Plane Crash Khushboo
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Plane Crash: పాపం.. పెళ్లైన 5 నెలలకే.. తీవ్ర విషాదం

Plane Crash: అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో ఎంతమంది చనిపోయారనేది ప్రభుత్వం అధికారికంగా ఇంకా ధ్రువీకరించలేదు. అయితే, భారీగా ప్రాణనష్టం జరిగిందని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ ప్రకటించారు. అయితే, అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోయిన మృతుల విషాదగాథలు తీవ్ర విచారం కలిగిస్తున్నాయి. ఈ దుర్ఘటన ఎంతోమంది కలలను ఛిద్రం చేసింది. ఎంతోమంది తమ కుటుంబ సభ్యులను కోల్పోయారు.

పెళ్లైన 5 నెలలే..
ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానంలో ఖుష్బూ కన్వర్ అనే ఓ యువతి ప్రయాణించింది. రాజస్థాన్‌కు చెందిన ఆమెకు పెళ్లై కేవలం 5 నెలలు మాత్రమే అవుతోంది. ఈ ఏడాది జనవరి 18న వివాహం జరిగిందని బలోత్రా జిల్లాలోని అరబా దుడవాటా పట్టణానికి చెందినవారు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఖుష్బూ మరణించారా? లేక, గాయపడ్డారా? అనేది ధ్రువీకరణ కాలేదు. ఆమె ప్రాణాలతో ఉండాలని కుటుంబ సభ్యులు ప్రార్థిస్తున్నారు. లండన్‌లో వైద్యుడిగా పనిచేస్తున్న తన భర్త మన్‌ఫూల్ సింగ్‌ను కలవడానికి ఖుష్బూ బయలుదేరిందని వివరించారు. పెళ్లైన తర్వాత తొలిసారి భర్తను కలిసేందుకు వెళ్లే క్రమంలో ఈ విషాదం జరిగింది. ఖుష్బూ తండ్రి పేరు మదన్ సింగ్ రాజ్‌పురోహిత్. కాగా, ఈ ప్రమాదంలో రాజస్థాన్‌కు చెందినవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. మొత్తం 11 మంది ఆ విమానంలో ఉన్నారు. కాబట్టి, రాజస్థాన్‌కు చెందిన మృతుల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. యూకేలో చెఫ్‌లుగా పనిచేసేందుకు ఇద్దరు, ఒకిద్దరు మార్బుల్ ట్రేడర్లుగా పనిచేసేందుకు వెళుతున్నారని సమాచారం.

Read this- Plane Crash: విమానం ఎందుకు కూలింది?.. ఇంజనీర్ ఏం చెప్పారు?

ప్రాణాలపై ఆశల్లేవ్
ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 242 మంది ఉన్నాయి. వీరిలో ఎక్కువమంది బతికే అవకాశాలు కనిపించడం లేదు. ఓ స్థానిక పోలీసు అధికారి మాట్లాడుతూ, ఒక్కరు కూడా ప్రాణాలతో మిగిలే అవకాశం లేదడం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. విమానం కిందపడే క్రమంలో కనీసం ఎక్కడా నెమ్మదించిన దాఖలాలు లేవు. సుమారు 10 గంటల ప్రయాణం కోసం 80-90 టన్నులకు పైగా ఇంధనంతో ఉండడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ధాటికి మొత్తం చనిపోయి ఉంటారనే అనుమానులు వ్యక్తమవుతున్నాయి. ఆరెంజ్ రంగులో భారీగా మంటలు ఎగసిపడ్డాయని, ఈ ధాటికి చుట్టుపక్కల చెట్లు కూడా కాలిపోయానని పేర్కొంటున్నారు.

Read this- Air India Plane Crash: విమానం దూసుకెళ్లిన హాస్టల్‌లో బీభత్సం.. భారీగా మృతులు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!