Weather Update: తెలంగాణలో మరో మూడురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(LMD) తెలిపింది. రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కరిసే అవకాశం ఉంని తెలిపింది. అటు ఆంధ్రప్రదేష్(AP) లోను తీర ప్రాతానికి ఆనుకోని ఉన్నటువంటి మధ్య బంగాళ కాతంలోను సగటున సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం, మరియు ఉత్తర తమిళనాడు తీర ప్రాంతంలో సముద్ర మట్టానికి దిగువన 5.8 కిలోమీర్ల ఉపరితల ఆవర్తనం ఉందని భారత వాతవరణ శాఖ(Indian Meteorological Department) తెలిపింది. దీని ప్రభావం కారణంగా అటు ఏపి మరియు తెలంగాణ(Telangana)లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ జిల్లాలో వర్షాలు పడే అవకాశం..
తెలంగాణలో సూర్యపేట(Surayapeta), వరంగల్(warangal), హనుమకొండ(hanumakonda), మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, వనపర్తి, జోగులాంబగద్వాల జిల్లా, నారాయణ పేట జిల్లాలతో పాటుగా అక్కడ ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(IMD) తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లోని నేడు దట్టమైన మేఘాలతో పాటు, పగటివేళలో ఏపి అంతటా ఉక్కపోతగా ఉండి, సాయంకాలం సమయం వరకు ఎండతో కూడిన వాతవరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది, సాయంత్రం సమయంలో మాత్రం రాయలసీమ, కోస్తాంద్ర ప్రాతాంల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదే వాతవరణం రాత్రి వరకు కొనసాగే అంవకాశం ఉందని తెలిపింది..
Also Read: Rajasthan Accident: మరో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది స్పాట్ డెడ్.. 50 మందికి పైగా గాయాలు
భాగ్యనగరంలో..
హైదరాబాద్(Hyderabad)లో గతరెండు రోజులుగా మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తున్నాయి. నేడు మాదాపూర్, ఖైరతాబాద్, హయత్ నగర్ ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు కురిసాయి. రాబోయే మరికొన్ని గంటల్లో భాగ్యనగం అంతటా వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతవరణ శాఖ తెలిపింది. ఓ పక్కా మొంథా తుపాను ఎఫెక్ట్‌తో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలుకురిసిన సంగతి తెలిసిందే దీంతో రైతుల పండించిన పంటలు సైతం తడిసిముద్దై తీవ్ర నష్టాన్ని కలిగించాయి.
Also Read: Kavitha: పత్తి తేమ శాతం సడలింపు ఇవ్వాలి.. కేంద్రానికి కవిత లేఖ!
