Trains Cancelled: విశాఖ - విజయవాడ మార్గంలో.. పలు రైళ్లు రద్దు
Several Trains Cancelled Between Visakhapatnam and Vijayawada
Travel News

Trains Cancelled: ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. విశాఖ – విజయవాడ మార్గంలో.. పలు రైళ్లు రద్దు, లిస్ట్ ఇదే!

Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు ఈస్ట్ కోస్ట్ రైల్వే (East Coast Railway) షాకింగ్ విజ్ఞప్తి చేసింది. విశాఖపట్నం – విజయవాడ రైల్వే మార్గాల్లో ట్రాఫిక్, సిగ్నలింగ్, భద్రతా పనులు జరుగుతున్నందున పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా కొన్ని ప్యాసింజర్, ఎక్స్ ప్రెస్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. రద్దు చేసిన రైళ్ల వివరాలను సైతం ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు తెలియజేశారు. రద్దు చేయబడిన రైళ్ల వివరాలు, వాటికి సంబంధించిన తేదీల లిస్ట్ ఇప్పుడు చూద్దాం.

విజయవాడ – విశాఖపట్నం మార్గం..

రైల్వే ట్రాక్ పునరుద్దీకరణ పనుల్లో భాగంగా విజయవాడ – విశాఖపట్నం మధ్య నడిచే రెండు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటించింది. విజయవాడ – విశాఖపట్నం ( రైలు నెంబర్ 12717) 28 నుంచి 31వ తేదీ మధ్య అందుబాటులో ఉండదని తెలిపింది. అలాగే విశాఖపట్నం – విజయవాడ మధ్య తిరిగే 12717 నెంబర్ గల రైలును సైతం 28 – 30 తేదీల మధ్య తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.

గుంటూరు – విశాఖపట్నం..

17239: గుంటూరు – విశాఖపట్నం → 28.01.2026 to 30.01.2026

17240: విశాఖపట్నం – గుంటూరు → 29.01.2026 – 31.01.2026

22876: గుంటూరు – విశాఖపట్నం → 31.01.2026

22875: విశాఖపట్నం – గుంటూరు → 31.01.2026

లింగంపల్లి – రాజమండ్రి

12806: లింగంపల్లి – విశాఖపట్నం → 29.01.2026, 30.01.2026

12805: విశాఖపట్నం – లింగంపల్లి → 28.01.2026, 29.01.2026

67285: రాజమండ్రి – విశాఖపట్నం → 29.01.2026, 31.01.2026

67286: విశాఖపట్నం – రాజమండ్రి → 29.01.2026, 31.01.2026

తిరుపతి – పూరి

17480: తిరుపతి – పూరి → 27.01.2026

17479: పూరి – తిరుపతి → 28.01.2026

తిరుపతి – విశాఖపట్నం

22708: తిరుపతి – విశాఖపట్నం → 28.01.2026

22707: విశాఖపట్నం – తిరుపతి → 29.01.2026

మచిలీపట్నం – విశాఖ పట్నం

17219: మచిలీపట్నం – విశాఖపట్నం → 28.01.2026, 29.01.2026

17220: విశాఖపట్నం – మచిలీపట్నం →29.01.2026, 30.01.2026

Also Read: Ajit Pawar Death: అజిత్ పవార్ దుర్మరణం.. వెలుగులోకి షాకింగ్ నిజాలు.. మృతి వెనుక ఇంత జరిగిందా?

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?