ రైతులకు కేంద్ర ప్రభుత్వం పండుగ లాంటి శుభవార్త అందించింది. కందిపప్పు (Toor Dal) సేకరణ గడువుపై రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను పరిశీలించి పరిగణనలోనికి తీసుకున్నది. ఖరీఫ్ 2024–25 కాలానికి కందిపప్పు సేకరణకు గడువు‌ను కేంద్రం మరో 15 రోజులు పొడిగించింది. సేకరణ పరిమితి 95,620 మెట్రిక్ టన్నులుగా జూన్ 26 వరకు రైతుల నుంచి కంది పప్పు మద్దతు ధరపై సేకరిస్తారని ఎక్స్ వేదికగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) వెల్లడించారు. ఈ నిర్ణయంలో త్వరితగతిన సహకరించి రైతులకు ఎంతో ఉపయోగపడేలాగా చర్యలు తీసుకున్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు (Shivraj Singh Chouhan) ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సీఎం చంద్రబాబు (CM Chandrababu), ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) నాయకత్వంలో.. ఎన్డీఏ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం గ్రామీణ ప్రాంత అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేస్తోందని ‘ఎక్స్’ పోస్టులో తెలిపారు. కాగా, రైతుల నుంచి కందిపప్పును మద్దతు ధర (MSP) పై సేకరించడానికి ఈ పొడిగింపు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దేశీయంగా పప్పు ధాన్యాల ఉత్పత్తిని ప్రోత్సహించడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం దీని వెనుక ముఖ్య ఉద్దేశ్యం.

Read Also- Chandrababu: ఇంతవరకూ మంచితనమే చూశారు.. చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Kandi Pappu

సానుకూల ప్రభావం..
రాష్ట్రానికి 95,620 మెట్రిక్ టన్నుల కందిపప్పును సేకరించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. దేశీయంగా పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NAFED), నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NCCF) వంటి కేంద్ర నోడల్ ఏజెన్సీల ద్వారా ఈ సేకరణ జరుగుతుంది. ఎన్ఏఎఫ్ఈడీ యొక్క ఈ-సమృద్ధి పోర్టల్, ఎన్సీసీఎఫ్ యొక్క ఈ-సంయుక్తి పోర్టల్ ద్వారా ముందుగా నమోదు చేసుకున్న రైతుల నుంచి కందిపప్పు సేకరించబడుతుంది. కందిపప్పు ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించడానికి కేంద్ర ప్రభుత్వం 2028-29 వరకు రాష్ట్రాల ఉత్పత్తిలో 100% కందిపప్పును మద్దతు ధరతో కొనుగోలు చేయడానికి నిబద్ధతతో ఉంది. మొత్తంగా, ఈ పొడిగింపు ఆంధ్రప్రదేశ్‌లోని కందిపప్పు రైతులపై సానుకూల ప్రభావం చూపుతుంది, ఎందుకంటే వారికి తమ పంటను మద్దతు ధర వద్ద విక్రయించడానికి అదనపు సమయం లభిస్తుంది. అంతేకాదు.. రైతులు తమ పంటను మద్దతు ధరకు అమ్ముకోవడానికి తగినంత సమయం లభించడం వల్ల, భవిష్యత్తులో కూడా పప్పుధాన్యాల సాగును ప్రోత్సహించినట్లు అవుతుంది.

Rammohan Naidu

ధరలు ఇలా..
2024-25 ఖరీఫ్ సీజన్‌కు గాను కందిపప్పుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 7,550. అయితే.. 2025-26 ఖరీఫ్ సీజన్ కోసం గాను.. మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.8వేలకు పెంచడం జరిగింది. ఇది గతేడాది కంటే రూ.450 ఎక్కువ. ఇది రైతుల సాగు ఖర్చులను భర్తీ చేయడంతో పాటు లాభదాయకమైన ధరను అందించాలనే ప్రభుత్వ ఉద్దేశాన్ని సూచిస్తుంది. కేంద్ర ప్రభుత్వం 2028-29 వరకు రాష్ట్రాల ఉత్పత్తిలో 100% కందిపప్పు, మినపపప్పు, మసూర్ పప్పులను ఎమ్మెస్పీ వద్ద కొనుగోలు చేయడానికి నిబద్ధతతో ఉంది. ఈ నిర్ణయం దేశీయంగా పప్పుధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించడానికి ఒక కీలకమైన చర్యగా పరిగణించబడుతుంది. ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్ పథకం కింద ఈ సేకరణ జరుగుతుంది. ఈ పథకం రైతులకు వారి ఉత్పత్తులకు సరైన ధర లభించేలా చూస్తుంది. కేంద్రం తాజా నిర్ణయంతో దేశంలోని ప్రధాన కందిపప్పు ఉత్పత్తి రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణలో కందిపప్పు సేకరణ వేగవంతం చేయబడింది. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడంలో ఈ సేకరణ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గుల నుంచి దేశాన్ని రక్షిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tur Dal

 

 

Read Also- Air India Plane Crash: విమానం ప్రమాదంపై వెలుగులోకి సంచలన నిజాలు

 

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు