Vande Bharat Sleeper Train: వీఐపీ సంస్కృతికి చెక్.. అంతా ఒక్కటే!
Vande Bharat Sleeper Train (Image Source: Twitter)
Travel News

Vande Bharat Sleeper Train: పట్టాలెక్కిన వందే భారత్ స్లీపర్.. టికెట్ కొన్న ప్రతీ ఒక్కరూ వీఐపీనే!

Vande Bharat Sleeper Train: దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి వచ్చింది. ప్రధాని మోదీ (PM Modi) జెండా ఊపి రైలును ప్రారంభించారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ.. మాల్దా టౌన్ లో స్లిపర్ ట్రైన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రైలు.. అసోం, బెంగాల్ రాష్ట్రాల మధ్య రాత్రివేళల్లో ప్రయాణించనుంది. బెంగాల్ లోని హౌరా నుంచి అసోంలోని గువాహటి నగరాల (Guwahati–Howrah) మధ్య చక్కర్లు కొట్టనుంది. గంటకు 180 కి.మీ గరిష్ట వేగంతో 958 కి.మీ దూరాన్ని 14 గంటల్లోనే ఇది చేరుకోనుంది.

వీఐపీ సంస్కృతికి చెక్..

సాధారణంగా రైళ్లల్లో వీఐపీ కల్చర్ ఎక్కువగా కనిపిస్తుంటుంది. సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, అత్యున్నత హోదాలో ఉన్న వ్యక్తులు ప్రయాణిస్తున్న క్రమంలో కోచ్ లను ఖాళీ చేయించడం, భద్రత పేరుతో తోటి ప్రయాణికులకు అసౌకర్యం కల్పించడం, సౌకర్యవంతమైన ప్రయాణానికి ఆటంకం కలిగించడం వంటివి చేస్తుంటారు. అయితే వందే భారత్ స్లీపర్ విషయానికి వస్తే.. ఇలాంటివేవి కనిపించవు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. ఈ రైలులో పారదర్శక టికెటింగ్ వ్యవస్థ అందుబాటులో ఉండనుంది. టికెట్ ఉన్న ప్రతీ ఒక్కరికీ ఒకే రకమైన సౌకర్యాలు, సేవలు అందుబాటులో ఉంటాయి.

ఆ జిల్లాల గుండా ప్రయాణం..

వందే భారత్ స్లీపర్ ట్రైన్.. అసోంలోని గువహటి నుంచి బయల్దేరి కామరూప్ మెట్రోపాలిటన్, బొంగైగావ్ జిల్లాల గుండా బెంగాల్ లోకి ప్రవేశిస్తుంది. అక్కడి కూచ్ బెహార్, జల్పైగురి, మాల్డా, ముర్షిదాబాద్, పుర్బా బర్ధమాన్, హుగ్లీ మీదగా ఆఖరి గమ్యస్థానమైన హౌరా జిల్లాకు చేరుకోనుంది.

వీఐపీ, అత్యవసర కోటాకు చెల్లుచీటి

కొత్తగా లాంచ్ చేసిన వందే భారత్ స్లీపర్ రైలులో ఏ రకమైన వీఐపీ లేదా అత్యవసర కోటా సీట్లు/ టికెట్లు అందుబాటులో ఉండవు. రైల్వే అధికారులు సైతం తమ పాస్ లు ఉపయోగించి ప్రయాణించడానికి వీల్లేదు. కేవలం రైల్వే స్టేషన్, ఐఆర్‌సీటీసీ నుంచి టికెట్లు కొనుగోలు చేసిన వారికి మాత్రమే ప్రయాణించేందుకు వీలు కల్పిస్తారు. ఆర్ఏసీ (RAC), వెయిటింగ్ లిస్ట్ వంటి సదుపాయాలు ఈ స్లీపర్ రైలులో ఉండవని అధికార వర్గాలు చెబుతున్నాయి.

ప్రాంతీయ వంటకాలు..

వందే భారత్ స్లీపర్ రైలులో రుచికరమైన ప్రాంతీయ వంటకాలను అందుబాటులో ఉంచనున్నారు. ఓ నివేదిక ప్రకారం.. కోల్ కతాలోని హౌరా నుంచి ప్రారంభమయ్యే రైలులో బెంగాలీ వంటకాలను ప్రయాణికులకు అందించనున్నారు. క్లాసిక్ బెంగాలి వంటకాలను తింటూ సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వీలు కల్పించనున్నారు. ముర్గిర్ జోల్ (Murgir Jhol), కోషా పనీర్ (Kosha Paneer) తో పాటు మరిన్ని బెంగాలి వంటకాలు వందే భారత్ స్లీపర్ రైలులో అందించాలని రైల్వే శాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరోవైపు గౌహతి నుంచి మెుదలయ్యే స్లీపర్ లో సంప్రదాయ అస్సామీ వంటకాలు ఉండనున్నట్లు తెలుస్తోంది.

Also Read: Free Bus for Men: పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన అన్నాడీఎంకే

టికెట్ ధర ఎంతంటే?

రైల్వే వర్గాల సమాచారం ప్రకారం.. అస్సాంలోని గౌహతి నుంచి కోల్ కతాలోని గౌహతి వరకూ ప్రయాణించడానికి ప్రారంభ టికెట్ ధర రూ. 2,300గా ఉండనుంది. వందే భారత్ స్లీపస్ ఏసీ 3 టైర్ టికెట్ ధర రూ.2,000, ఏసీ 2-టైర్ ధర రూ. 3,000, ఏసీ వన్ ఛార్జీ రూ.3,600గా ఉండొచ్చని సమాచారం.

Also Read: Vande Bharat 4.0: త్వరలో వందే భారత్ 4.0.. వేగం గంటకు 250 కి.మీ.. మరిన్ని ప్రత్యేకతలు ఇవే!

Just In

01

BRS Party: వరంగల్‌లో ఒకలా? సికింద్రాబాద్‌లో మరోలా? బీఆర్ఎస్ రెండు నాలుకల ధోరణి!

MSG Collections: ‘మన శంకర వర ప్రసాద్ గారు’ 5 డేస్ కలెక్షన్స్.. మైండ్ బ్లోయింగ్!

CM Revanth Reddy: తెలంగాణలో మరో బాసరగా.. ట్రిపుల్ ఐటీ కళాశాలకు శంఖుస్థాపన చేసిన సీఎం..!

Municipal Reservations: మునిసిపాలిటీ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు.. ఆ కోణంలో రాజకీయ సెగలు పుట్టడం ఖాయం!

Vande Bharat Sleeper Train: పట్టాలెక్కిన వందే భారత్ స్లీపర్.. టికెట్ కొన్న ప్రతీ ఒక్కరూ వీఐపీనే!