Women Health: ప్రతి ఏడాది వేలాది మంది మహిళలు గైనకాలజీ క్యాన్సర్‌లతో (సర్వికల్, ఓవరీ, యుటరైన్, వెజైనల్, వల్వార్ క్యాన్సర్లు) బాధపడుతున్నారు. వీటన్నింటినీ పూర్తిగా నివారించలేకపోయినా, కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించడం ద్వారా ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. అవగాహనతో ప్రారంభమయ్యే జాగ్రత్త జీవనశైలి, మహిళల ఆరోగ్యాన్ని రక్షించగలదు.
1. రెగ్యులర్ స్క్రీనింగ్స్, చెకప్స్ చేయించుకోవాలి
ప్రత్యేకంగా సర్వికల్ క్యాన్సర్‌ను ముందుగా గుర్తించడానికి పాప్ స్మియర్, హెచ్‌పీవీ టెస్ట్‌లు చేయించుకోవాలి. అదేవిధంగా పెల్విక్ పరీక్షలు చేయించుకోవడం, అనియంత్రిత రక్తస్రావం లేదా కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే గైనకాలజిస్టును వెంటనే సంప్రదించాలి. ముందస్తు గుర్తింపు ప్రాణాలను కాపాడగలదని మర్చిపోకండి.
2. HPV వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలి
హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) సర్వికల్, వెజైనల్, వల్వార్ క్యాన్సర్లకు ప్రధాన కారణం. 9 ఏళ్ల వయసు నుంచే 45 ఏళ్ల లోపు మహిళలు ఈ వ్యాక్సిన్ తీసుకోవడం సురక్షితంగా ఉండొచ్చు. అలాగే దీని వలన సర్వికల్ క్యాన్సర్ ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.
3. ఆరోగ్యకరమైన బరువును నిలబెట్టుకోండి
అధిక బరువు, కొవ్వు శరీరంలో ఈస్ట్రోజన్ స్థాయిలను పెంచి, గర్భాశయ క్యాన్సర్ అవకాశాలను పెంచుతుంది. కూరగాయలు, పండ్లు, హోల్ గ్రేన్స్, లీన్ ప్రోటీన్ వంటి ఆహారాన్ని తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా హార్మోన్ల సమతౌల్యం కాపాడవచ్చు.
4. పొగ తాగడం, మద్యం తాగడం మానండి
పొగ తాగడం సర్వికల్, వల్వార్ క్యాన్సర్లకు సంబంధముంటుంది. అలాగే, అధిక మద్యం సేవిస్తే బ్రెస్ట్ క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి, వీటిని మానేయడం వలన శరీరం రోగనిరోధక శక్తిని కూడా పెంపొందించుకోవచ్చు.
5. ఒత్తిడి తగ్గించుకోండి, సరిపడా నిద్ర అవసరం
అధిక ఒత్తిడి, నిద్రలేమి శరీర రక్షణ వ్యవస్థను బలహీనపరుస్తాయి. ప్రతిరోజూ యోగా, ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి. రోజుకు కనీసం 7–8 గంటల నిద్ర తీసుకోవడం శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా డాక్టర్ లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ బాధ్యత వహించదని గమనించగలరు.
