Delhi-Airport (Image source Twitter)
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Delhi Airport: 300 విమానాలు ఆలస్యం.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్యాసింజర్ల గందరగోళం

Delhi Airport: దేశరాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో (Delhi Airport) శుక్రావరం అసాధారణ దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా పెద్ద సంఖ్యలో విమానాలు ఆలస్యమవుతున్నాయి. శుక్రవారం 300కి పైగా విమానాలకు అంతరాయం ఏర్పడిందని ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. ఈ ప్రభావంతో వందలాది మంది ప్యాసింజర్లు విమానాశ్రయంలో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో నెలకొన్న పరిస్థితులతో, ఉత్తర భారతంలోని పలు ఎయిర్‌పోర్టులపై కూడా ప్రభావం పడింది.

గురువారం సాయంత్రమే సమస్య మొదలు

ఏటీసీలో తలెత్తిన సాంకేతిక సమస్య గురువారం సాయంత్రమే మొదలైంది. దీని ప్రభావం ఆటోమేటిక్ మెసేజ్ స్విచ్చింగ్ సిస్టమ్‌పై (AMSS) పడింది. ఫ్లైట్ డేటాను అందించే ఏటీఎస్‌కు ఏఎంఎస్ఎస్ వ్యవస్థ నుంచే సమాచారం అందుతుంది. డేటా ఆధారంగా ఏటీఎస్ ‘ప్లైట్ ప్లాన్స్’ తయారు చేస్తుంది. ఆటోమేటిక్ సిస్టమ్ పనిచేయకపోవడంతో, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు (ATC) చేతితో ఫ్లైట్ ప్లాన్‌లను సిద్ధం చేయాల్సి వచ్చింది. దీంతో, చాలా నెమ్మదిగా ప్రక్రియ కొనసాగి విమానాల ఆలస్యం జరుగుతోంది. దీంతో, ఢిల్లీ ఎయిర్‌పోర్టు కేంద్రంగా పెద్ద సంఖ్యలో విమానాల ఆలస్యం జరుగుతోంది. ఈ ప్రభావంతో ఎయిర్‌స్పేస్ రద్దీ కూడా ఏర్పడింది.

Read Also- Air India Crash: ఎయిరిండియా క్రాష్ ఘటన.. పైలెట్‌ తండ్రికి సుప్రీంకోర్టు ఓదార్పు.. కీలక వ్యాఖ్యలు

300 విమానాలు ఆలస్యం

ఏటీఎస్‌లో సాంకేతిక సమస్య కారణంగా సుమారుగా 300 వరకు విమానాలు ఆలస్యమైనట్టుగా సమాచారం. సాధారణంగా అయితే, ఢిల్లీ ఎయిర్‌పోర్టు చాలా రద్దీగా ఉంటుంది. రోజుకు 1,500 కంటే ఎక్కువ విమానాల ఇక్కడి రాకపోకలు సాగిస్తుంటాయి. సాంకేతిక సమస్య కారణంగా శుక్రవారం ఉదయం టేకాఫ్‌లు, ల్యాండింగ్‌లపై తీవ్రమైన ప్రభావం పడింది. ప్రస్తుతం రన్‌వేపై పార్కింగ్ స్థలం లేకపోవడంతో శుక్రవారం సాయంత్రం కొన్ని విమానాలను రద్దు చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.

Read Also- Women Health: క్యాన్సర్‌ దూరంగా ఉంచే స్మార్ట్‌ లైఫ్‌స్టైల్‌.. ప్రతి మహిళ తప్పక పాటించాల్సిన చిట్కాలు

త్వరలోనే సాధారణ స్థితికి సేవలు

విమానాల ఆలస్యంపై ఎయిర్‌పోర్టును నిర్వహించే ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (DIAL) స్పందించింది. సాంకేతిక సమస్య ఏర్పడినట్టు నిర్ధారించింది. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించి, తిరిగి సాధారణ స్థితిని సేవలను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నామని, ఈ మేరకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో కలిసి పనిచేస్తున్నట్లు వివరించింది. ఎయిర్‌పోర్టులో ప్యాసింజర్లు పొడవైన క్యూలైన్లలో నిలబడి ఉండడం, ఎక్కువసేపు వేచి చూడాల్సిన పరిస్థితులు, పదేపదే షెడ్యూల్ మార్పుల ప్రకటనలు వెలువడుతున్నాయి. దీంతో, విమానాల ఆలస్యంపై ఇండిగో, స్పైస్‌జెట్, ఎయిర్ ఇండియా వంటి దేశీయ ఎయిర్‌లైన్స్ కూడా ప్యాసింజర్లను అప్రమత్తం చేశాయి.

కాగా, ఏటీసీ కార్యకలాపాలు స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ, చాలా నెమ్మదిగా జరుగుతున్నాయని ఏఏఐ సీనియర్ తెలిపారు. సేవలను పునరుద్ధరించేందుకు పనులు కొనసాగుతున్నాయన్నారు. పెండింగ్ సర్వీసులు క్లియర్ చేయడానికి గంటల సమయం పట్టే అవకాశం ఉందని, దీని ప్రభావం లక్నో, జైపూర్, చండీగఢ్, అమృత్‌సర్ ఎయిర్‌పోర్టులపై కూడా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

Just In

01

Private Colleges Opening: రేపటి నుంచి ప్రైవేటు కాలేజీలు ఓపెన్.. వెనక్కితగ్గిన యాజమాన్యాలు

Mrutyunjaya Yagna: రోడ్డు ప్రమాదాలు తగ్గాలని ఆకాంక్షిస్తూ.. సంగారెడ్డి జిల్లాలో మృత్యుంజయ యజ్ఞం

Bus Seat Dispute: ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై దాడి.. బస్సులో అసలేం జరిగిందో తెలిస్తే షాకే!

Kamal Haasan: బర్త్‌డే స్పెషల్ ట్రీట్.. యాక్షన్ మాస్టర్స్ అన్బరివ్‌తో కమల్ చిత్రం

CM Revanth Reddy: బంద్ పేరుతో బెదిరింపులు.. ప్రైవేటు కాలేజీలకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్