Free Bus for Men: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు (Tamil Nadu Assembly Elections) సమయం దగ్గరపడుతున్నా కొద్దీ అక్కడి రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఒకపక్క పరస్పర విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడుతూనే .. మరోపక్క గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు ఆకర్షణీయ మేనిఫెస్టోల రూపంలో వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో అన్నాడీఎంకే (AIADMK) శనివారం (జనవరి 17) పాక్షికంగా మేనిఫెస్టోని ప్రకటించింది. ఇందులో కీలకమైన హామీలు ఉన్నాయి.
పురుషులకు ఉచిత
త్వరలోనే జరగనున్న తమళనాడు అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీల కంటే ముందుగా మేనిఫెస్టో ప్రకటించిన పార్టీగా అన్నాడీఎంకే నిలిచింది. అయితే, ఆ పార్టీ ప్రకటించిన హామీలు కూడా చర్చనీయాంశమయ్యాయి. అందుకు, ప్రధాన కారణం, పరుషులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని అన్నాడీఎంకే వెల్లడించింది. ప్రస్తుతం మహిళలకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ స్కీమ్‌ను మగవాళ్లకు కూడా విస్తరిస్తామని (Free Bus for Men) పేర్కొంది. అయితే, సిటీ బస్సుల్లో ప్రయాణించే పురుషులకు మాత్రమే వర్తిస్తుందని క్లారిటీ ఇచ్చింది. ఇక, మహిళలకు ప్రస్తుతం సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యంగా ఉండడంతో, దానిని యథావిథిగా కొనసాగిస్తామని తెలిపింది.
Read Also- BJP Telangana: పార్టీ ఫిరాయింపు కేసులో కీలక పరిణామం.. స్పీకర్‌పై కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసిన ఏలేటి!
మహిళలకు నెలకు రూ.2 వేలు
కేవలం ఐదు హామీలను మాత్రమే అన్నాడీఎంకే అధిష్టానం ప్రకటించింది. హామీల వివరాల విషయానికి వస్తే, కుటుంబంలో పెద్దగా ఉన్న మహిళకు ప్రతినెలా రూ.2000 ఇస్తామని వివరించింది. అది కూడా రేషన్ కార్డ్ పరిధిలో ఉండే మహిళలకు మాత్రమే వర్తిస్తుందని క్లారిటీ ఇచ్చింది. ఈ పథకానికి ‘కులా విలక్కు స్కీమ్’ అని పేరు పెట్టింది. అన్నాడీఎంకే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత, వీలైనంత త్వరగా ఈ పథకాన్ని అమలు చేస్తామని తెలిపింది. కుటుంబ పెద్దగా ఉన్న మహిళ ఖాతాలోకి నగదు నేరుగా జమ అవుతుందని, సమాజంలో ఆర్థిక సమతుల్యతను సాధించేందుకుగానూ ఈ పథకానికి రూపకల్పన చేసినట్టు వివరించింది.
5 లక్షల మహిళలపై సబ్సిడీపై టూలర్స్
రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 5 లక్షల మంది మహిళలకు సబ్సిడీపై టూ-వీలర్ అందిస్తామని మేనిఫెస్టోలో అన్నాడీఎంకే పేర్కొంది. ఇందుకోసం ‘అమ్మ టూ-వీలర్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్’ ప్రవేశపెడతామని తెలిపింది. రూ.25,000 సబ్సిడీ ఇస్తామని ఆ పార్టీ తెలిపింది. నాలుగవ హామీగా అందరికీ ఇళ్లు ఇస్తామని ప్రకటించింది. ‘అమ్మ ఇల్లం యోజన’ కింద ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో నివాసం లేనివారికి, ఈ పథకం కింద ప్రభుత్వమే భూమి కొనుగోలు చేస్తుందని, ఇళ్లు నిర్మించి ఇస్తుందని స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ పథకాన్ని అమలు చేస్తామని, పట్టణాల్లో నివాసం లేనివారి కోసం ప్రభుత్వం స్థలం కొనుగోలు చేసి, అపార్ట్‌మెంట్లు నిర్మించి ఇస్తుందని పేర్కొన్నారు. ఐదవ హామీగా ఉపాధి హామీని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం 100 రోజుల ఉపాధికి హామీ ఇవ్వగా, రోజుల సంఖ్యను 125కి పెంచుతామని హామీ ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంఖ్యను 150 రోజులకు పెంచుతామని తెలిపింది.

