Air Purifier: ఇండియాలో గాలి కాలుష్యం రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. దీపావళి తర్వాత కొన్ని రోజులు గాలి నాణ్యత (AQI)లో కొంత మెరుగుదల కనిపించినా, దీర్ఘకాలంలో ఇది ప్రజల ఆరోగ్యానికి పెద్ద ముప్పు అవుతుంది. ముఖ్యంగా, చలి కాలం మొదలవుతున్న ఈ సమయంలో గాల్లోని సూక్ష్మ ధూళి కణాలు, విష వాయువులు బయటే కాకుండా ఇంట్లో కూడా వ్యాపించి మనం పీల్చే గాలినే కలుషితం చేస్తున్నాయి. నగర స్థాయిలో కాలుష్యాన్ని ఆపడం కష్టమైనా, కనీసం మన కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం ఎయిర్ ప్యూరిఫయర్ లో పెట్టుబడి పెట్టడం మంచిది.
ఎయిర్ ప్యూరిఫయర్ కొనుగోలు చేసే ముందు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు
1. శుద్ధి టెక్నాలజీ (Purification Technology)
ప్రస్తుతం మార్కెట్లో HEPA, UV-C, ఐయానిక్ ఫిల్టర్స్, యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్స్ వంటి పలు రకాల టెక్నాలజీలతో ప్యూరిఫయర్లు లభిస్తున్నాయి. మూడుస్థాయి (3-layer) ఫిల్టరేషన్ సిస్టమ్ ఉన్న ప్యూరిఫయర్ తీసుకోవడం ఉత్తమం. ఇందులో:
1.ప్రీ ఫిల్టర్ (ధూళి కణాలు, జుట్టు వంటి వాటిని అడ్డుకుంటుంది)
2. యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్ Activated Carbon Filter (వాసనలను, గ్యాసులను తొలగిస్తుంది)
3. True HEPA Filter (గాల్లోని 99.97% సూక్ష్మ కణాలను తొలగిస్తుంది)
2. కవరేజ్ ఏరియా (Coverage Area)
మీ గది పరిమాణాన్ని బట్టి సరిపోయే ప్యూరిఫయర్ ఎంచుకోండి. కవరేజ్ ఏరియా ఎక్కువగా ఉంటే గదిలోని గాలి త్వరగా శుద్ధవుతుంది. సరైన పరిమాణం ఉన్న ప్యూరిఫయర్ ఉంటే విద్యుత్ వినియోగం కూడా తక్కువగా ఉంటుంది.
3. క్లీన్ ఎయిర్ డెలివరీ రేట్ (CADR)
CADR అనేది ప్యూరిఫయర్ గాలి శుద్ధి చేసే వేగాన్ని సూచించే ప్రమాణం. CADR సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే, అంత వేగంగా అది గదిలోని గాలిని శుద్ధి చేస్తుంది.
Also Read: Gadwal Crime: పోలీసుల అదుపులో మోసాలకు పాల్పడుతున్న బంగారం వ్యాపారి.. మరో ఘటనలో బంగారం కోసం మహిళ హత్య
4. ఫిల్టర్ రీప్లేస్‌మెంట్ (Filter Replacement)
ఫిల్టర్ మార్చడం ఎప్పుడు అవసరమవుతుందో కూడా చూసుకోవాలి. రీప్లేస్‌మెంట్ ఫిల్టర్లు సులభంగా లభించాలి. మంచి సర్వీస్, ఆఫ్టర్ సేల్స్ సపోర్ట్ ఉన్న బ్రాండ్ ఎంచుకోవడం మంచిది.
మీరు కొత్త ప్యూరిఫైయర్ ప్లాన్ చేస్తున్నారా?
రూ.20,000 లోపు బెస్ట్ ఎయిర్ ప్యూరిఫయర్లు.. మీ కోసమే!
Xiaomi స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ ధర రూ. 17,999 గా ఉంది.
ఫిలిప్స్ AC0920 స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ ధర రూ. 8,098 గా ఉంది.
హోమ్ కోసం హనీవెల్ ఎయిర్ ప్యూరిఫైయర్ ధర రూ. 8,090 గా ఉంది.
కోవే ఎయిర్‌మెగా 150 ధర రూ. 15,999 గా ఉంది
క్యూబో స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ Q200 ధర రూ. 6,790 గా ఉంది
యురేకా ఫోర్బ్స్ ఎయిర్ ప్యూరిఫైయర్ 150 ధర రూ. 4,999 గా ఉంది.
ఫిలిప్స్ AC1711 ధర రూ. 12,400 గా ఉంది.
