Ticket Bookings Offer: దేశంలోని అతిపెద్ద రవాణా వ్యవస్థలో రైల్వే (Indian Railway) ఒకటి. దేశ వ్యాప్తంగా నిత్యం కోట్లాది మంది ప్రజలు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. అందుకే ఎప్పుడు చూసిన రైళ్లు, రైల్వే స్టేషన్లలో రద్దీ కనిపిస్తుంటుంది. ఇక పండుగ సమయాల్లో ఆ రద్దీ తారా స్థాయికి చేరుతుంటుంది. ఆన్ లైన్ లో టికెట్లు (Railway Online Tickets) హాట్ కేకుల్లా అమ్ముడుపోతుంటాయి. జనరల్ బోగీల్లో సైతం నిలబడేందుకు కూడా చోటు దొరకని పరిస్థితి ఉంటుంది. అయితే కొత్త ఏడాది సందర్భంగా ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రైలు టికెట్లను అందించడంతో పాటు క్యాష్ బ్యాక్ ఆఫర్ ను సైతం అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించింది.
సంక్రాంతి నుంచే ప్రారంభం..
తూర్పు మధ్య రైల్వే శాఖ (East Central Railway) తమ పరిధిలోని రైళ్లల్లో ప్రయాణించే వారికి అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. డిజిటల్ బుకింగ్ వైపు ప్రయాణికులను ఆకర్షించేందుకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ను తీసుకొస్తోంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 14 నుంచి ఈ ఆఫర్ అందుబాటులోకి రానుంది. ఇందులో భాగంగా రైల్ వన్ యాప్ (RailOne APP)లో టికెట్ బుకింగ్ చేసుకునే వారికి ప్రతీ టికెట్ పై 3 శాతం రాయితీ లభించనుంది. జనవరి 14 నుంచి జులై 14 వరకూ దాదాపు 6 నెలల పాటు ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉండనున్నట్లు ఈస్ట్ సెంట్రల్ రైల్వే తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా ప్రకటించింది.
💠 RailOne ऐप से अनारक्षित टिकट बुक करना हुआ अब और भी किफायती
📱 डिजिटल पेमेंट पर पाएं 3 प्रतिशत की छूट !
🗓️ ऑफर की अवधि : 14 जनवरी, 2026 से 14 जुलाई, 2026 तक ।
💠 #RailOne एक समग्र और यूज़र-फ्रेंडली ऐप है, जो सभी प्रमुख यात्री सेवाओं को एक ही प्लेटफॉर्म पर उपलब्ध कराता है। pic.twitter.com/79oIATeQ97
— East Central Railway (@ECRlyHJP) December 31, 2025
డిస్కౌంట్ ఎలా పొందాలి?
అయితే ఈ ఆఫర్ కేవలం రైల్వే వన్ యాప్ లో మాత్రమే అందుబాటులో ఉండనుంది. అదికూడా జనరల్ బోగీ టికెట్లకు మాత్రమే వర్తించనుంది. కాబట్టి రైలు టికెట్ పై డిస్కౌంట్ కావాల్సిన వారు.. రైల్వే వన్ యాప్ లో తప్పనిసరిగా లాగిన్ కావాలి. అనంతరం ప్రయాణించాల్సిన రైలును ఎంపిక చేసుకొని పేమెంట్ సెక్షన్ కు వెళ్లాలి. అక్కడ యూపీఐ (UPI), డెబిట్ / క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా ఆర్ – వ్యాలెట్ (R – Wallet) లలో ఏ ఆప్షన్ అయినా పేమెంట్ కోసం ఎంచుకోవచ్చు. పేమెంట్ ఆప్షన్ సెలక్ట్ చేసుకున్న తర్వాత టికెట్ పై నేరుగా 3 శాతం డిస్కౌంట్ తగ్గి మిగతా అమౌంట్ చూపిస్తుంది. అలా రాయితీ పొందవచ్చు.
Also Read: Deputy CM Pawan Kalyan: కొండగట్టు అంజన్న సేవలో పవన్ కళ్యాణ్.. టీటీడీ వసతి గృహాలకు శంకుస్థాపన
క్యాష్ బ్యాక్ కావాలంటే..
యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా టికెట్ ను కొనుగోలు చేసే వారికి నేరుగా 3 శాతం రాయితీ లభిస్తుంది. అలా కాకుండా రైల్వే వ్యాలెట్ అయిన R-Wallet ద్వారా పేమెంట్ చేస్తే.. 3 శాతం రాయితీ క్యాష్ బ్యాక్ రూపంలో వాలెట్ లో జమ అవుతుంది. అంటే రైల్వే కౌంటర్ వద్ద క్యూలో నిలబడి తీసుకునే రూ.100 టికెట్ ను రైల్వే వన్ యాప్ లో బుక్ చేయడం ద్వారా రూ.97 రూపాయలకే పొందవచ్చు. కాబట్టి ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోని వచ్చే 6 నెలల పాటు టికెట్ పై రాయితీ పొందాలని తూర్పు మధ్య రైల్వే సూచిస్తోంది.

