Rajasthan Accident: రాజస్థాన్ లోని జైపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లోహామండి రోడ్డు (Lohamandi Road)లో వేగంగా వచ్చిన ఒక ట్రక్కు అదుపుతప్పి అనేక వాహనాలను ఢీకొట్టింది. ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా ముందున్న ద్విచక్ర వాహనాలు, కార్లపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 12 మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మంది వరకూ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఘటనాస్థలిలో భీతావాహ పరిస్థితులు తలెత్తాయి.
మద్యం మత్తులో డ్రైవర్..
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ట్రక్కు డ్రైవర్ ఫుల్లుగా మద్యం సేవించి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ట్రక్కుపై నియంత్రణ కోల్పోయి రోడ్డుపై ఉన్న కార్లు, బైకులను ఢీకొట్టుకుంటూ అర కిలోమీటర్ వరకూ దూసుకెళ్లినట్లు సమాచారం. కాగా ప్రమాద అనంతర దృశ్యాలు చాలా భయానకంగా ఉన్నాయి. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు.. హుటాహుటీనా ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
जयपुर लोहा मंडी रोड पर एक ट्रेलर ने लगभग आधा किलोमीटर तक लगभग 20 गाडियों को कुचला 15 की मौत ये राजस्थान को किसकी नजर लग गई भगवान आये दिन ऐसें हादसे हो रहे हैं। #news #rajasthan #sad #jaipur #Pankhilal pic.twitter.com/hBUnjuNRLA
— PankhiLal Education (@Pankhi_Eduction) November 3, 2025
పోలీసుల అదుపులో డ్రైవర్
ప్రమాదంలో గాయపడిన వారిని జైపూర్ లోని సవాయి మాన్సింగ్ ఆస్పత్రికి అధికారులు తరలించారు. తీవ్రంగా గాయపడిన వారికి అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. మరోవైపు ట్రక్ డ్రైవర్ ను జైపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అతడు మద్యం సేవించి ట్రక్కు నడిపాడా? లేదా? అని నిర్దారించేందుకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా.. ఇది రాజస్థాన్ లో 24 గంటలు వ్యవధిలో జరిగిన రెండో పెద్ద రోడ్డు ప్రమాదం.
At least ten people were killed & several others were injured in #Jaipur as a dumpster truck driver, reportedly under the influence of alcohol, went on a rampage & ploughed through multiple vehicles for 5 kms.#RajasthanNews #Rajasthan #TruckDriver #JaipurAccident #JaipurNews pic.twitter.com/VJvgWCJbp0
— Salar News (@EnglishSalar) November 3, 2025
Also Read: Bus Accidents In Telangana: తెలంగాణలో జరిగిన భయంకర బస్సు ప్రమాదాలు.. ఇవి ఎప్పటికీ పీడకలే!
యాత్రికుల బస్సుకు ప్రమాదం
ఆదివారం రాత్రి ఫాలోడీ జిల్లాలోని మాటోరా ప్రాంతంలో కూడా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జోధ్‌పూర్ నుంచి బికనేర్ జిల్లా కోలాయత్ వైపు వెళ్తున్న యాత్రికులతో వెళ్తోన్న టెంపో ట్రావెల్ బస్సు రహదారి పక్కన నిలిపి ఉంచిన ట్రక్కును బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో 15 మంది యాత్రికులు మృతి చెందారు. మృతులంతా జోధ్‌పూర్‌లోని సూరసాగర్ ప్రాంతానికి చెందినవారని తెలుస్తోంది. ప్రమాద తీవ్రత కారణంగా యాత్రికుల బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ట్రక్కును గమనించని డ్రైవర్ దానిని వెనకనుంచి ఢీకొట్టాడు.

